ప్రొద్దుటూరు టౌన్ (వైఎస్సార్ జిల్లా) : ‘పింఛన్ తీసుకుని వస్తానమ్మా’ అని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన ఓ వృద్ధురాలు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వెంకటేశ్వర్లుపేటలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని 39వ వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో పింఛన్ పంపిణీ జరుగుతోంది. ఈ వార్డులో 250 మందికిపైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.
గుడిమి లక్ష్మమ్మ (65) అనే వృద్ధురాలు ఉదయం 9 గంటలకు పింఛన్ కేంద్రం వద్దకు వెళ్లి చాలా సేపు ఎండలో నిల్చుంది. 10.30 గంటలకు పింఛన్ తీసుకుని, కుమారుడు శివ ఇంటికి వెళుతూ దారిలో కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.
పింఛను కోసం వెళ్లి వృద్ధురాలి మృతి
Published Sat, Apr 2 2016 6:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement