చిన్నారులతో హీరో హరీష్
ప్రొద్దుటూరు: పాతతరం సినిమా హీరో హరీష్ (ప్రేమఖైదీ) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం ప్రత్యక్షమయ్యారు. సంస్కృతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలోని కుట్టుశిక్షణా కేంద్రానికి వచ్చిన ఆయన పక్కనే ఉన్న వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కొద్దిసేపు గడిపి వారిని సంతోషపరిచారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్చంద సంస్థ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ప్రజాచైతన్య సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.