ఎన్‌డీఏ హయాంలో తెరపైకి వచ్చిన ప్రొద్దుటూరు–కంభం రైల్వేలైన్ మార్గం
ఐదేళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రొద్దుటూరు–కంభం రైలుమార్గం కథ కంచికి చేరేటట్లు కనిపిస్తోంది. కడప, ప్రకాశం జిల్లాలను కలుపుతూ ఈ రైల్వేలైన్ ఏర్ప డితే రెండుజిల్లాల మధ్య ఆర్థికవ్యా
పార రంగాల పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని భావించారు. గుంటూరు–గుంతకల్ మార్గంలో ఉన్న కంభం రైల్వేస్టేషన్‌కు, ఎర్రగుంట్ల–నం ద్యాల మార్గంలో ఉన్న ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్ల మధ్య లైను వస్తుందనే ఆశలు అడియాశలుగామారాయి.
రాజంపేట: రెండో ముంబయిగా ప్రసిద్ధి పొందిన ప్రొద్దుటూరు నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం ప్రాంతాలను కలిపే రైల్వేలైన్ కలగానే మిగిలిపోనుంది. ఐదేళ్ల కిందట ఇది తెరపైకి వచ్చినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. రైల్వేమంత్రిత్వశాఖ కేవలం సర్వేకు నిధులు కేటాయిస్తోంది.ఇప్పుడు (2017–2018లో) ప్రణాళిక సంఘం ఆమోదించలేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహనరెడ్డి ఇటీవల లోక్‌సభలో ప్రశ్నించిన నేపథ్యంలో ప్రొద్దుటూరు–కంభం రైల్వేలైన ప్రణాళికసంఘం ఆమోదించలేదని రైల్వేశాఖ స్పష్టంచేసింది. దీంతో ఈ మార్గంపై నీలినీడలు అలుముకున్నాయి.
తప్పని ఎదురుచూపులు: యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైలుమార్గం, ఎన్‌డీ ఉన్న సమయంలో మరో రైలుమార్గం ఇలా బడ్జెట్‌లో ప్రకటించడం తప్ప మరొకటి కనిపించడంలేదు. జిల్లాలో రెండు కొత్త లైన్ల పరిస్థితి ఎటూ తేలడంలేదు. సర్వేలు చేయిస్తున్నామని రైల్వేమంత్రిత్వశాఖ చెప్పుకుంటోంది.బడ్జెట్‌లో కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. కొత్త రైలుమార్గం ఎప్పుడు వస్తుందో అని ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
సర్వేతోసరి..
కొత్త రైలుమార్గంగా కంభం–ప్రొద్దుటూరులైన్‌ను తీసుకొచ్చారు. ప్రధాని మోదీ బడ్జెట్‌లో సర్వే కోసం నిధులు ప్రకటించారు.ఇందుకోసం ఆర్‌వీఎన్‌ఎల్ గతంలో టెండర్లను కూడా పిలిచింది. 2013–2014 రైల్వే బడ్జెట్‌లో కంభం–ప్రొద్దుటూరు కొత్త రైల్వే లైన్ కోసం రూ.10లక్షలు కేటాయించారు. అంచనా వ్యయం రూ.829కోట్లు కాగా దూరం 142కిలోమీటర్లు ఉందని రైల్వే వర్గాల సమాచారం.2016లో రైల్వే బడ్జెట్‌లో రూ.కోటి వ్యయం చేశారు. ఈవిధంగా ఈ మార్గం సర్వే దశలోనే ఉంది. 2017–18లో ఈ లైను గురించి ఊసేఎత్తలేదు. ఇప్పటికే కంభం పరిసర ప్రాంతాల్లో సర్వే చేసి వదిలేశారు. గతంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కొత్త రైలుమార్గాల గురించి రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment