ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం: భార్య కాపురానికి రాలేదనే కారణంతో గురుప్రతాప్ అనే యువకుడు విషద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రొద్దుటూరులోని ఆర్ట్స్‌కాలేజి రోడ్డుకు చెందిన సుంకేసుల గురుప్రతాప్ బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌ష్టేషన్ ఆవరణలో విషద్రావణం తాగాడు. పోలీసులు వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన మేరకు.. గురుప్రతాప్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
చదవండి: (రాజేంద్రనగర్‌లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం)
అతనికి పట్టణంలోని గీతాశ్రమంవీధికి చెందిన అనూషతో ఏడేళ్ల క్రితం వివాహమైంది.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతాప్ మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే కారణంతో భార్య 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అతను వారి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వన్‌టౌన్ పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు.
ఈ క్రమంలోనే అతను తన వెంట తెచ్చుకున్న విషద్రావణం తాగుతుండగా పోలీసులు సీసాను లాక్కున్నారు. వెంటనే ప్రతాప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.
చదవండి: ('ఏడాది కాపురం చేసి ఇప్పుడు మీకు, నాకు సంబంధం లేదంటున్నాడు')
Comments
Please login to add a commentAdd a comment