విధుల నుంచి తప్పించారని విషం తాగింది.. | nurse suicide attempt due to removal of job | Sakshi
Sakshi News home page

విధుల నుంచి తప్పించారని విషం తాగింది..

Published Thu, Aug 6 2015 4:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

nurse suicide attempt due to removal of job

ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): విధుల నుంచి తప్పించారని మనస్తాపం చెందిన ఒక నర్సు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన గురవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మాణిక్యమ్మ(32) ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలోని లేబర్ వార్డులో నర్సుగా పని చేస్తుంది. కాగా, ప్రజల వద్ద నుంచి లంచం తీసుకుంటుందని ఆరోపణలు రావడంతో డీసీహెచ్‌ఎస్ రామేశ్వరుడు గత నెల 29న విధుల నుంచి తప్పించారు.

విధుల నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ప్రొద్దుటూరులోని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్యే రాచమళ్లు శివప్రసాద్‌రెడ్డి మాణిక్యమ్మను పరామర్శించారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఆమెకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement