ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర: వయసు మీదపడుతున్నా ఆమెకు పెళ్లి కావడం లేదు. జీవితంలో నీకు పెళ్లి కాదంటూ ఆట పట్టించారు. దీంతో మనస్థాపానికి గురైన ఓ నర్సు.. ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. గిరినగర్‌లో సుమిత్ర (32) అనే యువతి నివాసం ఉంటోంది. స్థానిక ప్రశాంత్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పెళ్లి వయసు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. కానీ, చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. దీంతో, సుమిత్ర తీవ్ర ఆవేదనకు గురైంది.
తర్వాత యథావిధిగానే ఆమె మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వర్క్‌పై ఫోకస్ పెట్టింది. కాగా, తన స్నేహితులు, ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సహోద్యోగులు.. పెళ్లి విషయంలో ఆట పట్టించేవారు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో మనోవేదనకు గురైంది. గురువారం రాత్రి గదికి తాళం వేసుకొని ఉరి వేసుకుంది. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా శవమై కనిపించింది. సమాచారం అందుకున్న గిరినగర పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి తానేకారణమంటూ అందులో సుమిత్ర రాసినట్లు గుర్తించారు. మృతదేహానికి కిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్‌లో దారుణం.. మహిళను మెయింటెనెన్స్ రూమ్‌లోకి లాక్కెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment