nurse suicide attempt
-
ఏడో అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య
కొరుక్కుపేట: ఏడో అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య చేసుకున్న ఘటన చైన్నె సమీపంలోని సిప్ కాట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ 30కి పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయి. మొత్తం 62 వేల మంది పనిచేస్తున్నారు. వారి వైద్య సౌకర్యం కోసం 7వ అంతస్తులో చిన్న ఆస్పత్రి నడుస్తోంది. ఇక్కడ 14 మంది వైద్యులు, నర్సులు ఉన్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు డాక్టర్లు, నర్సులు నైట్ డ్యూటీకి వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో 7వ అంతస్తు నుంచి నర్సు కిందకు దూకింది. గార్డులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. కేలంబాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమెను ఈరోడ్ జిల్లా కళ్యాణూరుకు చెందిన పళనిస్వామి కుమార్తె జగశ్రీ (26)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: నర్సు ఆత్మహత్య.. కారణం అదేనా..?
యశవంతపుర: వయసు మీదపడుతున్నా ఆమెకు పెళ్లి కావడం లేదు. జీవితంలో నీకు పెళ్లి కాదంటూ ఆట పట్టించారు. దీంతో మనస్థాపానికి గురైన ఓ నర్సు.. ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గిరినగర్‌లో సుమిత్ర (32) అనే యువతి నివాసం ఉంటోంది. స్థానిక ప్రశాంత్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పెళ్లి వయసు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. కానీ, చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. దీంతో, సుమిత్ర తీవ్ర ఆవేదనకు గురైంది. తర్వాత యథావిధిగానే ఆమె మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వర్క్‌పై ఫోకస్ పెట్టింది. కాగా, తన స్నేహితులు, ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సహోద్యోగులు.. పెళ్లి విషయంలో ఆట పట్టించేవారు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో మనోవేదనకు గురైంది. గురువారం రాత్రి గదికి తాళం వేసుకొని ఉరి వేసుకుంది. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా శవమై కనిపించింది. సమాచారం అందుకున్న గిరినగర పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి తానేకారణమంటూ అందులో సుమిత్ర రాసినట్లు గుర్తించారు. మృతదేహానికి కిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో దారుణం.. మహిళను మెయింటెనెన్స్ రూమ్‌లోకి లాక్కెళ్లి.. -
విధుల నుంచి తప్పించారని విషం తాగింది..
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): విధుల నుంచి తప్పించారని మనస్తాపం చెందిన ఒక నర్సు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన గురవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మాణిక్యమ్మ(32) ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలోని లేబర్ వార్డులో నర్సుగా పని చేస్తుంది. కాగా, ప్రజల వద్ద నుంచి లంచం తీసుకుంటుందని ఆరోపణలు రావడంతో డీసీహెచ్ఎస్ రామేశ్వరుడు గత నెల 29న విధుల నుంచి తప్పించారు. విధుల నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ప్రొద్దుటూరులోని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్యే రాచమళ్లు శివప్రసాద్‌రెడ్డి మాణిక్యమ్మను పరామర్శించారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఆమెకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.