ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని రాయల్‌కౌంటీ రిసార్ట్స్‌లో రాయలసీమ ప్రముఖుల సదస్సు జరిగింది. గురువారం జరిగిన ఈ సదస్సులో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తెల్లపల్లి నర్సింహారెడ్డి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ సమస్యలపై చర్చించారు. సెప్టెంబర్‌లో ప్రధాని మోదీని రాయలసీమలో పర్యటించాలని కోరనున్నట్లు నర్సింహారెడ్డి తెలిపారు. రాయలసీమ కరవు కాటకాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.