వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 17వ రోజు షెడ్యూల్‌ ఇదే.. | YSRCP Samajika Sadhikara Bus Yatra 17th Day Schedule | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 17వ రోజు షెడ్యూల్‌ ఇదే..

Published Mon, Nov 20 2023 7:35 AM | Last Updated on Mon, Nov 20 2023 6:13 PM

YSRCP Samajika Sadhikara Bus Yatra 17th Day Schedule - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎ‍స్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. సామాజిక సాధికార యాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ఈరోజు బస్సుయాత్ర ఎలమంచిలి, నరసరావుపేట, మైదుకూరు నియోజకవర్గాలలో జరుగనుంది. 

బస్సుయాత్ర వివరాలు ఇవే..
►అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర
►మధ్యాహ్నం 12:30 గంటలకు ఎలమంచిలిలో వైఎస్సార్‌సీపీ నాయకుల మీడియా సమావేశం
►మధ్యాహ్నం 2:30 గంటలకు వైఎస్సార్ విగ్రహం నుంచి అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ
►మధ్యాహ్నం 3:30 గంటలకు అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్‌లో బహిరంగ సభ
►సభకు హాజరుకానున్న మంత్రులు ధర్మాన ప్రసాద్, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, తదితరులు

పల్నాడులో ఇలా.. 
►పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
►మధ్యాహ్నం 2:15గంటలకు A1 కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం
►మధ్యాహ్నం 3:15 గంటలకి పాదయాత్ర ప్రారంభం
►మల్లమ్మ సెంటర్, శివుని బొమ్మ సెంటర్ మీదుగా పల్నాడు బస్టాండు వరకు పాదయాత్ర
►సాయంత్రం 5:15 గంటలకి పల్నాడు బస్టాండు సెంటర్‌లో బహిరంగ సభ

వైఎస్సార్‌ జిల్లాలో ఇలా..
►వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
►మధ్యాహ్నం 2:30 గంటలకు కేఎస్‌సీ కళ్యాణమండపంలో వైఎ‍స్సార్‌సీపీ నేతల విలేకర్ల సమావేశం
►మధ్యాహ్నం 3 గంటలకు కేసీ కెనాల్ మీదుగా కార్ల ర్యాలీ
►మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రొద్దుటూరు రోడ్‌లో బహిరంగ సభ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement