
సాక్షి, చిత్తూరు/పలమనేరు: సాధికార నినాదంతో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మార్మోగింది. నియోజకవర్గంలోని పలమనేరు, పెద్దపంజాణి, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల నుంచి భారీగా తరలి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలతో శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర ఘనంగా జరిగింది. యాత్రలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు తొలుత గంగవరం వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిం చారు.
ఆనంతరం భారీ జనసందోహం మధ్య యాత్ర బయల్దేరింది. ఈ యాత్రకు అడుగగడునా ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అని నినదిస్తూ పూలు జల్లుతూ యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం అశేష జన సందోహం మధ్య సామాజిక సాధికార సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జగనే కావాలి అంటూ ప్రజలు నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. సన్నగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా సభను విజయవంతం చేశారు.
జగనన్నతోనే సామాజిక న్యాయం: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. సామాజిక న్యాయమంటే ఏమిటో చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వస్తూనే బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దారని, అందరికీ సొంతింటి కలను నిజం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు.
రాజకీయ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారన్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటిలోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేశారని చెప్పారు. సీఎం జగన్ చలవతో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారని అన్నారు.
సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 అభివృద్ధి నిరోధక శక్తులని పేద పిల్లల చదువుల కోసం ట్యాబ్‌లిస్తే వాటి కారణంగా ఎంతో నష్టమంటూ రామోజీరావు తప్పుడు కథనం రాశారని, ఆయన మనవడు మాత్రం ట్యాబ్‌లు వాడొచ్చా అని ప్రశ్నించారు. రూ.700 కోట్లతో పలాసలో ఫిల్టర్ నీళి్చచ్చి, కిడ్నీ ఆస్పత్రిని కట్టినా ఎల్లోమీడియా కడుపు మంటతో తప్పుడు రాతలు రాసిందన్నారు.
ప్రతిపక్షానికి బాధగా ఉంది: మంత్రి జయరామ్
బీసీలకు పెద్దపీట వేసింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. మన బిడ్డలు బాగా చదివి బాగుపడుతుంటే ప్రతిపక్షానికి చాలా బాధగా ఉందని అన్నారు. వాల్మీకి కులస్థుడైన తన తలరాతను మార్చింది కేవలం జగనన్నే అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలంటే జగనన్న రావాల్సిందే
మాజీమంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నాఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనారిటీ అని చెప్పే వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పనులు కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ ఇంటి ముందుకెళ్లి నిలబడాలని, అదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో పథకాలే ఇంటి ముందుకొస్తున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో 8 చోట్ల పోటీ చేసినా డిపాజిట్లు దక్కని దత్తపుత్రుడు ఇక్కడకొచ్చి తాటతీస్తా.. తొక్కతీస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మరో శ్రీలంక అని విషప్రచారం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు పలమనేరు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఖర్చు చేశారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ చెప్పారు. ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ సీఎం జగన్‌నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు భరత్, రమేష్ యాదవ్, డీసీసీబీ చైర్‌పర్సన్ రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర
దేవరపల్లి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన మేలు, వారిని సామాజిక సాధికారత వైపు నడిపించిన వైనాన్ని వివరించేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆదివారం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment