అంతా గందరగోళం..! | teachers Adjusting process Confusion changed | Sakshi
Sakshi News home page

అంతా గందరగోళం..!

Published Thu, Dec 4 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

అంతా గందరగోళం..!

అంతా గందరగోళం..!

జిల్లాలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా మారింది. సర్దుబాటులో రేషనలైజేషన్ జీఓలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల జిల్లాలో భారీగా టీచర్ పోస్టులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మిగులు పోస్టులున్నాయి, వాటిని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయంపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవ డంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
 
 విజయనగరం అర్బన్ : పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ప్రభుత్వం చేపడుతున్న సర్దుబాటు ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా మా రింది. ఈ ప్రక్రియకు రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) జీఓలను జోడించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా తాత్కాలిక పద్ధతిపై సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల మిగులు, కొరతను గుర్తించడానికి గతంలో జారీ చేసిన రేషనలైజేషన్ (జీఓ 55, జీఓ 61) జీఓలను అమలు చేస్తోంది.
 
  విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా కాకుండా రేషనలైజేషన్ జీఓల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపడితే జిల్లాలో బదిలీలు కోరే ఉపాధ్యాయులకు స్థానాలు దొరికే పరిస్థితి ఉండదు.   పదోన్నతుల వల్ల ఖాళీ అయిన స్థానాలను తప్పనిసరిగా డీఎస్సీ నియామకాల ద్వారా భ ర్తీ చేయాలి, అంతవరకూ ఈ పోస్టులను ఖాళీగానే ఉం చాలి.
   విద్యార్థులు లేని కారణంగా ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయాల్సి ఉంటుంది.
 
   ఉపాధ్యాయ పోస్టుల  సంఖ్య భారీగా తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. అదే సర్దుబాటు ప్రక్రియ ద్వారా అయితే ఈ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. డీఎస్సీ పోస్టులను భర్తీ చేసే వరకు ఆయా స్థానాలలో సర్దుబాటు ఉపాధ్యాయులుంటారు. కానీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల మిగులు, కొరత వంటి వివరాలు సేకరించినప్పుడు రేషనలైజేషన్ విధానాన్నే పాటించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఆ మేరకే ఎంఈఓలు నివేదికలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు   వ్యతి రేకిస్తున్నాయి. మిగులు ఉపాధ్యాయులను ఏవిధంగా సర్దుబాటు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా విద్యాశాఖ గోప్యంగా ఉంచుతోంది.  దీనివల్ల సర్దు   బాబు ప్రక్రియ ముందడుగు వేస్తుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ ప్రక్రియ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారా..? లేదా సీనియార్టీ జాబితా ఆధారంగా అవసరమైన చోటకు తాత్కాలికంగా నియామకాలు జరుగుతాయా అనే అంశంపై ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయులను రేషనలైజేషన్‌లో సర్దుబాబు చేసేందుకు సీనియార్టీ జాబితాలను తయారు చేయాల్సి ఉంది. జిల్లాలో ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.  
 
  విద్యాహక్కు చట్టానికి పొంతనలేని  జీఓ నంబర్ 55
 విద్యాహక్కు చట్టం ప్రకారం 19 మంది విద్యార్థులకు ఒక టీచర్, 35 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు ఉండాలన్నది నిబంధన. ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి 40 మందికి ఒక సెక్షన్ చొప్పున ఒక టీచర్‌ను ఇవ్వాలన్న నిబంధన కూడా ఉంది. 40 మంది కంటే అధికంగా పిల్లలు ఉంటే     మరో సెక్షన్‌ను మంజూరు చేసి మరో టీచర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందుకు విరుద్ధంగా 2011 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీఓ 55ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఉన్నత పాఠశాలలో ఆయా తరగతుల విద్యార్థుల సంఖ్యను కాకుండా పాఠశాలలో మొత్తం ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులను కేటాయించాలనే నిబంధన విధిం చింది. విద్యాహక్కు చట్టానికి, జీఓ న ంబర్ 55కు పొంతన లేకపోవడంతో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ సందిగ్ధంలో పడింది. జిల్లాలో నాలుగేళ్ల క్రితం రేషనలైజేషన్ ప్రక్రియతో బదిలీలు జరిగాయి. విద్యాహక్కు చట్టానికి పొంతనలేని రేషన లైజేషన్ జీఓలు అమలు చేయడం వల్ల అప్పటిలో 150 పోస్టుల వరకు రద్దయ్యాయి. ఇప్పుడూ అలాగే చేస్తే మరిన్ని పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యా య వర్గాలు ఆందోళన పడుతున్నాయి.  

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement