నెల్లిమర్ల టీడీపీలో అంతర్గత కుమ్ములాట | - | Sakshi
Sakshi News home page

నెల్లిమర్ల టీడీపీలో అంతర్గత కుమ్ములాట

Published Mon, Jan 15 2024 12:46 AM | Last Updated on Sat, Feb 3 2024 6:04 PM

మాజీ ఎమ్మెల్యే పతివాడ ఇంటి వద్ద సమావేశమైన  టీడీపీ నేతలు చిన్నంనాయుడు, సన్యాసినాయుడు  - Sakshi

మాజీ ఎమ్మెల్యే పతివాడ ఇంటి వద్ద సమావేశమైన టీడీపీ నేతలు చిన్నంనాయుడు, సన్యాసినాయుడు

పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. సంక్రాంతి వేళ డెంకాడ మండలంలోని సేరిపొలంటీడీపీ నేత వెంపడాపు సూర్యనారాయణ కుమారుడు రమేష్‌నాయుడు పేరిట ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ఫ్లెక్సీలో పూసపాటిరేగ మండలానికి చెందిన టీడీపీ నేతల ఫొటోలు అనుమతి లేకుండా వేయడంతో మండల టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూసపాటిరేగ మండలం, చల్లవానితోటలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ఇంటి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎం.చిన్నంనాయుడు, ఎం.శంకరరావు, పి.సన్యాసినాయుడు, విక్రం జగన్నాథం తదితర టీడీపీ నేతలు ఫ్లెక్సీల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సన్యాసినాయుడు అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో వెంపడాపు రమేష్‌నాయుడును ఎప్పుడూ చూడలేదని, దొడ్డిదారిన రాజకీయాలు చేయడమేంటని అన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక టీడీపీలో కీలకనేతలు ఎవరైనా ఉన్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఏది ఏమైనా నియోజకవర్గ టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఎంతోకాలంగా ఉన్న విబేధాలు ఫ్లెక్సీ ఏర్పాటుతో చెలరేగిన గొడవలో బహిర్గతమయ్యాయని అంతా అనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement