
సాక్షి, విజయవాడ: చంద్రబాబు తోకలు ఎవరూ గెలవరంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. శుక్రవారం ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అందరి జీవితాలు బాగుండాలంటే సీఎం జగన్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు ప్రజల వద్ద బోండా ఉమా లేడని.. బైక్ రేసులు, భూ కబ్జాలు, దొంగతనాలు, గుండాయిజం, కాల్ మనీలు చేసింది టీడీపీ నేతలేనని దుయ్యబట్టారు.
‘‘తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది. బోండా ఉమా ఆఫీసు ఉన్న ప్రాంతంలోనే ఉమాకి మెజార్టీ రాదు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలవడం కలే. బోండా ఉమాకు సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడే అర్హత లేదని వెల్లంపల్లి మండిపడ్డారు.
షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఇలా మాట్లాడటం దారుణం. ఆమె అంటే మాకు గౌరవం. గతంలో వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లు ఇప్పుడు షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓటు, సీటు లేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దివంగత సీఎం వైఎస్సార్ పేరును కాంగ్రెస్.. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయించడం దారుణం. సోనియా గాంధీకి తెలియకుండానే వైస్సార్ మీద కేసు పెట్టారా?. 16 నెలలు సీఎం జగన్‌ను జైల్లో పెట్టింది వాస్తవం కాదా?. అలాంటి పార్టీలో షర్మిలమ్మ ఎలా చేరారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే
Comments
Please login to add a commentAdd a comment