విజయనగరం మున్సిపాలిటీ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన వైఎస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వైఎస్‌ఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరపాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు సర్వం సిద్ధం చేశారు. ఇందులోభాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు ఆధ్వర్యంలో విజయనగరం లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన సామూహిక రక్తదాన శిబిరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల ప్రారంభించనున్నారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం ఎదుట గల వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.
బొబ్బిలిలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు గొల్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటుతారు. రంగరాయపురంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తారు. విజయనగరం పార్లమెంటరీ నియెజకవర్గ ఇన్‌చార్జి బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చీపురుపల్లి టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో మెగా వైద్యశిబిరం, రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. నెల్లిమర్ల మండల పార్టీ అధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ నేతృత్వంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చే.యనున్నారు. జరజాపుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయనున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయనున్నారు. పార్వతీపురంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి వెంకటేష్ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లర్యాలీ నిర్వహించిన అనంతరం ఏరియా ఆస్పత్రిలో 200 మంది రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేయనున్నారు.
వైఎస్‌ఆర్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
Published Wed, Jul 8 2015 12:39 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement
Advertisement