విజయనగరం: వచ్చే నెల 8వ తేదీ నుంచి చేపట్టబోయే ‘గడపగడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమానికి నియోజకవర్గం ఇన్‌చార్జీలు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. బుధవారం ఆయన విజయనగరంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. ప్రజల అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో యంత్రాంగం విఫలమైందని వీరభద్రస్వామి ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.