వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈనెల 13న కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ
విజయనగరం మున్సిపాలిటీ : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈనెల 13న కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో హైదరాబాద్‌లో గల సెక్రటేరియేట్‌లో నామినేషన్ వేయడం జరుగుతుందన్నారు. మంగళవారం స్థానిక కోలగట్ల నివాసంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోలగట్లను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోలగట్ల నేతృత్వంలో జిల్లాలో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చనుమల్ల వెంకటరమణ, జి.సూరపరాజు, ఎస్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.