
'దోచుకో-దాచుకో పథకం అమలు చేస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దోచుకో- దాచుకో పథకాన్ని అమలుచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. హైదరాబాద్లో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... పెదబాబు దోస్తుంటే..చినబాబు దాస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు టీడీపీ పెద్దలే ఇసుకను దోచుకున్నారని...ఇక ఉచిత ఇసుకతో కార్యకర్తలు దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఏపీకి బడ్జెట్లో అన్యాయం జరిగినా టీడీపీ నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని కోలగట్ల అన్నారు.