మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పక్కన బెల్లాన, మజ్జి శ్రీనివాసరావు, తదితరులు
విజయనగరం మున్సిపాలిటీ: విభజనతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద రాజకీయ డ్రామాకు తెరలేపారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలు చైతన్యవంతులై టీడీపీని ఛీ కొడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రులతో రాజీనామా డ్రామా మొదలుపెట్టారన్నారు. గురువారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్ల పాటు కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా చెప్పుకుని ప్యాకేజీల పేరిట కోట్లాది రూపాయలు స్వాహా చేసిన చంద్రబాబునాయుడు నేడు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తీసుకువచ్చిన సమయంలో హోదా కోసం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న జిల్లాకు చెందిన పూసపాటి అశోక్‌గజపతిరాజు హోదా కోసం నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అఖిలపక్షం ఏర్పాటు చేయండి..
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్నారన్నారు. చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, విభజనతో అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవని అన్నారు. హోదావస్తే రాయితీలు వర్తించి పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధిచెందుతుందని చెప్పారు. పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యువభేరిల పేరిట 13 జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తే..ఆ కార్యక్రమాలకు హాజరైన విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడ్డ ముఖ్యమంత్రి నేడు హోదా కావాలంటూ మాట్లాడటం దారుణమన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన వద్ద ఆఖరి బంతి ఉందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచితే.... హోదా సాధన విషయంలో చంద్రబాబు అదే «ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములునాయుడు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్. బంగారునాయు డు, మండల పార్టీ అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, పతివాడ అప్పలనాయుడు, కె. తవిటిరాజు, కనకల ప్రసాద్, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్‌వీవీ రాజేష్, పట్నాన పైడిరాజు భోగి రమణ, దాట్ల భాస్కరరాజు, అల్లు చాణుక్య, జీవీ రంగారావు, రెడ్డి గురుమూర్తి, తాట్రాజు కృష్ణ, సత్తరపు శంకరరావు, బోడసింగి ఈశ్వరరావు, గండ్రేటి సన్యాసిరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment