'తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయి' | kolagatla veerabhadra swamy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయి'

Published Sun, Apr 3 2016 11:58 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

'తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయి' - Sakshi

'తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయి'

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఆదివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడుతూ.... సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో చేసిన తొలి ఐదు సంతకాలు ఏమయ్యాయని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో బెల్టుషాపులు బాగా పెరిగాయని విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఏమైందని నిలదీశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే యత్నం చేశారన్నారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement