ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించగానే సీఎం చంద్రబాబు భుజాలు తడుముకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులను చిన్న చూపు చూసింది చంద్రబాబేనని విమర్శించారు. నంద్యాలలో అభివృద్ధి పేరుతో వ్యాపారుల షాపులను అంత్యంత దయనీయంగా ధ్వంసం చేశారని.. కాకినాడలో కూడా 45 దుఖాణాలు ధ్వంసం చేసి కేవలం 24 షాపులకు టీడీఎస్ ప్రకటించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మూడున్నర ఏళ్లుగా కాకినాడకు ఏమీ చేయలేని చంద్రబాబు.. రానున్న ఏడాదిన్నరలో ఏమి చేస్తారో ఓటర్లు ఆలోచించాలన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ధనబలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు.