వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బొబ్బిలి రాజులుంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి
బొబ్బిలి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బొబ్బిలి రాజులుంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం బొబ్బిలి కోటలో విజయనగరం పార్లమెంటరీ స్థానం పరిశీలకుడు బె ల్లాన చంద్రశేఖర్‌తో కలిసి బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, ఆర్వీఎస్‌కేకే రంగారావు (బేబినాయన)లతో చర్చించారు. ఈ సందర్భంంగా కోట ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా బొబ్బిలి రాజులపై రకరకాల ప్రచారాలు వస్తున్నాయని, వాటిని తొలగించడానికే తామిద్దరం బొబ్బిలి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. రాజులతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించినట్టు కోలగట్ల వివరించారు.