మాట్లాడుతున్న ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం మున్సిపాలిటీ : ప్రత్యేక హోదా సాధన కోసం అంటూ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం చేపట్టినవి అధర్మ దీక్షలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరబద్రస్వామి విమర్శించారు. తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగలు పడిన ఆరు మాసాలకు కుక్కలు అరిచిన చందంగా... నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి హోదా కోసం మాట్లాడని బాబు.. నేడు దీక్షలు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఒకప్పుడు హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని, హోదా కోసం జరిగే సభలకు వెళ్లేవారిని అరెస్టు చేసి జైల్లో పెడతామన్న చంద్రబాబు... ఇప్పుడు దీక్షల పేరుతో రూ.కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి మొసలి కన్నీరు కారుస్తూ చేస్తున్న కొంగ జపాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. నాలుగేళ్లుగా బా«ధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో హోదా ఆవశ్యకతను తెలియజెప్పేందుకు చేపట్టిన నిరసనలు, దీక్షలు, బంద్‌లను అణిచి వేతకు పాల్పడిన వ్యక్తి నేడు హోదా పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటన్నారు. నిజంగా హోదా కోసం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చార
ఆంధ్రుల హక్కులు తాకట్టుపెట్టిన ఘనత బాబుదే...
నేడు దీక్షలు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని, హోదా కోసం జరిగే సభలకు వెళ్లేవారిని అరెస్టు చేసి జైల్లో పెడతామన్న చంద్రబాబు... ఇప్పుడు దీక్షల పేరుతో రూ.కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి మొసలి కన్నీరు కారుస్తూ చేస్తున్న కొంగ జపాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. నాలుగేళ్లుగా బా«ధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో హోదా ఆవశ్యకతను తెలియజెప్పేందుకు చేపట్టిన నిరసనలు, దీక్షలు, బంద్‌లను అణిచి వేతకు పాల్పడిన వ్యక్తి నేడు హోదా పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటన్నారు. నిజంగా హోదా కోసం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై 10 ఏళ్ల పాటు హక్కులున్నా కేవలం ఓటుకు నోటు కేసుకు భయపడి హక్కులను తాకట్టుపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కోలగట్ల విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హమీని తన స్వార్వప్రయోజనాల కోసం విస్మరించారన్నారు. సమావేశంలో పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీలంటూ ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ హోదా కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
అధికార యంత్రాంగంతో ఏర్పాట్లు, దీక్షలకు అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులను తరలించుకునే దుస్థితికి దిగజారిపోయారన్నారు. జిల్లాలోని చీపురుపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా దీక్షలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ హోదా కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు దీక్షలు, బంద్‌లు చేపడితే ఢిల్లీవెళ్లి చేయాలంటూ నీతిలు చెప్పిన చంద్రబాబు నేడు రాష్ట్రంలో ఎలా దీక్షలు చేపడతారని ప్రశ్నించారు. ముందు పదవులకు రాజీనామా చేసి హోదా పోరులో పాల్గొనాలని డిమాండ్ చేశారు.
హోదా కోసం మాట్లాడే హక్కు అశోక్‌కు లేదు..
నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జిల్లాకు చెందిన ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజుకు ప్రత్యేక హోదా కోసం మాట్లాడే హక్కు లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సీటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ఎటువంటి ప్రాభవం చూపలేకపోయరని విమర్శించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన మంత్రి సుజయ్‌కృష్ణరంగారావులు హోదా కోసం మాట్లాడం హాస్యాస్పందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సా«ధించి తీరుతామన్నారు.
సమావేశంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కేవీ సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పార్టీ విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్‌వీవీ రాజేష్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మారంబాల బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, షకీల్, తట్రాజు కృష్ణ, పట్నాన పైడిరాజు, సత్తరపు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment