Vizianagara kings
-
ఏపీఓ ఎవరో..?
బొబ్బిలి రూరల్ : బొబ్బిలి మండలంలో ఉపాధి పథకం ఏపీఓ ఎవరన్నది సందేహాస్పదంగా మారింది. ఈ నెల 9న డ్వామా పీడీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీలను తెర్లాం మండలానికి, అక్కడి ఏపీఓ కె.కేశవరావును బొబ్బిలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 12న ఎంపీడీఓ ఆర్వి.పద్మజకు ఆదేశాలు అందాయి. ఈ నెల 18న తెర్లాం ఏపీఓ కె.కేశవరావు బొబ్బిలిలో విధుల్లో చేరారు. కానీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీల మాత్రం బొబ్బిలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే ఫీల్డుకు వెళ్లి వివరాలు విలేకరులకు తెలిపారు. తాను ఇక్కడ రిలీవ్ కాలేదని, కేశవరావు తెర్లాంలో రిలీవ్ కాలేదని ఆమె చెబుతున్నారు. అయితే కేశవరావు విధుల్లో చేరి 2, 3 రోజులలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తానని ఎంపీడీఓకు తెలిపినట్లు సమాచారం. రిలీవ్ కావాల్సిందే.. ఏపీఓ సుశీల రిలీవ్ కావాల్సిందేనని ఎంపీడీఓ ఆర్వి.పద్మజ తెలిపారు. పీడీ ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు తెర్లాం ఏపీఓ కేశవరావు బొబ్బిలిలో ఈ నెల 18న విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. కె.సుశీల విధులు నిర్వర్తించినా అధికారిక కార్యక్రమాలకు ఏపీఓ కేశవరావే అని తెలిపారు. రాజకీయ ఒత్తిడులే కారణమా..? ఏపీఓల బదిలీకి రాజకీయ ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. టీడీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రి సోదరుడు బేబీనాయన ఈ బదిలీలకు కారకుడని సమాచారం. అయితే తాను మంత్రి సుజయ్ వద్దే విషయం తేల్చుకుంటానని ఏపీఓ సుశీల చెప్పడం గమనార్హం. నేను విధుల్లో చేరా.. నా బదిలీ ఉత్తర్వుల మేరకు నేను ఈ నెల 18న ఏపీఓగా బాధ్యతలు స్వీకరించాను. ఎంపీడీఓకు బాధ్యతలు ïస్వీకరిస్తున్నట్లుగా పత్రాలు కూడా ఇచ్చాను. – కె.కేశవరావు, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం నుంచి బదిలీ అయిన ఏపీఓ) నేనే ఏపీఓని.. నేను బొబ్బిలిలో, తెర్లాంలో కేశవరావు రిలీవ్ కాలేదు. బదిలీలు అయితే అందరికీ చేయాలి. కానీ ఇద్దరినే చేయడమేంటి..? నేనే విధులు నిర్వర్తిస్తాను. ఏపీఓ నేనే. మంత్రి వద్ద విషయం తేల్చుకుంటా. – కె.సుశీల, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం బదిలీ అయిన ఏపీఓ) వివాదం ఏమీ లేదు.. పీడీ ఆదేశాల మేరకు ఏపీఓలు బదిలీ అయ్యారు. నేను çసుశీలకు రిలీవింగ్ ఇచ్చాను. కేశవరావును విధుల్లో చేర్చుకున్నా. ఇందులో వివాదం ఏమీ లేదు. అధికారికంగా కేశవరావు ఏపీఓ. సుశీల ఉన్నా మేమేమీ అనలేం కదా. ఆమె ఇష్టం. (ఈ మేరకు బదిలీ, జాయినింగ్, రిలీవింగ్ ఉత్తర్వులు చూపారు.) – ఆర్వి.పద్మజ, ఎంపీడీఓ,బొబ్బిలి. -
టీడీపీది అధర్మ దీక్ష
విజయనగరం మున్సిపాలిటీ : ప్రత్యేక హోదా సాధన కోసం అంటూ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం చేపట్టినవి అధర్మ దీక్షలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరబద్రస్వామి విమర్శించారు. తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగలు పడిన ఆరు మాసాలకు కుక్కలు అరిచిన చందంగా... నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి హోదా కోసం మాట్లాడని బాబు.. నేడు దీక్షలు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని, హోదా కోసం జరిగే సభలకు వెళ్లేవారిని అరెస్టు చేసి జైల్లో పెడతామన్న చంద్రబాబు... ఇప్పుడు దీక్షల పేరుతో రూ.కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి మొసలి కన్నీరు కారుస్తూ చేస్తున్న కొంగ జపాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. నాలుగేళ్లుగా బా«ధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో హోదా ఆవశ్యకతను తెలియజెప్పేందుకు చేపట్టిన నిరసనలు, దీక్షలు, బంద్‌లను అణిచి వేతకు పాల్పడిన వ్యక్తి నేడు హోదా పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటన్నారు. నిజంగా హోదా కోసం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చార ఆంధ్రుల హక్కులు తాకట్టుపెట్టిన ఘనత బాబుదే... నేడు దీక్షలు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకప్పుడు హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని, హోదా కోసం జరిగే సభలకు వెళ్లేవారిని అరెస్టు చేసి జైల్లో పెడతామన్న చంద్రబాబు... ఇప్పుడు దీక్షల పేరుతో రూ.కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి మొసలి కన్నీరు కారుస్తూ చేస్తున్న కొంగ జపాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. నాలుగేళ్లుగా బా«ధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో హోదా ఆవశ్యకతను తెలియజెప్పేందుకు చేపట్టిన నిరసనలు, దీక్షలు, బంద్‌లను అణిచి వేతకు పాల్పడిన వ్యక్తి నేడు హోదా పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటన్నారు. నిజంగా హోదా కోసం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై 10 ఏళ్ల పాటు హక్కులున్నా కేవలం ఓటుకు నోటు కేసుకు భయపడి హక్కులను తాకట్టుపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కోలగట్ల విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హమీని తన స్వార్వప్రయోజనాల కోసం విస్మరించారన్నారు. సమావేశంలో పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీలంటూ ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ హోదా కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అధికార యంత్రాంగంతో ఏర్పాట్లు, దీక్షలకు అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులను తరలించుకునే దుస్థితికి దిగజారిపోయారన్నారు. జిల్లాలోని చీపురుపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా దీక్షలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ హోదా కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు దీక్షలు, బంద్‌లు చేపడితే ఢిల్లీవెళ్లి చేయాలంటూ నీతిలు చెప్పిన చంద్రబాబు నేడు రాష్ట్రంలో ఎలా దీక్షలు చేపడతారని ప్రశ్నించారు. ముందు పదవులకు రాజీనామా చేసి హోదా పోరులో పాల్గొనాలని డిమాండ్ చేశారు. హోదా కోసం మాట్లాడే హక్కు అశోక్‌కు లేదు.. నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జిల్లాకు చెందిన ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజుకు ప్రత్యేక హోదా కోసం మాట్లాడే హక్కు లేదని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సీటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ఎటువంటి ప్రాభవం చూపలేకపోయరని విమర్శించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన మంత్రి సుజయ్కృష్ణరంగారావులు హోదా కోసం మాట్లాడం హాస్యాస్పందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సా«ధించి తీరుతామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కేవీ సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పార్టీ విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మారంబాల బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు బొద్దాన అప్పారావు, షకీల్, తట్రాజు కృష్ణ, పట్నాన పైడిరాజు, సత్తరపు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం చేయండి.. లేకపోతే దూకుతా
సాలూరు : ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీకంగా అనుభవించి ఇప్పుడేమో పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్న యువకుడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ వాటర్‌ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన సాలూరు మండలం మజ్జలపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మావుడి గ్రామానికి చెందిన పెదపల్లి కృష్ణవేణి సాలూరు పట్టణంలోని మజ్జలపేట తాగునీటి రిజర్వాయర్‌పైకి గురువారం ఉదయం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్సైలు ఫకృద్దీన్, గణేష్‌తో పాటు అగ్నిమాపకాధికారి నోమేశ్వరరావు కూడా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందకు దిగాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె తనకు చావే శరణ్యమని, తనను మోసగించిన యువకుడితో వివాహం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. దీంతో పట్టణ ఎస్సై సమాచారాన్ని ఏఎస్పీ దీపికా పాటిల్‌కు ఫోన్లో సమాచారం అందించారు. ఆమె ఫోన్లో నేరుగా బాధిత మహిళతో మాట్లాడుతూ, ఆ యువకుడితో వివాహం చేయిస్తానని హామీ ఇవ్వడంతో బాధితురాలు కిందకు దిగింది. వెంటనే ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటికే పార్వతీపురం నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఏఎస్పీ బాధిత మహిళకు కౌన్సెలింగ్ చేశారు. మోసం చేయాలని చూస్తున్నాడు వాటర్ ట్యాంకు నుంచి కిందకు దిగిన అనంతరం కృష్ణవేణి మాట్లాడుతూ, తనకు ఇదివరకే వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడన్నారు. అయితే వారితో వేరుపడి జీవిస్తున్నానని, ఈ నేపథ్యంలో తాను హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకునేందుకు వెళ్తుండగా.. విశాఖ బస్టాండ్‌లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన దుంపల అప్పారావుతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శరీరకంగా దగ్గరవడమే కాకుండా అతని ఇంటికి కూడా తీసుకువెళ్లాడని చెప్పింది. అలాగే తన ఇంటికి కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లేవారని తెలిపింది. అయితే కొంతకాలంగా తనను దూరంపెడుతున్నారని, పెళ్లి చేసుకోవాలంటే రూ. 5 లక్షల కట్నం, 2 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని ఆరు రోజుల కిందట రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపింది. పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారే తప్ప తనకు న్యాయం చేయడం లేదని ఆరోపించింది. అందుకే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని వాటర్ ట్యాంక్ ఎక్కానని వివరించింది. -
ఆ నాణేలు విజయనగర రాజుల కాలం నాటివి..
- 'ఉప్పరపల్లి' బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ - 16వ శతాబ్దంలో అరవీడు వంశస్తులు వీటిని వాడారని వెల్లడి అనంతపురం : అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్ధానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీడు వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చరిత్రాత్మక ఆధారాలతో చెప్తున్నారు. 'సుమారు 52.9 గ్రెయిన్స్ (గ్రాముకన్నా తక్కువ) బరువుగల ఈ నాణేలకు ఒక వైపు వేంకటేశ్వరుడు నిలబడిన విధంగా, మరోవైపు దిగువ భాగాన 'శ్రీవేంకటేశ్వరాయ నమః' అని దేవనాగరి లిపిలో అక్షరాలు కన్పిస్తున్నాయి. ఈ నాణేలు ఇలా బయటపడటం వెనుక అనేక సందేహాలున్నాయి' అని అనంతపురంలోని పురావస్తు మ్యూజియం టెక్నికల్ అసిస్టెంట్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా ఇటువంటి నాణేలు బయట పడాలంటే ఆ పరిసర ప్రాంతాలలో చారిత్రక ఆలయాలుగానీ, పురాతన బావులుగానీ, కోటలాంటి ప్రదేశాలుగానీ ఉండాలి. నాణేలు విసిరేసినట్టుగా కాకుండా కుండలలోనో, రాగి పాత్రలలోనో తప్పనిసరిగా ఉంటాయి. ఉప్పరపల్లిలో అలాంటి చిహ్నాలేవీ కనపడకపోవడం మరింత పరిశోధనకు దారి తీస్తోందని వివరించారు. తమ దృష్టికి వచ్చిన నాణెం 'కాయిన్స్ ఆఫ్ విజయనగర' పుస్తకంలోని వివరాలతో సరిపోలినందున ఇది కచ్చితంగా ఆ కాలానికి చెందినదేనని నిర్ధారించారు. దాదాపు 20 నాణేలు దొరికినట్టు గ్రామస్తులు చెబుతున్నా వాటిని వెంటనే కరిగించేయడం లేదా కెమికల్ క్లీనింగ్ చేయించడం వల్ల చారిత్రక విషయాల పరిశోధన కొంత కష్టంగా మారే అవకాశముందన్నారు.