విజయనగరం: ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభ్రదస్వామి ఆరోపించారు. ఆదివారం విజయనగరంలో కోలగట్ల వీరభ్రదస్వామి మాట్లాడుతూ.... ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదంటారని... అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రత్యేక హోదా కావాలంటారని గుర్తు చేశారు.
ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తారని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. హోదాపై ఇంత కాలంల కాంగ్రెస్ పార్టీని నిందించి కాలం వెళ్లదీసారని మండిపడ్డారు. బీజేపీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని చంద్రబాబును కోలగట్ల ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే... బాబు విదేశీ పర్యటనలా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.