చైతన్య ర్యాలీలో పాల్గొన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
విజయనగరం మున్సిపాలిటీ: వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు హోదా సాధించడంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ ఉత్తరాం ధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. మనస్ఫూర్తిగా వారు హోదా కోరుకుంటే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి... ఇంకా మిత్ర పక్షంగా కొనసాగడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మౌనం దాల్చి... జనంలో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. అసలు నాలుగేళ్లుగా హోదా తేలేని కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ నినాదంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక మూడులాంతర్ల జంక్షన్ వద్ద గల పైడితల్లమ్మవారి చదురుగుడి నుంచి మెయిన్‌రోడ్, గంటస్తంభం జంక్షన్, కోళ్లబజార్ మీదుగా కన్యకాపరమేశ్వరి ఆల యం వరకు సాగింది. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హోదా కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో పాటు హోదాకోసం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద గల జాతిపిత మహాత్మాగాంధీ, ఆంధ్రరాష్ట్ర సాధకులు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి పోరాటం చేయాలన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చటంలో విఫలమైన వారు ప్రజలను ఇంకా మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన అశోక్‌గజపతిరాజు ప్రజలిచ్చిన పదవికి రాజీనామా చేస్తే అదేదో త్యాగం చేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ, స్వాగత ఏర్పాట్లు చేస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన ఘనత మోదీ, బాబుకే దక్కుతుందన్నారు. నాలుగేళ్లు పదవులు అనుభవించి న వారు చివరి సంవత్సరంలో రాజీనామాలు చేయడం రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు వేసే ఎత్తుగడేనని, ప్రజలు విజ్ఞతతో గమనించాలని కోరారు. 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని, మరల రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావడం తథ్యమని చెప్పారు.
పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానిది ప్రత్యేక హోదాపై మోసపూరిత పోరాటం కాగా... వైఎస్సార్‌సీపీది చిత్తశుద్ధిగల పోరాటమని అన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలో, రాష్ట్రంలో పదవులు, అధికారాలు అనుభవించటమే గాకుండా వాటిని అడ్డుబెట్టుకుని అవినీతి అక్రమాలతో ప్రజధానాన్ని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాలుగేళ్లుగా తాము పోరాడుతుంటూ వాటిని కుటిల రాజకీయాలతో వాటిని అడ్డుకున్నారనీ, ఇప్పుడు నాటకాలాడుతున్నారని పేర్కొన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో... నేడు హోదా సాధనలోనూ టీడీపీది ద్వంద్వ వైఖరేనని వ్యాఖ్యానించారు. పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు పోలీసులతో రాయబేరాలు నడిపే దుస్థితికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అసమర్థులని తెలుసుకున్న చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూ పోలీసులతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యా«ధారాలనూ త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు. ఈవిషయంలో పోలీసులు దూరంగా ఉండాలని హితవుపలికారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, అది జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలక మండలిసభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్‌బాబు, డీసీసీబీ అధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, జిల్లా పార్టీ కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయు డు, కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్.వి.వి.రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తి, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, బొద్దాన అప్పారావు, కనకల ప్రసాద్, కంటుభుక్త తవిటిరాజు, పిళ్లా విజయ్‌కుమార్, జి.వి.రంగారావు, అల్లు చాణక్య, బోడసింగి ఈశ్వరరావు, తాట్రాజు కృష్ణ్ణ, పట్నాన పైడిరాజు, సత్తరపు శంకరరావు, రెడ్డి గురుమూర్తి, బాలబ్రహ్మరెడ్డి, గాదం మురళి తదితరులు పాల్గొన్నారు.
హోదాకోసం ఎందాకైనా: బెల్లాన
పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్యాకేజీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటమే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని... అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమనీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment