
విశాఖ: చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణే సైకిల్ పోవాలని చంద్రబాబు చెప్పడమేనని వీరభద్రస్వామి స్పష్టం చేశారు.
చంద్రబాబు డబ్బులిచ్చి సభలకు జనాన్ని రప్పిస్తున్నారని, బాదుడే బాదుడు అట్టర్ ప్లాప్ కావడంతో పేరు మార్చి ఇదేమి ఖర్మ కార్యక్రమం చేపట్టారని,చంద్రబాబు వల్లనే రాష్ట్రానికి కర్మ పట్టుకుందని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు వీరభద్రస్వామి.