
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం మున్సిపాలిటీ : వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో ప్రజా సంకల్ప పాదయాత్రను ముగించుకున్న జగన్‌మోహన్‌రెడ్డితో కాసేపే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులతో పాటు విజయనగరం నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, బూత్ కమిటీల పనితీరు, తదితర అంశాలపై చర్చిం చారు. రానున్న ఎన్నికలు పార్టీకి కీలకమని కష్టించి పని చేయాలని ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి సూచిం చారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, నాయకులు మజ్జి అప్పారావు, కంది గణపతి, బోడసింగి నారాయణరావు, నారంశెట్టి సత్తిరాజు, బూర రామునాయుడు, ఒమ్మి రాము, బంటుపల్లి నారాయణప్పడు, బోద అప్పలకృష్ణ, కోరాడ వేణుబాబు, లెంక జగ్గునాయుడు, డాక్టర్ సత్యనారాయణ, భోగి అప్పలనాయుడు, కోరాడ నరసింగరావు, గోపాలరావు తదితరులు ఉన్నారు.