'గ్రేటర్ ఎన్నికలపై చర్చించాం' | Sujay krishna ranga rao meeting with vijaya sai reddy and kolagatla veerabhadra swamy | Sakshi
Sakshi News home page

'గ్రేటర్ ఎన్నికలపై చర్చించాం'

Published Sun, Jun 21 2015 2:21 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

'గ్రేటర్ ఎన్నికలపై చర్చించాం' - Sakshi

'గ్రేటర్ ఎన్నికలపై చర్చించాం'

విజయనగరం: ఉత్తరాంధ్రలో పార్టీ స్థితిగతులతోపాటు గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో చర్చించినట్లు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు వెల్లడించారు. ఆదివారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి... సుజయ కృష్ణ రంగారావు నివాసంలో సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం సుజయ్ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు అనుసరించ వలసిన వ్యూహంపై ఈ సందర్భంగా వారితో చర్చించినట్లు రంగారావు తెలిపారు.  గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల పరిశీలకుడిగా విజయసాయిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. దాంతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో విజయసాయిరెడ్డి తరచుగా సమావేశమవుతున్న విషయం విదితమే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement