bobbili mla
-
'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'
సాక్షి,బొబ్బిలి(విజయనగరం) : ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా అందరూ అంటున్నారనీ, అయితే.. ఆ జిల్లాలు వెనుకబడలేదని, వెనుకబెట్టి ఉంచబడ్డాయని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అసెంబ్లీలో అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని సాగునీటి వనరుల స్థితిగతులను సభ కళ్లకు కట్టారు. తోటపల్లి మేజర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మినహా దాదాపు 90 శాతం నిధులను దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. చివర్లో పది శాతం పనులను సైతం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో చేయించలేకపోయారన్నారు. కాలువలకు లైనింగ్, అవసరమైన చోట స్లూయీస్‌లు లేవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాలు గతేడాది కరువు కోరల్లో చిక్కుకున్నా ఎలాంటి ఆర్థిక సహాయం లేదన్నారు. జిల్లాలో 900కు పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరమ్మతులతో ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, జలవనరుల శాఖా మంత్రి చొరవచూపి తోటపల్లి పనులతో పాటు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను బాగుచేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. జంఝావతి వివాదాన్ని ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని వీఆర్ఎస్, మడ్డు వలస, పెద్దగెడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందేలా చూడాలన్నారు. అసెంబ్లీలో శంబంగి ప్రసంగం విన్న జిల్లా వాసులు సంబరపడ్డారు. ఇన్నాళ్లకు మన కష్టాలను అసెంబ్లీలో వినిపించే నాయకుడు దొరికాడని హర్షం వ్యక్తంచేశారు. -
జగన్ ముందే చెప్పారు...
సాక్షి, బొబ్బిలి(శ్రీకాకుళం) : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 150కి పైగా స్థానాలొస్తాయని వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో ముందే చెప్పారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు అన్నారు. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శంబంగి తొలిసారిగా నియోజకవర్గానికి బుధవారం వచ్చిన సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బొబ్బిలిలోని పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. పట్టణమంతా ర్యాలీ నిర్వహించిన అనంతరం బొబ్బిలి కోట దక్షిణ దేవిడీ వద్ద బహిరంగ సభను నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని అందరికీ తెలిసినా స్థానాల పరంగా ఎవరూ చెప్పలేకపోయినా ఫలితాల ముందు మాకు నిర్వహించిన పలు సమావేశాల్లో 150కి పైగా సీట్లు వస్తాయని జగన్మోహన్రెడ్డి చెప్పడం ఆయన కచ్చితత్వానికి నిదర్శనమన్నారు. ఒకనాడు నన్ను అవమానించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తన ముందే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం భగవంతుడు ఇచ్చిన తీర్పని చెప్పారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు ఐఆర్, ఆశా కార్యకర్తలకు వేతన పెంపు, పోలీసులకు వారాంతపు సెలవులు ప్రకటించడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయమన్నారు. అభివృద్ధి పేరిట పార్టీ మారిన బొబ్బిలి రాజులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. అటు చంద్రబాబుకు, ఇటు బొబ్బిలి రాజులకు ప్రజలు ఒకే విధమైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. అడ్డదారుల్లో సంపాదించేద్దామనుకునే వారికి ము ఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారని ఎమ్మెల్యే శంబంగి అన్నారు. బెల్ట్‌షాపులను నిరో ధించాలనే ఆదేశాలను తూచ తప్పకుండా పాటిం చాల్సిందేనన్నారు. బొబ్బిలిలో మాత్రం అధిక ధరలు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించలేదని శంబంగి ఎక్సైజ్ అధికారులకు చురకనంటించారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించి వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, సన్మాన పత్రాన్ని బహూకరించి దుశ్శాలువతో సత్కరించారు. గొల్లపల్లి నాయకులు సావు మురళీ కృష్ణ గజమాలతో సత్కరించారు. తెలుగు పండితులు కటికి అప్పలనాయుడు సన్మాన పత్రాన్ని పద్య, గద్య భాగాల్లో చదివినప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అభినందన సభ ఆహ్వాన కమిటీ కన్వీనర్ డాక్టర్ బొత్స కాశినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినందన సభా కార్యక్రమ పుస్తకాన్ని శంబంగి ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామసుధీర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సావు కృష్ణ మూర్తి, శంబంగి వేణుగోపాలనాయుడు, శ్రీకాంత్, వెద్యులు కేవీ అప్పారావు, విజయనగరం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు నర్సుపల్లి ఉమాలక్ష్మి, ఎం. రామారావునాయుడు, రియాజ్‌ఖాన్, తెర్లాం మండ ల అధ్యక్షుడు బాబ్జీరావు, బాడంగి అధ్యక్షుడు జగదీ ష్, ప్రచార కార్యదర్శి పెద్దింటి రామారావు, పట్టణ వ్యాపార సంఘ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎన్.విజయకుమార్, బి.శ్రీనివాసరావు, ఆర్.ఈశ్వరరావు, బి.సత్యనారా యణ, చేపేన జగన్నాధం, రాయలు, ఏక్‌నాధ్ పాల్గొన్నారు. -
తూచ్... అది మాదే!
⇔ గిరిజనులకు పంచిన భూములపై మంత్రి కన్ను ⇔ రూ.కోట్లు పలుకుతుండటంతో లాక్కునే ప్రయత్నం ⇔ మంత్రి పదవి రాగానే కదిలించిన ఫైళ్లు â ఎంచక్కా సహకరిస్తున్న అధికారులు ⇔ అప్పట్లోనే పొరపాటు జరిగిందంటూ అధికారుల కొత్త భాష్యం ⇔ భూములిచ్చేయాలని అమాయక రైతులకు నోటీసులు ⇔ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: మంచి నాయకుడికి పదవి వస్తే ఏం చేస్తాడు. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అంతో ఇంతో మంచి చేయాలనుకుంటాడు. కానీ అలా నమ్మిన జనం నోట్లో మట్టికొట్టేందుకు యత్నించాలనుకోడు. ఇక్కడ ప్లేటు మారింది. కేవలం ప్రజా సేవకోసం.. వారి సంక్షేమం కోసం పదవులు అధిష్టించినట్టు ఆ నాయకుడు చెప్పాడు. జనం కూడా అది నిజమేనని నమ్మారు. కానీ కేవలం స్వలాభం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసమే పాలకపక్షం పంచన చేరి మంత్రి పదవికోసం పాకులాడారని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ఒకే కోవకు చెందినవారంతా ఒక్కచోటకు చేరుతారనడానికి జిల్లాకు చెందిన మంత్రి ఆర్.వి.సుజయ కృష్ణ రంగారావే ఉదాహరణగా నిలిచారు. భూదాహంతో రగిలిపోతున్న చంద్రబాబు పంచన చేరి ఈయనా... అదే పంథాను జిల్లాలో అవలంబిస్తుండటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వెనక్కు తెచ్చుకోవడం సుజయ్‌కు కుదరలేదు. పదవి రాగానే పని మొదలు వైఎస్సార్సీపీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలుపొందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు గతేడాది ఏప్రిల్‌లో అధికారపార్టీలో చేరారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో గనుల శాఖ మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. టీడీపీలో చేరిన మరునాటి నుంచీ సుజయ్ ధ్యాసంతా పేదల భూములపైనే ఉంది. ఇచ్చిన భూముల్లో పార్వతీపురం డివిజన్లోని బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామం సర్వే నెం.247/2లో ఉన్న 14.83 ఎకరాలకు భూ పరిమితి చట్టం నుంచి కోర్టు ద్వారా మినహాయింపు పొందామంటున్నారు. వీటితో పాటు ఎక్కువగా ఇచ్చేశామనుకుంటు న్న ఇదే మండలం గొల్లపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నం.45లో ఉన్న ఎనిమిది ఎకరాలను అధికారులను అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. ఎకరా రూ.కోటిన్నరపైనే... ఈ ప్రాంతంలో ఇప్పుడు భూమి విలువ ఎకరా సుమారు రూ.కోటిన్నర పలుకుతోంది. దీంతో ఈ భూములను పేదల నుంచి లాక్కోవాలని మంత్రి పావులు కదుపుతున్నారు. అమాత్యుని మెప్పుకోసం కొందరు అధికారులు ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. దానిలో భాగంగా మల్లంపేటలో 15 మందికి, గొల్లపల్లిలో 17 మందికి నోటీసులు జారీ చేశారు. ఇదెక్కడి న్యాయమని, తాము ఈ భూముల్లో వర్షాధార పంటలు సాగు చేసుకుని జీవిస్తున్నామని, వీటిని లాక్కుంటే తమ కుటుంబాలు వీధిన పడతాయని అక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నా మంత్రికిగానీ, అధికారులకు గానీ వారి గోడు వినిపించడం లేదు. ఎలాగైనా దానిని స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. నాకేం తెలియదు నేను వచ్చి వారమే అయ్యింది. మంత్రి భూములకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. కొన్ని ఎకరాలు వెనక్కు ఇచ్చేయమని అడుగుతున్నట్లు పత్రికల్లో వార్తలను బట్టి తెలిసింది. అంతకు మించి ఏమీ తెలియదు. దీనిపై పూర్తి సమాచారం తెప్పించుకుంటాను. – సుదర్శనదొర, ఆర్డీఓ, పార్వతీపురం. అప్పుడు పొరపాటు జరిగింది గొల్లపల్లి రెవెన్యూ విలేజ్‌లో ఎనిమిది ఎకరాల భూమిని మంత్రి సుజయకృష్ణ రంగారావు విజ్ఞప్తి మేరకు ఆయనకు స్వాధీన పరిచే ప్రక్రియ జరుగుతోంది. గతంలో భూ పరిమితి చట్టం ప్రకారం వారు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఇచ్చారు. అప్పట్లో మా అధికారులు సరిగ్గా చూసుకోక పోవడంవల్ల పొరపాటు జరిగింది. మావైపు తప్పు జరిగింది సరే.. రైతులు ఆ భూముల్ని దున్నుకోవాలి కదా. డి ఫారం పట్టా కండిషన్ నెం.2 ప్రకారం పట్టా పొందిన తర్వాత మూడేళ్లలోపు ఆ భూమిని సాగులోకి తీసుకురాకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. నేను తనిఖీ చేశాను. రైతులు చెబుతున్నట్లు వర్షాకాలంలోనే కాదు ఆ భూముల్లో ఏ కాలంలోనూ సాగు చేసినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అడంగల్‌లోనూ అవి కొర్ణు భూములుగానే ఉన్నాయి. – కోరాడ సూర్యనారాయణ, తహసీల్దార్, బొబ్బిలి. -
'గ్రేటర్ ఎన్నికలపై చర్చించాం'
విజయనగరం: ఉత్తరాంధ్రలో పార్టీ స్థితిగతులతోపాటు గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో చర్చించినట్లు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు వెల్లడించారు. ఆదివారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి... సుజయ కృష్ణ రంగారావు నివాసంలో సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం సుజయ్ కృష్ణ రంగారావు విలేకర్లతో మాట్లాడారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు అనుసరించ వలసిన వ్యూహంపై ఈ సందర్భంగా వారితో చర్చించినట్లు రంగారావు తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల పరిశీలకుడిగా విజయసాయిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. దాంతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై విజయసాయిరెడ్డి దృష్టి సారించారు. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో విజయసాయిరెడ్డి తరచుగా సమావేశమవుతున్న విషయం విదితమే. -
వైఎస్ఆర్సీపీలోనే బొబ్బిలి రాజులు
విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణారంగారావుతో పాటు ఆయన సోదరుడు శ్రీకాకుళం పార్లమెంటరీ నియెజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనలు పార్టీని వీడి వెళ్లే ఆలోచనలో లేరని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా వారు పార్టీ మారుతారంటూ వినిపిస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. తాను, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్ కలసి బొబ్బిలి రాజులతో శుక్రవారం మాట్లాడినట్లు చెప్పారు. అవన్నీ అసత్య ప్రచారాలేనని ఖండించారని, పార్టీ మారే ఆలోచన లేదన్న విషయాన్ని వారు స్పష్టం చేశారని చెప్పారు. జిల్లాలో ఇటీవల నూతన సమీకరణాలు చోటుచేసుకున్నప్పటికీ వారు పార్టీ సిద్ధాంతాలకు, అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ సుజయ్‌కృష్ణరంగరావు మూడు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. తప్పు చేసిన రేవంత్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు...? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు సస్పెండ్ చేయలేదని కోలగట్ల ప్రశ్నించారు. పైగా రేవంత్‌రెడ్డి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి సకుటుంబ సపరివారసమేతంగా వెళ్లి పరోక్షంగా మద్దతు తెలపడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలను, అవినీతి రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు బాధ్యత గల ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై ఎదురుదాడికి దిగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ టీడీపీ అవినీతి రాజకీయాలను బట్టబయలు చేస్తే.. వీరంతా జగన్మోహన్రెడ్డిని విమర్శించటం తగదన్నారు. రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్‌పై లోక్‌సత్తా, సీపీఐ, సీపీఎం నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. వారిని ఏమీ అనకుండా జగన్మోహన్రెడ్డిపైనే అసత్యప్రచారాలను చేయడాన్ని ఖండించారు. టీడీపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తమ పార్టీ విధి విధానాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు హమీలను గుప్పించి ఇప్పుడు వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తున్న టీడీపీ పార్టీ విధి విధానాలు ఏంటని కోలగట్ల ప్రశ్నించారు. -
లక్ష దీపార్చనలో పాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యే
విజయనగరం (తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలో జరిగిన లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు హాజరయ్యారు. -
విఐపి రిపోర్టర్- ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు