సాక్షి, బొబ్బిలి(శ్రీకాకుళం) : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 150కి పైగా స్థానాలొస్తాయని వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతో ముందే చెప్పారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు అన్నారు. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శంబంగి తొలిసారిగా నియోజకవర్గానికి బుధవారం వచ్చిన సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బొబ్బిలిలోని పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. పట్టణమంతా ర్యాలీ నిర్వహించిన అనంతరం బొబ్బిలి కోట దక్షిణ దేవిడీ వద్ద బహిరంగ సభను నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని అందరికీ తెలిసినా స్థానాల పరంగా ఎవరూ చెప్పలేకపోయినా ఫలితాల ముందు మాకు నిర్వహించిన పలు సమావేశాల్లో 150కి పైగా సీట్లు వస్తాయని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం ఆయన కచ్చితత్వానికి నిదర్శనమన్నారు.
ఒకనాడు నన్ను అవమానించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తన ముందే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం భగవంతుడు ఇచ్చిన తీర్పని చెప్పారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు ఐఆర్, ఆశా కార్యకర్తలకు వేతన పెంపు, పోలీసులకు వారాంతపు సెలవులు ప్రకటించడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయమన్నారు. అభివృద్ధి పేరిట పార్టీ మారిన బొబ్బిలి రాజులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. అటు చంద్రబాబుకు, ఇటు బొబ్బిలి రాజులకు ప్రజలు ఒకే విధమైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. అడ్డదారుల్లో సంపాదించేద్దామనుకునే వారికి ము ఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెక్ పెట్టారని ఎమ్మెల్యే శంబంగి అన్నారు. బెల్ట్‌షాపులను నిరో ధించాలనే ఆదేశాలను తూచ తప్పకుండా పాటిం చాల్సిందేనన్నారు. బొబ్బిలిలో మాత్రం అధిక ధరలు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించలేదని శంబంగి ఎక్సైజ్ అధికారులకు చురకనంటించారు.
ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించి వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, సన్మాన పత్రాన్ని బహూకరించి దుశ్శాలువతో సత్కరించారు. గొల్లపల్లి నాయకులు సావు మురళీ కృష్ణ గజమాలతో సత్కరించారు. తెలుగు పండితులు కటికి అప్పలనాయుడు సన్మాన పత్రాన్ని పద్య, గద్య భాగాల్లో చదివినప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అభినందన సభ ఆహ్వాన కమిటీ కన్వీనర్ డాక్టర్ బొత్స కాశినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినందన సభా కార్యక్రమ పుస్తకాన్ని శంబంగి ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామసుధీర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సావు కృష్ణ మూర్తి, శంబంగి వేణుగోపాలనాయుడు, శ్రీకాంత్, వెద్యులు కేవీ అప్పారావు, విజయనగరం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు నర్సుపల్లి ఉమాలక్ష్మి, ఎం. రామారావునాయుడు, రియాజ్‌ఖాన్, తెర్లాం మండ ల అధ్యక్షుడు బాబ్జీరావు, బాడంగి అధ్యక్షుడు జగదీ ష్, ప్రచార కార్యదర్శి పెద్దింటి రామారావు, పట్టణ వ్యాపార సంఘ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎన్.విజయకుమార్, బి.శ్రీనివాసరావు, ఆర్.ఈశ్వరరావు, బి.సత్యనారా యణ, చేపేన జగన్నాధం, రాయలు, ఏక్‌నాధ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment