Appala Naidu
-
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా చిన అప్పల నాయుడు
సాక్షి, గుంటూరు: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. బుధవారం పార్టీ నాయకులతో సమావేశమైన జగన్, వారందిరి అభిప్రాయాలను తీసుకుని అప్పలనాయుడు పేరును ప్రకటించారు.విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌నేత బొత్సకు అవకాశం ఇచ్చిన దృష్ట్యా, ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు పేరును పార్టీ నేతలంతా బలపరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామని వైఎస్ జగన్ అన్నారు. అనుభవం, సామాజిక వర్గం రీత్యా అప్పలనాయుడు పేరును ప్రకటించామన్నారు.అప్పలనాయుడు అనుభవజ్క్షడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీనికూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలని పార్టీనేతలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 అని, ఇందులో 592 మంది వైయస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారు. పార్టీ అభ్యర్థి చినఅప్పలనాయుడు సుమారు నాలుగుదశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఏమండీ కొనసాగుతున్నారు. బొబ్బిలి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన శంబంగి వెంకట చినఅప్పలనాయుడు 2019లో ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు. -
చిటీల పేరుతో టీడీపీ నేత అప్పలనాయుడు భారీ మోసం
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా నెలిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్దకుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు మణిదీప్- స్నేహలను ఆశీర్వదించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్ దీవించారు. పర్యటనలో సీఎం జగన్ వెంట ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్.. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. -
ఇది ఉత్తరాంధ్ర మనోభావాలపై దండయాత్ర!
అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలు. ఏ కారణంతో రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించినా సారంలో అది అప్రజాస్వామికం. గ్రామస్థాయి నుంచి కేంద్రం దాకా అధికార వికేంద్రీకరణ రాజ్యాంగ నిర్దేశనమే (అదెంత సజావుగా అమలవుతున్నదనేది వేరే చర్చనీయాంశం). ఒకానొక తొందరపాటు, తప్పుడు నిర్ణయం కారణంగా మన తెలుగునేల విభజన జరగాల్సినంత సజావుగా, సశాస్త్రీయంగా జరగలేదు. నదీజలాల పంపిణీ, ఆస్తుల పంపిణీ వంటి అనేకాంశాలను ఇరుపక్షాలతో విస్తృత చర్చలు జరిపి వారి అంగీకారంతో విభజన కార్యక్రమం పూర్తి చేయాల్సివుండగా అలా జరగలేదు. అలా జరిగితే ఇప్పటి స్థితి రెండు రాష్ట్రాలకూ వుండేది కాదు. అందులో ఆంధ్రప్రదేశ్‌గా మిగిలిన మన రాష్ట్రానికి తొలినాటి నుండీ అన్యాయం జరిగింది. అలా జరగటానికి నాటి కేంద్రపాలకు లెంత కారణమో... విభజనను వ్యతిరేకిస్తున్నామంటూ డ్రామాలాడిన రాజకీయ పార్టీలన్నీ అంతే కారణం! విభజన జరుగుతున్న సమయంలోనూ మన నేతలు... విభజన జరిగితే డిమాండ్ చేయాల్సిన అంశాలను గురించి ఆలోచించలేదు. ఆనాటికి రాజకీయంగా పలుకుబడి కలిగిన చంద్రబాబయితే విభజన రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావటం గురించే ఆలోచించారు తప్ప, రాష్ట్రానికి రావాల్సిన వాటిగురించి ఆలోచించలేదు. చివరికి ఆయనాశించినట్టే ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిపోయారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో వుంటూ రాజధాని నిర్మించాల్సి నది పోయి, హఠాత్తుగా హైదరాబాద్ వదిలేసి తాత్కాలిక రాజధానిని నిర్మించి... శాశ్వత రాజధానిని ప్రపంచానికే ఆదర్శంగా నిర్మిస్తానన్నాడు. చంద్రబాబు రాజకీయనేత రూపంలో వున్న కార్పొరేట్ వ్యాపారి! ఆయనకు గల ఈ లక్షణ ఫలితాలే అమరావతి రాజధాని పేరిట భారీ భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలతో బేరసారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ! రాజధాని ఎంత పెట్టుబడితో ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పూర్తవుతుందో, పూర్తయితే ఎవరికి ప్రయోజనం అనేవి ప్రజలందరిలో కలిగిన ప్రశ్నలు! వాటికి జవాబు దొరక్కే వైసీపీ ప్రభుత్వాన్ని పజలు ఎన్నుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తనదైన పంథాలో గత ప్రభుత్వ విధానాలన్నీటినీ పునః పరిశీలన చేస్తూనే, కొత్తవాటిని ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గానీ, సచివాలయాలుగానీ, వలంటీర్ వ్యవస్ధగానీ, ఇచ్చిన ఉద్యోగాలుగానీ (లోపాలుంటే సరిదిద్దే ఉద్యమాలు చేయొచ్చు) ప్రజావ్యతిరేకం అనగలమా? గ్రామస్థాయికి పాలనా వ్యవస్థను తీసుకొచ్చిన నేపథ్యమే రాజధానిని వికేంద్రీకరించి.. పాలనా కేంద్రాలను వెనుకబడిన రాయలసీమకూ, ఉత్తరాంధ్రకూ దగ్గర చెయ్యాలనే ఆలోచనకు తెరలేపింది. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ విశాఖపట్టణం దగ్గరగా ఉంటుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి సులువుగా తమ అవసరాలను నివేదించుకోగలరు. అలాగే నిరసనగళాలు విన్పించగలరు. ఇందుకోసం సుదూర అమరావతికి పోనవసరం ఉండదు. పాలనా కేంద్రం ఒకటి వస్తోందంటే కేవలం పాలనా భవంతులే కావుగా, అనుబంధ శాఖలు కూడా వస్తాయిగా. అప్పటిదాకా లేనటువంటి అనేకానేక కార్యాలయాలు, వాటి అనుబంధ శాఖలు, వాటితో వాణిజ్య సంబంధ రంగాలు అనేకం కొత్తగా చేరుతాయి. వెనుకబాటుకు గురికాబడిన ఉత్తరాంధ్ర ముఖచిత్రానికి రూపుదిద్దుకోబోయే నూతన సౌభాగ్యరేఖను ఇవన్నీ నిర్దేశించేవే కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం పాలనాకేంద్రం కావటమనేది ఒక వరం లాంటిది. ఏ కారణంతో అయినా దీనిని వ్యతిరే కించడం ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే. రాబోయే పాలనాకేంద్రం పనితీరును లాభదాయకం చేసుకోడానికీ, ప్రజాప్రయోజనకారి చేసుకోడానికీ నివేదనల నుంచి నిరసనలదాకా అన్నింటినీ వినియోగించే వీలు ఎలాగూ ఉత్తరాంధ్రులకు వుంటుంది. ఇంటి ముంగిటకు పాలనా కేంద్రం వస్తోన్న సమయంలో.. దీనిని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు అంగీకరించరు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటు కాదది, వారి కమిట్మెంట్! ఈ సందర్భంలో అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర (అందులో నిజమైన రైతులెందరు? ఆసాములెందరు? వెనకున్న రాజకీయపార్టీ యేమిటి అన్న ప్రశ్నలు వేరే చర్చ) ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచే యాత్ర అవుతుందే తప్ప వేరు కాదు. అమరావతిలో భూములిచ్చిన రైతులు తమకు నష్టం లేకుండా (ఇచ్చిన భూములకు తగ్గ విలువ) గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేయొచ్చు తప్ప, మరే ప్రాంతానికీ రాజధానినీ, పాలనా కేంద్రాలనూ వికేంద్రీకరించకూడదని అనగూడదు. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ పాలనా కేంద్రాలకు చేరువగా వుండకూడదని అనకూడదు. ఇప్పటికే ప్రాంతాల మధ్య పాలకుల పుణ్యాన అసమానతలు ఏర్పడ్డాయి (ఇవే తెలంగాణ వేర్పాటుకూ కారణాలు). ఇంకా అదే నమూనా రాజకీయాలు నడపడం వెనుకబడిన ప్రాంతాల ఆందోళనలకు దారితీస్తాయి. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) అమరావతి రైతులు కోర్టులకు వెళ్లారు, మంచిదే. తాత్కాలిక రాజధాని దగ్గర నిరసనోద్యమాలు నడిపారు. తమ ఆందోళనలను లోకానికి వెల్లడించారు. అది వారి హక్కు. కానీ, ఇప్పుడు అరసవిల్లి యాత్ర ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల మీద దండయాత్ర! ఉత్తరాంధ్రులు కోరుకునే పాలనా కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర నేల మీద నినదిస్తూ యాత్ర నిర్వహించడం ఎవరి రాజకీయ క్రీడలో భాగమో కానీ... అది ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రేపడమే కాక ఎటువంటి విధ్వంసానికి దారి తీస్తుందోనని భయపడాల్సిన అవసరముంది. విఙ్ఞతతో నడవాల్సిన ఉద్యమాలు ఇతరేతర ప్రయోజనాలతో నడవడం విషాదకరం! (క్లిక్: అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!) - అట్టాడ అప్పల్నాయుడు ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు -
ఎమ్మెల్యే బడ్డుకొండ ఇంట పెళ్లి సందడి... హాజరైన మంత్రులు
భోగాపురం (విజయనగరం): నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఇంట పెళ్లిసందడి నెలకొంది. ఆయన పెద్ద కూమారుడు మణిదీప్‌నాయుడు వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం స్థానిక సన్‌రే రిసార్ట్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఏంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కూమార్, నంబూరు శంకర్రావు, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, పాకలపాటి రఘువర్మ, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ నాయకులు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. వారంతా నూతన వ«ధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: (నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ) -
భీమిలిలో పచ్చపార్టీ మరో శవ రాజకీయం.. టీడీపీ జెండా కప్పి..
భీమునిపట్నం: తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ రాజకీయం చేస్తోంది. గతంలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు సహజ మరణాలను సైతం రాజకీయం చేస్తోంది. విశాఖ జిల్లా భీమిలిలో ఇదే విధమైన నాటకానికి తెరతీసి అభాసుపాలైంది. భీమిలికి చెందిన వైఎస్సార్సీపీ స్థానిక నేత అప్పికొండ అప్పలనాయుడు చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలా రోజులుగా మాట లేదు. సోమవారం మరణించాడు. మంగళవారం అంతిమ యాత్ర సమయంలో టీడీపీ పార్టీ నాయకులు వచ్చి, వైఎస్సార్సీపీలో తగిన గౌరవం లేనందున తన అంతిమ యాత్రలో దేహంపై టీడీపీ జెండా కప్పాలని అప్పలనాయుడు కోరాడని చెప్పారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా వినకుండా జెండా కప్పి ఊరేగించారు. టీడీపీ శవ రాజకీయాన్ని అప్పలనాయుడు కుమారులు అప్పికొండ కృష్ణ, అప్పికొండ కుమార్ ఖండించారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకుడైన తమ తండ్రి మృతిని టీడీపీవారు రాజకీయం చేస్తున్నారని తెలిపారు. తమ తండ్రికి, తమకు వైఎస్సార్సీపీ అన్నా, సీఎం జగన్ అన్నా ఎంతో అభిమానం ఉందని చెప్పారు. ఏమాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్న తమ తండ్రి టీడీపీ వారితో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తమ తండ్రి చెప్పాడంటూ జెండా కప్పడం ఘోరమని అన్నారు. తీవ్రంగా ఖండించిన వైఎస్సార్సీపీ టీడీపీ నీచ రాజకీయాన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జీవీఎంసీ మూడో వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అల్లిపిల్లి నర్శింగరావు బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అప్పలనాయుడు మృతదేహంపై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోరాడ రాజబాబు టీడీపీ జెండా కప్పారని చెప్పారు. ఇది ఎంతో హాస్యాస్పదమైందని అన్నారు. అప్పలనాయుడు చాలా రోజులుగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, అటువంటి వ్యక్తి టీడీపీ నేతలతో ఎలా ఈ విషయాన్ని చెప్పాడని ప్రశ్నించారు. అప్పలనాయుడు వైఎస్పార్సీపీకి విధేయుడని, ఎమ్మెల్యే ముత్తంశెట్టి ఆయన్ని ఎంతగానో అభిమానించేవారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ బోని బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..
సాక్షి, లావేరు: కాళ్ల పారాణి ఆరలేదు. పెళ్లి సరదాలు తీరనే లేదు. ఇంతలోనే ఆ నవవధువు జీవితం తల్లకిందులైపోయింది. కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. ఈ విషాదకర సంఘటన లావేరు మండలంలోని మురపాక గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పీబీనగర్ కాలనీలో గల వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఆదివారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మురపాక గ్రామానికి చెందిన గొర్లె అప్పలనాయుడు(27) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువ న మృతి చెందాడు. ఆయనకు భార్య అశ్విని, తల్లిదండ్రులు లక్ష్ము నాయుడు, సీతమ్మ, ఒక సోదరుడు ఉన్నారు. లావేరు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. చదవండి: (ఆ పతంగి దారం అతని గొంతును కోసేసింది.. అదృష్టవశాత్తు భార్యకు..) పెళ్లయిన 19 రోజులకు.. లావేరు మండలంలోని మెట్టవలసకు చెందిన అశ్వినితో అప్పలనాయుడుకు ఈ నెల 8న వివాహం జరిగింది. అప్పలనాయుడు కంచిలి మండలంలోని సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శని, ఆదివారాలు సెల వు కావడంతో ఇంటికి వచ్చిన అప్పలనాయుడు సొంత పనిపై ఆదివారం రాత్రి ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలేం గ్రామానికి వెళ్లి తిరిగి మురపాక వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అనుకోని ఈ విషాదంతో భార్య అశ్విని, తల్లిదండ్రులు లక్ష్ము నాయుడు, సీతమ్మలు గుండెలవిసేలా రోదించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు తేనెల మంగయ్యనాయుడు, బాలి శ్రీనివాసనాయుడు, పెయ్యల లక్ష్మణరావు, తేనెల సురేష్‌కుమార్, లండ కిరణ్‌కుమార్, జల్లేపల్లి జనార్ధన్ తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: (భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో) -
రామతీర్థం కోదండ రాముని విగ్రహం ధ్వంసం
సాక్షి, నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. (చదవండి: వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి) సమాచారం తెలుసుకున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. ఎంపీ బెల్లాన మాట్లాడుతూ కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తున్నారని ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొంతమంది కావాలనే ఈ ఘటనకు పాల్ఫడ్డారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాముడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యధావిధిగా ప్రతిష్టింపజేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేని రాజకీయ ఉన్మాదులు, అరాచక శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. -
గరిమెళ్ల గర్జనకు వందేళ్లు!
గాంధీ పిలుపుతో ఉధృతంగా సాగుతోన్న సహాయనిరాకరణోద్యమ సమయంలో ఉద్యమకారుల గళాలు గర్జించిన ‘మాకొద్దీ తెల్లదొరతనం...’ గీతానికి వందేళ్లు! జాతి యావత్తుకీ ఉద్యమ గీతమందించిన గరిమెళ్ల సత్యనారాయణ రాజకీయోద్యమ రచయిత! సాహిత్యాన్ని సామాజిక అభ్యున్నతికి వినియోగించాలనే లక్ష్యాన్ని కలిగిన రచయిత! స్వాతంత్య్రోద్యమ సందర్భాన రాసిన ‘స్వరాజ్యగీతాలు’ (1921), ‘హరిజన పాటలు’ (1923) వంటి గీతాలు ఉత్తేజాన్ని రగిలించాయి. దాంతో గరిమెళ్లను తెల్లదొరలు నిర్బం ధానికి గురిచేశారు. కేవలం ‘మాకొద్దీ తెల్లదొరతనం...’ గీతాలాపన కలిగించే ఉద్రేకాన్నీ, ఉత్తేజాన్నీ స్వయానా విని గ్రహించిన ఆంగ్లేయ అధికారి, తెలుగుభాష తెలియని తననే యింతటి సంచలనానికి గురిజేస్తే, భాష తెలిసిన ప్రజలనింకా సంచలనానికి గురిజేసి ఉద్యమోన్ముఖులను జేస్తుందని రాజద్రోహనేరం ఆరోపించి గరిమెళ్లను ఏడాది పాటు జైల్లోకి నెట్టారు. జైలులో వున్నపుడే గరిమెళ్ల తండ్రి, తాతయ్య, భార్య మరణించారు. జైలులోనున్న గరిమెళ్ల ఈ విషాద సందర్భంలోనయినా పెరోల్‌పై విడుదల కోసం, క్షమాభిక్ష కోరడం వంటి చర్యలకు దిగజారలేదు. జాతీయోద్యమం ఉధృతంగా ఉన్నపుడు ప్రజలను ఉత్తేజపరచడానికి ఉపయోగపడే పాటలను రాసిన గరిమెళ్ల ఉద్యమం నెమ్మదించినపుడూ, స్వాతంత్య్రం సిద్ధించాక ప్రజలను ఆలోచింపచేయ డానికి వ్యాసరచనలు చేశాడు. రాజకీయాలను ప్రభావితం చేసే ఆర్థిక పరిస్థితుల గురించి, జస్టిస్‌పార్టీ, స్వరాజ్యవాదుల గురించీ ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు గరిమెళ్ల తన భావాలను వెల్లడించారు. అభ్యుదయకర భావావేశం, రష్యా కమ్యూనిజంపట్ల అనురక్తీ వుండినా భారతదేశానుకూల కమ్యూనిజం కావాలనడం, దేశాన్ని అభివృద్ధి చేయడానికి ‘అవతారమూర్తి దిగిరావాలనడం’ వంటి భావాల పరిమితి గరిమెళ్ల వ్యాసాల్లో కన్పించినా ఆయన నిబద్ధ ప్రజా పక్షపాత రాజకీయ రచయితే! రాజకీయ సంబంధ అంశాలతో పాటు కథ, నవల, భాషా పరిణామం వంటి సాహిత్యాంశాల మీద కూడా అనేక రచనలు చేశారు. గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, ఆనందవాణి, ఢంకా, ఆంధ్రప్రభ నుంచి భారతి దాకా అనేక పత్రికల్లో గరిమెళ్ల రచనలు ప్రచురణ అయ్యాయి. తమిళంలోని ‘తిరుక్కుళ్’, ‘నందియార్’ లనూ; కన్నడలోని ‘తళ్లికోట’ రచననూ తెలుగులోకి అనువదించారు. భోగరాజు పఠాభి సీతారామయ్య గారి ‘ఎకనమిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ రచనను తెలుగులోకి అనువదించారు. తనకూ, తనతో మిగిలిన తల్లి, చెల్లెలకూ పట్టెడన్నం పెట్టలేక స్వగ్రామాన్ని వదిలి వెళ్లాల్సిన సందర్భంలో కూడా సాహిత్యం కోసం తాతలనాటి ఇంటిని అమ్మేసి ‘శారదా గ్రంథమాల’ స్థాపిం చారు. రచనారంగం, రాజకీయభావజాలం కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగం, గుమస్తా ఉద్యోగం కోల్పో యేరు. తర్వాత జీవికకోసం చిన్నచిన్న నౌకరీలు చేశారు. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిం చారు. బతుకుతెరువు కోసం చివరికి బిచ్చమెత్తు కొని జీవించారు. తన గళాన్నీ, కలాన్నీ దేశాభ్యుదయానికే వినియోగించిన ఆ మహనీయుడు 1952 డిసెంబర్ 18న మద్రాస్‌లో మహానగరంలో అనామకుడిగా మరణించాడు. గరిమెళ్ల జాతికి అందించిన ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ ఉద్యమగీతానికి వందేళ్లు! స్వాతంత్య్రోద్యమంలో ఏ ఆశయాలతో, ఆకాంక్షలతో గరిమెళ్ల వంటి అనేకులు త్యాగాలు చేశారో ఆ ఆశయాలు, ఆకాంక్షలేవీ నెరవేరలేదు. కుల, మత, లింగ, ప్రాంత అసమానతలతో మండుతున్న ఖండంలా ఉంది దేశం! ‘కుక్కలతో కొట్లాడీ కూడూ తింటామండీ’ అన్న గరిమెళ్ల ఆవేదన యిప్పటికీ మాసిపోలేదు. వందేళ్ల నాటి గరిమెళ్ల గర్జనను మళ్లీ అందిపుచ్చుకోవాల్సిన సందర్భంలోనే దేశమింకా వుంది. (డిసెంబర్ 22వ తేదీన శ్రీకాకుళంలో గరిమెళ్ల సంస్మరణోత్సవం) వ్యాసకర్త అధ్యక్షులు,ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అట్టాడ అప్పల్నాయుడు -
'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'
సాక్షి,బొబ్బిలి(విజయనగరం) : ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా అందరూ అంటున్నారనీ, అయితే.. ఆ జిల్లాలు వెనుకబడలేదని, వెనుకబెట్టి ఉంచబడ్డాయని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అసెంబ్లీలో అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని సాగునీటి వనరుల స్థితిగతులను సభ కళ్లకు కట్టారు. తోటపల్లి మేజర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మినహా దాదాపు 90 శాతం నిధులను దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. చివర్లో పది శాతం పనులను సైతం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో చేయించలేకపోయారన్నారు. కాలువలకు లైనింగ్, అవసరమైన చోట స్లూయీస్‌లు లేవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాలు గతేడాది కరువు కోరల్లో చిక్కుకున్నా ఎలాంటి ఆర్థిక సహాయం లేదన్నారు. జిల్లాలో 900కు పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరమ్మతులతో ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, జలవనరుల శాఖా మంత్రి చొరవచూపి తోటపల్లి పనులతో పాటు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను బాగుచేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. జంఝావతి వివాదాన్ని ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని వీఆర్ఎస్, మడ్డు వలస, పెద్దగెడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందేలా చూడాలన్నారు. అసెంబ్లీలో శంబంగి ప్రసంగం విన్న జిల్లా వాసులు సంబరపడ్డారు. ఇన్నాళ్లకు మన కష్టాలను అసెంబ్లీలో వినిపించే నాయకుడు దొరికాడని హర్షం వ్యక్తంచేశారు. -
జగన్ ముందే చెప్పారు...
సాక్షి, బొబ్బిలి(శ్రీకాకుళం) : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 150కి పైగా స్థానాలొస్తాయని వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో ముందే చెప్పారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు అన్నారు. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శంబంగి తొలిసారిగా నియోజకవర్గానికి బుధవారం వచ్చిన సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బొబ్బిలిలోని పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చారు. పట్టణమంతా ర్యాలీ నిర్వహించిన అనంతరం బొబ్బిలి కోట దక్షిణ దేవిడీ వద్ద బహిరంగ సభను నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని అందరికీ తెలిసినా స్థానాల పరంగా ఎవరూ చెప్పలేకపోయినా ఫలితాల ముందు మాకు నిర్వహించిన పలు సమావేశాల్లో 150కి పైగా సీట్లు వస్తాయని జగన్మోహన్రెడ్డి చెప్పడం ఆయన కచ్చితత్వానికి నిదర్శనమన్నారు. ఒకనాడు నన్ను అవమానించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తన ముందే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం భగవంతుడు ఇచ్చిన తీర్పని చెప్పారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు ఐఆర్, ఆశా కార్యకర్తలకు వేతన పెంపు, పోలీసులకు వారాంతపు సెలవులు ప్రకటించడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయమన్నారు. అభివృద్ధి పేరిట పార్టీ మారిన బొబ్బిలి రాజులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. అటు చంద్రబాబుకు, ఇటు బొబ్బిలి రాజులకు ప్రజలు ఒకే విధమైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. అడ్డదారుల్లో సంపాదించేద్దామనుకునే వారికి ము ఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారని ఎమ్మెల్యే శంబంగి అన్నారు. బెల్ట్‌షాపులను నిరో ధించాలనే ఆదేశాలను తూచ తప్పకుండా పాటిం చాల్సిందేనన్నారు. బొబ్బిలిలో మాత్రం అధిక ధరలు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించలేదని శంబంగి ఎక్సైజ్ అధికారులకు చురకనంటించారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించి వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, సన్మాన పత్రాన్ని బహూకరించి దుశ్శాలువతో సత్కరించారు. గొల్లపల్లి నాయకులు సావు మురళీ కృష్ణ గజమాలతో సత్కరించారు. తెలుగు పండితులు కటికి అప్పలనాయుడు సన్మాన పత్రాన్ని పద్య, గద్య భాగాల్లో చదివినప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అభినందన సభ ఆహ్వాన కమిటీ కన్వీనర్ డాక్టర్ బొత్స కాశినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినందన సభా కార్యక్రమ పుస్తకాన్ని శంబంగి ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామసుధీర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సావు కృష్ణ మూర్తి, శంబంగి వేణుగోపాలనాయుడు, శ్రీకాంత్, వెద్యులు కేవీ అప్పారావు, విజయనగరం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు నర్సుపల్లి ఉమాలక్ష్మి, ఎం. రామారావునాయుడు, రియాజ్‌ఖాన్, తెర్లాం మండ ల అధ్యక్షుడు బాబ్జీరావు, బాడంగి అధ్యక్షుడు జగదీ ష్, ప్రచార కార్యదర్శి పెద్దింటి రామారావు, పట్టణ వ్యాపార సంఘ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎన్.విజయకుమార్, బి.శ్రీనివాసరావు, ఆర్.ఈశ్వరరావు, బి.సత్యనారా యణ, చేపేన జగన్నాధం, రాయలు, ఏక్‌నాధ్ పాల్గొన్నారు. -
గజపతినగరంలో పాగావేసేదెవరు..?
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎన్నికలు జరగకుండానే ఫలితం చెప్పేయగల నియోజకవర్గం జిల్లాలో ఏదైనా ఉందంటే ముందుగా చెప్పుకోవాల్సింది గజపతినగరం నియోజకవర్గాన్నే. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయమే దీనికి ప్రధాన కారణం. ఐదేళ్లుగా అవినీతి తప్ప ప్రజాప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచించని అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆ పార్టీ అభ్యర్థిగా మరలా పోటీలోకి దిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా పేరుపొందిన బొత్స అప్పలనర్సయ్య వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ ఇద్దరిలో ఎవరిది విజయమనేదానిపై ఇప్పటికే ప్రజల్లో ఓ స్పష్టత వచ్చేసింది.అధికారంలో ఉన్నా లేక పోయినా అప్పలనర్సయ్య నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, బలమైన కార్యకర్తల అండదండలతో ఇక్కడ వార్ ఒన్‌సైడ్ అయినట్టే కనిపిస్తోంది. అప్పలనర్సయ్యకు మంచి పేరు బొత్స అప్పలనర్సయ్య విజయనగరం ఎస్సీ కార్పొరేషన్లో డీఈగా ఉద్యోగం చేసేవారు. అన్న బొత్స సత్యానారాయణ మంత్రిగా, వదిన ఝాన్సీ ఎంపీగా ఉండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2001లో బొండపల్లి, 2006లో దత్తిరాజేరు జెడ్పీటీసీగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పడాల అరుణపై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, మంచి పనులు చేయడంతో పాటు మంచి వ్యక్తి, కార్యకర్తలను క్రమశిక్షణతో నడిపించగలరనే పేరు తెచ్చుకున్నారు. కొండపల్లికి అన్నీ ప్రతికూలతలే... ప్రైవేటు వైద్యుడిగా ఉండి, తండ్రి దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడి రాజకీయ వారసుడుగా వచ్చిన కొండపల్లి అప్పలనాయుడు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి బొత్స వారి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 వరకు చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కేఏ నాయుడుని ఎన్నికలు మందు గజపతినగరం ఇన్చార్జ్ పదవి ఇచ్చి అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించారు. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఏ నాయుడు ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడమనేది ఐదేళ్లలో ఏనాడూ జరగలేదు. నమ్మకున్న కార్యకర్తలకే న్యాయం చేయరనే చెడ్డ పేరు సంపాదించారు. చివరికి తన సొంత అన్నకే మంచి చేయలేకపోయారు. నియోజకవర్గంలో ఆయన చేయని అవినీతి లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన అన్న కొండలరావు పెద్ద తిరుగుబాటే చేశారు. చివరికి తమ్ముడిపైనా, టీడీపీపైనా నమ్మకం లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పలనర్సయ్యకు మద్దతు పలికారు. గజపతినగరం చరిత్ర ఇలా... గజపతినగరం నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. పూసపాటి వంశానికి చెందిన పీవీజీ రాజు భార్య (ఎంపీ అశోక్ తల్లి) తొలి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. ఒకసారి పెనుమత్స సాంబశివరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 15 మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు. గజపతినగరం నియోజకవర్గం జనాభా, ఓటర్లు ఇలా.. జనాభా 2,86,820 ఓటర్లు 1,90,898 పురుషులు 94,350 స్త్రీలు 96,424 ఇతరులు 4 పోలింగ్ స్టేషన్లు 264 -
అనకాపల్లిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం
విశాఖసిటీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా పరిధిలో ఏడు సెగ్మెంట్లతో పాటు ఎంపీ సీటును కైవసం చేసుకుంటామని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన శాసనసభ సీట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. అన్నివర్గాలకు సమన్యాయం పాటిస్తూ కేటాయింపు జరిపారని తెలిపారు. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 50 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 41 మంది బీసీలకు, 29 మంది ఎస్సీలకు, 27 మంది కాపులకు, 10 మంది కమ్మ సామాజిక వర్గానికి, ఏడుగురు ఎస్సీలకు, ఐదుగురు ముస్లింలకు, ముగ్గురు ఆర్యవైశ్యులకు, ముగ్గురు బ్రాహ్మణ వర్గానికి సీట్లు కేటాయించి సామాజిక న్యాయం పాటించారన్నారు. జగనన్నని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభ విజయవంతమైందన్నారు. సీట్ల కేటాయింపులో ఒకటి రెండు చోట్ల కొందరు నాయకులు అసంతృప్తికి గురైనా పరిస్థితులకు అనుగుణంగా వారు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిన టీడీపీకి తగిన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు చివరి మూడు నెలల్లో హడావుడిగా సంక్షేమ పథకాలను అమలు చేశారని, వీటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. జగనన్నపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని, దీనికి అనుగుణంగానే కొన్ని పార్టీలు అవగాహన ఏర్పరుచుకొని సీట్ల కేటాయింపులు చేసుకుంటున్నాయని ఆరోపించారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేందుకు రోజూ సమావేశాలు నిర్వహించి ఇప్పటికీ పూర్తి జాబితా ప్రకటించలేకపోయారని ఎద్దేవా చేశారు. కానీ జగన్మోహన్రెడ్డి మాత్రం 175 అసెంబ్లీ సీట్లకు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న అమర్నాథ్కు అండగా నిలిచి జగనన్న సీటు కేటాయింపు జరిపారన్నారు. ఇక జిల్లాలో నలుగురు మహిళలకు సీట్లు ఇచ్చి మహిళలకు చట్టసభల్లో గుర్తింపు వచ్చేలా కృషి చేశారని తెలిపారు. రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంతోపాటు గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ఇది చూసిన అధికారపార్టీలో అలజడి మొదలైందన్నారు. చంద్రబాబు చేస్తున్న హత్యారాజకీయాలకు ప్రజలు సమాధానం చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయని వ్యాఖ్యానించారు. వైద్యరంగంలో సేవలందించిన సత్యవతికి ఎంపీ సీటు ఇవ్వడం వల్ల మహిళల్లో మంచి సంకేతాలు లభించాయన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారని, రెండున్నర దశాబ్దాలుగా ఆమె వైద్యరంగంలో డబ్బు ఆశించకుండా సేవలందించడాన్ని జగనన్న గుర్తించి ఎంపీ సీటు ఇచ్చారన్నారు. ఇక ఏజెన్సీలో సైతం గిరిజన ప్రాంతాలకు చెందిన అన్నివర్గాల వారికి సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. విద్యావంతుడైన అమర్నాథ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అదే విధంగా ఆయన తండ్రి గతంలో జిల్లాలో గుర్తింపు కలిగిన నేతగా ఉన్నారని అన్నారు. ఏది ఏమైనా ఎన్ని కుట్రలు తెరమీదకు వచ్చినా జగనన్న సీఎం కావడం తథ్యమని చిన అప్పలనాయుడు తెలిపారు. -
వైఎస్సార్ సీపీలో శరగడం చేరిక
విశాఖపట్నం, పెందుర్తి : నగర పరిధిలోని పెందుర్తి పట్టణంలో బలమైన సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న శరగడం చినఅప్పలనాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శరగడంకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో శరగడం చిన అప్పలనాయుడుతో పాటు ఆయన తనయుడు డాక్టర్ పవన్‌భరత్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధినేతతో చర్చించారు. టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న శరగడం శనివారం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీలోకి వందలాది కుటుంబాలు! పెందుర్తి పట్టణంలో క్షేత్రస్థాయిలో పేద, బడుగు బలహీన వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న శరగడం చేరికతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతమైంది. గత జీవీఎంసీ ఎన్నికల్లో ఆయన 71వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచారు.ఆయన వెంట మరింత మంది వైఎస్సార్ సీపీలో చేరే అవకాశం ఉంది. పెందుర్తి నియోజకవర్గంలో అవినీతికి, వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీలో ఇమడలేక చాలామంది సీనియర్ నాయకులు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు అప్పలనాయుడుల నిరంకుశ వైఖరి టీడీపీ పాతకాపులకు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే కొద్దిరోజుల్లో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని స్థానికంగా చర్చ నడుస్తోంది. జగన్‌ను సీఎం చేసుకుంటాం: శరగడం రానున్న ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తామని శరగడం చిన అప్పలనాయుడు తెలిపారు. వైఎస్ జగన్‌లో తన ప్రియతమ నాయకుడు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట పూటకో డ్రామాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు.పెందుర్తిలో నాయకులందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీని మట్టి కరిపించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, ఉండి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గానికి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1994 లో టిడిపి విప్ గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏఐసీసీ మెంబర్‌గా కొనసాగుతున్న అప్పలనాయుడు కాంగ్రెస్ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అప్పలనాయుడికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి సాంబశివరాజు, విజయనగరం కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదా రామారావు తదితరులు ఉన్నారు. బొబ్బిలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌజన్య కూడా ఇదే సమయంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. -
చింతమనేనితో నాకు ప్రాణహాని ఉంది
-
టీడీపీలో కుట్ర మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన వర్గం అల్టిమేటం ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర పన్నారంటూ అప్పలనాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుట్ర పన్ని అప్పలనాయు డును అరెస్ట్ చేయించారని మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అరోపిస్తున్న సంగతి తెలిసిందే. అండగా ఉండాల్సిందిపోయి కుట్రలా.. ఈ వ్యవహారం అనంతరం టీడీపీలో రెండు వర్గాల వారు రోడ్డెక్కినా పార్టీ అధినాయకత్వం తనకేమీ తెలియనట్టే నటిస్తోంది. అప్పలనాయుడును చింతమనేని కావాలనే ఇరికించారని, కుట్రకు బలైన తమకు అండగా నిలవాల్సింది పోయి చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇసుక మాఫియా నేతలకు, పోలీసులపై దాడులకు దిగిన వారికి, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్న వారికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పార్టీ అధిషా ్టనం ఎలా కొమ్ము కాస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పలనాయుడుపై క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే వెంకటాపురం, చుట్టుపక్కల ఉన్న 5వేల మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. చింతమనేని, అప్పలనాయుడు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంతో ఏలూరు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభం తలెత్తింది. దెందులూరు నియోజకవర్గానికీ ఇది పాకింది. అప్పలనాయుడుకు తూర్పుకాపు సంఘం మద్దతు మరోవైపు తూర్పు కాపు సంఘం రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా నిలిచింది. ఆయనపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే తామంతా పార్టీకి దూరమవుతామని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తమకు అండగా ఉన్నారని, ఆయన సాయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలావుంటే.. చింతమనేని ప్రభాకర్ వర్గం దీనిపై ఆగ్రహంగా ఉంది. తమ నేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వారికి ఏలూరు ఎమ్మెల్యే ఎలా అండగా ఉంటారని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు వెంకటాపురం గ్రామ పంచాయతీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న తనకు అప్పలనాయుడు నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్కు సోమవారం విజ్ఞప్తి చేశారు. తన ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని ఎస్పీని కోరారు. పోలీసులకు తలనొప్పి చింతమనేని ప్రభాకర్, రౌడీషీటర్ జుజ్జువరపు జయరాజు, కోమర్తి మధులను హత్య చేసేందుకు అధికార పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు కుట్ర పన్నిన వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక వర్గం రెడ్డి అప్పలనాయుడుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరో వర్గం ఈ కేసు నుంచి అప్పలనాయుడును బయట పడేసేందుకు ప్రయత్ని స్తోంది. ఇరువర్గాల మధ్య తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు తుపాకీ లైసెన్స్ కోసం చింతమనేని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆ అవకాశం కల్పించలేదు. తనకు గన్మెన్లు వద్దని, ఎస్కార్ట్ కావాలని అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును గతంలో చింతమనేని కోరారు. దీనికి సానుకూల స్పందన రాలేదు. ఇప్పుడు హత్యకు కుట్ర పన్నిన వివాదం ముందుకు రావడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. చింతమనేనిపై రౌడీషీట్ ఉండటం, అతని వ్యవహార శైలి కారణంగా తుపాకీ లైసెన్స్ ఇవ్వడానికి పోలీసు శాఖ అంగీకరించడం లేదు. మరోవైపు రౌడీషీటర్ జయరాజు కూడా తనకు తుపాకీ లైసెన్స్ కావాలని కోరడం గమనార్హం. దీనిపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
టీడీపీలో కుట్ర మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన వర్గం అల్టిమేటం ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర పన్నారంటూ అప్పలనాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుట్ర పన్ని అప్పలనాయు డును అరెస్ట్ చేయించారని మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అరోపిస్తున్న సంగతి తెలిసిందే. అండగా ఉండాల్సిందిపోయి కుట్రలా.. ఈ వ్యవహారం అనంతరం టీడీపీలో రెండు వర్గాల వారు రోడ్డెక్కినా పార్టీ అధినాయకత్వం తనకేమీ తెలియనట్టే నటిస్తోంది. అప్పలనాయుడును చింతమనేని కావాలనే ఇరికించారని, కుట్రకు బలైన తమకు అండగా నిలవాల్సింది పోయి చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇసుక మాఫియా నేతలకు, పోలీసులపై దాడులకు దిగిన వారికి, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్న వారికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పార్టీ అధిషా ్టనం ఎలా కొమ్ము కాస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పలనాయుడుపై క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే వెంకటాపురం, చుట్టుపక్కల ఉన్న 5వేల మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. చింతమనేని, అప్పలనాయుడు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంతో ఏలూరు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభం తలెత్తింది. దెందులూరు నియోజకవర్గానికీ ఇది పాకింది. అప్పలనాయుడుకు తూర్పుకాపు సంఘం మద్దతు మరోవైపు తూర్పు కాపు సంఘం రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా నిలిచింది. ఆయనపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే తామంతా పార్టీకి దూరమవుతామని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తమకు అండగా ఉన్నారని, ఆయన సాయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలావుంటే.. చింతమనేని ప్రభాకర్ వర్గం దీనిపై ఆగ్రహంగా ఉంది. తమ నేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వారికి ఏలూరు ఎమ్మెల్యే ఎలా అండగా ఉంటారని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు వెంకటాపురం గ్రామ పంచాయతీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న తనకు అప్పలనాయుడు నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్కు సోమవారం విజ్ఞప్తి చేశారు. తన ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని ఎస్పీని కోరారు. పోలీసులకు తలనొప్పి చింతమనేని ప్రభాకర్, రౌడీషీటర్ జుజ్జువరపు జయరాజు, కోమర్తి మధులను హత్య చేసేందుకు అధికార పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు కుట్ర పన్నిన వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక వర్గం రెడ్డి అప్పలనాయుడుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరో వర్గం ఈ కేసు నుంచి అప్పలనాయుడును బయట పడేసేందుకు ప్రయత్ని స్తోంది. ఇరువర్గాల మధ్య తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు తుపాకీ లైసెన్స్ కోసం చింతమనేని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆ అవకాశం కల్పించలేదు. తనకు గన్మెన్లు వద్దని, ఎస్కార్ట్ కావాలని అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును గతంలో చింతమనేని కోరారు. దీనికి సానుకూల స్పందన రాలేదు. ఇప్పుడు హత్యకు కుట్ర పన్నిన వివాదం ముందుకు రావడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. చింతమనేనిపై రౌడీషీట్ ఉండటం, అతని వ్యవహార శైలి కారణంగా తుపాకీ లైసెన్స్ ఇవ్వడానికి పోలీసు శాఖ అంగీకరించడం లేదు. మరోవైపు రౌడీషీటర్ జయరాజు కూడా తనకు తుపాకీ లైసెన్స్కావాలని కోరడం గమనార్హం. దీనిపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
టీడీపీలో కుట్ర మంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన వర్గం అల్టిమేటం ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర పన్నారంటూ అప్పలనాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుట్ర పన్ని అప్పలనాయు డును అరెస్ట్ చేయించారని మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అరోపిస్తున్న సంగతి తెలిసిందే. అండగా ఉండాల్సిందిపోయి కుట్రలా.. ఈ వ్యవహారం అనంతరం టీడీపీలో రెండు వర్గాల వారు రోడ్డెక్కినా పార్టీ అధినాయకత్వం తనకేమీ తెలియనట్టే నటిస్తోంది. అప్పలనాయుడును చింతమనేని కావాలనే ఇరికించారని, కుట్రకు బలైన తమకు అండగా నిలవాల్సింది పోయి చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇసుక మాఫియా నేతలకు, పోలీసులపై దాడులకు దిగిన వారికి, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్న వారికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పార్టీ అధిషా ్టనం ఎలా కొమ్ము కాస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పలనాయుడుపై క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే వెంకటాపురం, చుట్టుపక్కల ఉన్న 5వేల మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. చింతమనేని, అప్పలనాయుడు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంతో ఏలూరు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభం తలెత్తింది. దెందులూరు నియోజకవర్గానికీ ఇది పాకింది. అప్పలనాయుడుకు తూర్పుకాపు సంఘం మద్దతు మరోవైపు తూర్పు కాపు సంఘం రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా నిలిచింది. ఆయనపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే తామంతా పార్టీకి దూరమవుతామని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తమకు అండగా ఉన్నారని, ఆయన సాయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలావుంటే.. చింతమనేని ప్రభాకర్ వర్గం దీనిపై ఆగ్రహంగా ఉంది. తమ నేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వారికి ఏలూరు ఎమ్మెల్యే ఎలా అండగా ఉంటారని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు వెంకటాపురం గ్రామ పంచాయతీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న తనకు అప్పలనాయుడు నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్కు సోమవారం విజ్ఞప్తి చేశారు. తన ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ ఇప్పించాలని ఎస్పీని కోరారు. పోలీసులకు తలనొప్పి చింతమనేని ప్రభాకర్, రౌడీషీటర్ జుజ్జువరపు జయరాజు, కోమర్తి మధులను హత్య చేసేందుకు అధికార పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు కుట్ర పన్నిన వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక వర్గం రెడ్డి అప్పలనాయుడుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరో వర్గం ఈ కేసు నుంచి అప్పలనాయుడును బయట పడేసేందుకు ప్రయత్ని స్తోంది. ఇరువర్గాల మధ్య తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు తుపాకీ లైసెన్స్ కోసం చింతమనేని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆ అవకాశం కల్పించలేదు. తనకు గన్మెన్లు వద్దని, ఎస్కార్ట్ కావాలని అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును గతంలో చింతమనేని కోరారు. దీనికి సానుకూల స్పందన రాలేదు. ఇప్పుడు హత్యకు కుట్ర పన్నిన వివాదం ముందుకు రావడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. చింతమనేనిపై రౌడీషీట్ ఉండటం, అతని వ్యవహార శైలి కారణంగా తుపాకీ లైసెన్స్ ఇవ్వడానికి పోలీసు శాఖ అంగీకరించడం లేదు. మరోవైపు రౌడీషీటర్ జయరాజు కూడా తనకు తుపాకీ లైసెన్స్కావాలని కోరడం గమనార్హం. దీనిపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చోడవరం: రుణ భారంతో ఆందోళనకు గురైన ఓ అన్నదాత బలవన్మరణం చెందాడు. విశాఖ జిల్లా చోడవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓబులరెడ్డి అప్పలనాయుడు(52)కు ఎకరం పొలం ఉంది. దీనికి తోడు రెండెకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా వరి, చెరుకు సాగు చేస్తున్నారు. అయితే, పంటల సాగుతో నష్టాలు రావటంతో పెట్టుబడుల కోసం చేసిన రూ.6 లక్షల అప్పు మిగిలింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన అప్పలనాయుడు శుక్రవారం సాయంత్రం పొలంలోనే పురుగు మందు తాగి, చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎస్ఆర్ నగర్లో నకిలీ పోలీస్ అరెస్టు
హైదరాబాద్: విద్యార్థులు, మహిళలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసును ఎస్సార్ నగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసునంటూ గత కొన్ని రోజులుగా ప్రేమ జంటలను, హోటళ్ల నిర్వాహకులను బెదిరిస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతడిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు అప్పలనాయుడు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
నర్సీపట్నం కౌన్సిల్ సమావేశంలో రగడ
విశాఖ: విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో రగడ చోటుచేసుకుంది. నీల్కమల్ కుర్చీల కొటేషన్లో ఒక్కో కుర్చీకి 600 రూపాయల చొప్పున పేర్కొనడంపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ వర్గీయులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ మెంబర్ అప్పలనాయుడుపై టీడీపీ వర్గీయులు దాడికి యత్నించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
నా భూముల్లో మీ పెత్తనమేంటి?
విశాఖ: విశాఖ జిల్లాలోని అనీట్స్ కాలనీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భూముల్లో పనులు చేపడుతున్నారని జీవీఎమ్సీ అధికారులను బీజేపీ నేత అప్పలనాయుడు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జీవీఎమ్సీ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి అప్పలనాయుడును అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే జీవీఎమ్సీ పనులు చేపట్టిన భూములతో అప్పలనాయుడుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. -
ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్
ఖమ్మం అర్బన్ : ఇప్పటి వరకు ఒక రాష్ట్రం ఒకే కాల్వగా ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వ ఇక నుంచి రెండు రాష్ట్రాలు.. మూడు ముక్కలుగా మారబోతోంది. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సాగర్ ఎడమకాల్వ పరిధిలోని రెండు రాష్ట్రాల అయకట్టును కూడా విడగొట్టారు. దీని ప్రకారం కాల్వలను, సిబ్బందిని, కార్యాలయాలను సైతం కేటాయించారు. ఆ పనులన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. ఇక ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న జిల్లాల్లో సైతం అయకట్టును విడగొట్టి ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్‌గా మార్చబోతున్నారు. అంటే ఖమ్మం, నల్లగొండ, కృష్ణా మూడు జిల్లాల్లో మూడు సర్కిల్లు ఏర్పాటు కానున్నాయి. దీంతోపాటు ఆ జిల్లాల్లో ఉన్న ఆయకట్టు ప్రకారం సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి అవసరమైన నివేదిక కోసం ఆయకట్టు వివరాలు, ప్రస్తుతం ఉన్న కార్యాలయాల డేటాను నమోదు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎన్నెస్పీ టేకులపల్లి (ఖమ్మం) ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈలు, డీఈలతో పాటు సిబ్బంది లెక్కలు తీశారు. జిల్లాలో ఒకే సర్కిల్... ఎన్నెస్పీ కెనాల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు టేకులపల్లి సర్కిల్ పేరుతో(ఖమ్మం) కార్యాలయం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని కొంత ఆయకట్టు, కృష్ణా జిల్లాలోని కొంత ఆయకట్టు.. ఇలా మూడు జిల్లాల పరిధిలోని 5,49, 296 ఎకరాల భూమి ఈ సర్కిల్ పరిధిలో ఉండేది. ఇప్పడు జిల్లాల వారీగా సర్కిల్ మార్పులతో ఖమ్మం పరిధిలో 2, 51,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే మిగిలి ఉంది. గతంలో నల్లగొండ జిల్లాలోని 20,681 ఎకరాలు, కృష్ణా జిల్లాలోని 2.70 లక్షల ఎకరాలు ఖమ్మం పరిధిలో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఆయా జిల్లాల సర్కిల్ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇక గతంలో నూజవీడు డివిజన్ పరిధిలో ఉన్న జిల్లా ఆయకట్టు 13, 994 ఎకరాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కలవనుంది. ఈ అయకట్టు ఖమ్మం జిల్లాకు చెందినప్పటికీ జోన్-3 పరిధిలో ఉండేది. ఇప్పుడు ఈమొత్తాన్ని జోన్- 2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. జోన్-2 పరిధిలోకి వచ్చే భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు విడుదల చేసేందుకు అధికారులు రూ. 20 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్రం విడిపోకముందే ప్రభుత్వానికి అందించారు. జిల్లాలో మొత్తం ఆయకట్టును ఒకే సర్కిల్ కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం కార్యాలయాలు ఏర్పా టు చేస్తారు. గతంలో కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలో కలిసి ఉన్న ఆయకట్టుకు సెక్షన్ కార్యాలయాలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోవడంతో జిల్లా ఆయకట్టును మినహాయించి ఆటువైపు ఉన్న ఎనిమిది సెక్షన్, ఒక సబ్‌డివిజన్ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. జిల్లాలో మరో మానిటరింగ్ సబ్ డివిజన్ కార్యాలయం..? జిల్లాలో ఉన్న ఆయకట్టు ప్రకారం 750 నుంచి1200 ఎకరాలకు ఒక సెక్షన్, 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు ఒక సబ్ డివిజన్, లక్ష నుంచి 1.50 లక్షల ఎకరాలకు ఒక డివిజన్ కార్యాలయాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలను సైతం ఇదే తరహాలో తయారు చేయబోతున్నారు. దీంతో గతంలో ఉన్న నీటి సంఘాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు ఎడమకాల్వ మొత్తానికి మానిటరింగ్ డివిజన్ కార్యాలయం ఖమ్మంలోనే ఉంది. దాని పరిధిలోనే ఐదు సబ్ డివిజన్ కార్యాలయాలు (మిర్యాలగూడెం, హూజూర్‌నగర్, నాయకన్‌గూడెం, టేకులపల్లి, తిరువూరులలో) ఉన్నాయి. అయితే రాష్ట్రం విడిపోవడంతో తిరువూరు సబ్ డివిజన్‌ను జగ్గయ్య పేటలో విలీనం చేశారు. దాని స్థానంలో ఖమ్మం జిల్లాలో కల్లూరు సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే నీటి పర్యవేక్షణతో పాటు పరిపాలన పరంగా వెసులుబాటు ఉంటుందని, దాని ప్రకారమే ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులు చెపుతున్నారు.