విజయనగరంలో నిర్మితమైన మెడికల్ కళాశాల
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మారిన ఉమ్మడి విజయనగరం జిల్లా దశ
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సిద్ధమవుతోన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
ప్రజల దశాబ్దాల కల ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాకారం
మన్యానికి మకుటంలా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం
శరవేగంగా సిద్ధమవుతోన్న గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, పార్వతీపురం మన్యం: వలసలకు, వెనుకబాటుతనానికి నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి విజయనగరం జిల్లా. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఈ ప్రాంత దశా దిశా మారిపోతోంది. రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరానికి చేరువగా ఉండటం, భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరగడం, విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తికావడం విజయనగరానికి వరంలా మారాయి. రూ.500 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, 519 ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయంగా మారిన జేఎన్‌టీయూ–జీవీ... ఇవన్నీ విజయనగరం జిల్లాకు కలికితురాయి కానున్నాయి.
అభివృద్ధికి రాచబాట గ్రీన్‌ఫీల్డ్ హైవే...
అటు రాష్ట్ర పరిపాలనా రాజధాని కానున్న విశాఖ నగరాన్ని ఇటు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌ను అనుసంధానం చేస్తూ విజయనగరం జిల్లా మీదుగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే సాకారమవుతోంది. రామభద్రపురం, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, ఎల్.కోట, కొత్తవలస మండలాల మీదుగా వెళ్లే దీని పొడవు: 75.03 కిమీ. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.3,778 కోట్లు వెచి్చస్తోంది.
ప్రజల కల... ప్రభుత్వ వైద్య కళాశాల!
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దాన్ని సాకారం చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. శంకుస్థాపన చేసిన ఆయనే రూ.500 కోట్లతో భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి గత ఏడాది సెపె్టంబరు 15న ప్రారంభోత్సవం కూడా చేయడం విశేషం. దీంతో ప్రజలు అత్యవసర వైద్యానికి, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల కోసం విశాఖపట్నం వరకూ పరుగులుపెట్టాల్సిన పరిస్థితి తప్పింది. 500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. : 222 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.
గంగపుత్రులకు వరం ఫిషింగ్ జెట్టీ...
పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి గత ఏడాది మే 3వ తేదీన భూమి పూజ జరిగింది. అంచనా వ్యయం: రూ.23.74 కోట్లు. కేటాయించిన నిధులు: రూ.25 కోట్లు. 6 ఎకరాల్లో నిర్మించనున్న ఈ జెట్టీ వల్ల 5,053 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4 వేల కుటుంబాలకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.
‘వైభోగా’పురం...
► గత ఏడాది మే 3న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. దాదాపు రూ.4,500 కోట్లతో జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టింది. 2025 నాటికి మొదటి దశ పూర్తి కానుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా సౌకర్యాలు.
► ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యం.
► ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుంది.
► భీమిలి బీచ్ కారిడార్ కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్‌వర్క్ పెరగడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడుతుంది.
► విమానాశ్రయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి కలుగుతుంది.
► విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన భూమి 2203.26 ఎకరాలు
► భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.835.48 కోట్లు
► 404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో టౌన్íÙప్‌ల నిర్మాణం.
మన్యంలో ఇదిగో సంక్షేమాభివృద్ధి
► రూ.100 కోట్లతో సమీకృత కలెక్టర్ కార్యాలయం
► జిల్లా కేంద్రంలో రూ.600 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం, సీతంపేటల్లో రూ.50 కోట్ల చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణ పనులు.
► అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.126 కోట్ల చొప్పున జమ.
► జగనన్న విద్యాదీవెన కింద రూ.23.42 కోట్లు..
► జగనన్న వసతి దీవెన ద్వారా రూ.15.84 కోట్లు.
► జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల్లో భాగంగా ముగ్గురికి రూ.లక్ష చొప్పున సాయం.
► పింఛన్ కానుక కింద నెలకు రూ.37 కోట్లు పంపిణీ.
► వైఎస్సార్ ఆసరా కింద రూ.378 కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా రూ.147 కోట్లు, వైఎస్సార్ కల్యాణ మస్తు కింద రూ.11.84 కోట్లు, జగనన్న తోడు కింద రూ.7.59 కోట్లు చొప్పున లబ్ధి కలిగింది.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
► పీఎంజీఎస్‌వై, ఆర్‌సీఈపీఎల్‌డబ్ల్యూ గ్రాంట్ల కింద 1,008 రహదారి పనులు రూ.1,260 కోట్లతో
జరుగుతున్నాయి.
► 190 4జీ సెల్ టవర్లకు 77 పూర్తయ్యాయి.
► 58 రహదారులకు అటవీ అనుమతులు మంజూరు.
n సీతంపేటలో గిరిజన మ్యూజియం, జగతిపల్లి, అడాలి వ్యూ పాయింట్‌ల వద్ద పర్యాటక పనులు రూ.1.40 కోట్లతో, గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్.కె.పాడులో ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు రూ.1.80 కోట్లతో చేపడుతున్నారు.
‘గిరి’జన ప్రగతికి దిక్సూచి...
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూఏపీ) సొంత భవనాల నిర్మాణ పనులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది ఆగస్టు 25న భూమి పూజ చేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని మర్రివలస గ్రామ సరిహద్దులో దీన్ని నిర్మిస్తున్నారు. సీటీయూఏపీ కోసం ఏపీ బడ్జెట్‌లో రూ.834.83 కోట్లు కేటాయించారు. 519.03 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేయడానికి 42 నెలలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ.23.60 కోట్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment