
వైఎస్ జగన్ ను కలిసిన కోలగట్ల
వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు,
విజయనగరం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల. వీరభద్రస్వామి తన చిన్న కుమార్తె శ్రావణితో పాటు శుక్రవారం కలిశారు. వచ్చే నెల 22వ తేదీన తమ పెద్ద కుమార్తె సంధ్య వివాహానికి హాజరు కావాలని కోటగట్ల ఆహ్వానిస్తూ జగన్ మోహన్ రెడ్డికి శుభలేఖను అందజేశారు.
గత బుధవారం జరిగిన సంధ్య నిశ్చితార్థ వేడుకుల గురించి, వివాహానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ ముఖ్యనాయకులు, ప్రముఖులకు ఆహ్వానం అందించినట్లు కోలగట్ల చెప్పారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే 22వ తేదీన విజయనగరంలో జరిగే సంధ్య వివాహ వేడుకలకు హాజరవుతానని చెప్పినట్లు కోలగట్ల తెలియజేశారు.