జిల్లాలో యువజన విభాగాన్ని పటిష్టపరిచి తద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వైఎస్సాఆర్ సీపీ
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో యువజన విభాగాన్ని పటిష్టపరిచి తద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వైఎస్సాఆర్ సీపీ నాయకులు, శాసనమండలి సభ్యు లు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం సాయంత్రం కోలగట్ల నివాసంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడుకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో యువజన విభాగ కమిటీలు త్వరతగతిన ఏర్పాటు చేయాలన్నారు. విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీకి యువజన విభాగం ఎంతో ముఖ్యమని, జిల్లాలో యువజన విభాగం పటిష్టతకు కృషి చేయాలన్నారు.
చంద్రబాబు ఎన్నికల సమయంలో ‘బాబు వస్తే జాబు వస్తుంద’ని మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఈ విషయాన్ని యువజన విభాగం ప్రచారం చేయాలన్నారు. కొత్తగా నియమితులైన యువజన విభాగం అధ్యక్షుడు బంగారునాయు డు మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్ రాజు, రైతు విభాగం అధ్యక్షులు రెడ్డి గురుమూర్తి, అధికార ప్రతినిధి మార్రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.