వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజక వర్గం విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా
విజయనగరం మున్సిపాలిటీ: వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజక వర్గం విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కో లగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గం టలకు పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే సమావేశానికి నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన శనివారం రాత్రి తన నివాసంలో ని యోజకవర్గంలోని ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి విజయసాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. స మావేశానికి పార్టీ నాయకులు, కార్యక ర్తలు విధిగా హజరుకావాలని కోరారు. అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం గా డిసెంబర్ 5న తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు నియోజకవర్గం నుంచి ఐదు వేలకు మందికిగాపైగా పార్టీ నాయకులు, కార్యకర్తలను సమీకరణ చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, మామిడి అప్పలనాయుడు, బంగారునాయుడు, మాజీ కౌన్సిలర్ ఆ శపు వేణు, మాజీ కౌన్సిలర్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.