సాక్షి, విజయనగరం : చంద్రబాబుకు రాజ్యసభ ఎన్నికల ద్వారా మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరం జెడ్పీ గెస్ట్ హౌస్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రాజన్నదొర, అప్పల నరసయ్య, కంబాల జోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. ' 23 మంది ఎమ్మెల్యే లు ఉంటే కేవలం17 ఓట్లు మాత్రమే రావడం సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకత తేటతెల్లం అవుతుంది. రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు భూ సేకరణ చేసింది ఎవరు.. ఏం చేద్దామని అవసరానికి మించి భుమిని టీడీపి ప్రభుత్వం సేకరించింది.. వైసీపీ నాయకుల భూములను బలవంతంగా లాక్కుంది మీరు కాదా?
భూములు అమ్ముకునే సంస్కృతి మా నాయకులకు లేదు. గతంలో మయూరి సెంటర్‌లో ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని మీరు అమ్ముకో లేదా.. మాది నీతి గల ప్రభుత్వం... సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో విసృతంగా జరుగుతున్నాయి.. నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు కానీ గతంలో డబ్బులన్ని మంత్రులు, మిగతా నాయకుల జేబుల్లోకి వెళ్లేవి. కాని ఇప్పుడు మాత్రం నేరుగా ప్రజలకు అందుతుంది' అంటూ తెలిపారు.
ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఒక్క సాలూరు నియోజకవర్గానికే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రూ. 110 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జీవో నెంబర్ మూడు గిరిజన చట్టంపై న్యాయస్థాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment