ఆయన పార్టీకి అందించిన సేవల్ని గుర్తించారు . పనితీరుకు పట్టం కట్టారు. త్యాగాన్ని దృష్టిలో పె ట్టుకున్నారు. పార్టీ శ్రేణులు ఆశించినట్టే కోలగట్లకు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆయన పార్టీకి అందించిన సేవల్ని గుర్తించారు . పనితీరుకు పట్టం కట్టారు. త్యాగాన్ని దృష్టిలో పె ట్టుకున్నారు. పార్టీ శ్రేణులు ఆశించినట్టే కోలగట్లకు ఎమ్మె ల్సీ టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో వీరభద్రస్వామి మరోసారి శాసనమండలిలో అడుగు పెట్టనున్నారు. ఎమ్మెల్సీ పదవి ఉన్నా వైఎస్‌ఆర్ సీపీ తరఫున పోటీ చేయాలన్న ఏకైక లక్ష్యంతో మొన్నటి ఎన్నికల బరిలోకి దిగి ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్న కోలగట్ల వీరభద్రస్వామికి ఆ పార్టీ అధినాయకత్వం అండగా నిలిచింది. నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన త్యాగాన్ని మరిచిపోమని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పకనే చెప్పారు.
ఎన్నికల అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని చేసి ప్రాధాన్యం కల్పించారు. అధినేత నమ్మకాన్ని వమ్ముచేయకుండా కోలగట్ల ...పార్టీని నడిపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవా ణి, పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబ శివరాజు,నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను సమన్వయం చేసుకుని పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవం తం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో జిల్లాకు సుస్థిర స్థా నంలో నిలబెట్టారు. ఇవేవీ వృథా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాలేదు. జిల్లా నాయకుల కోరిక, కార్యకర్తల అభిప్రాయ మేరకు కోలగట్ల వీరభద్రస్వామికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ఖరారు చేశారు.
రాజకీయ నేపథ్యం
కోలగట్ల వీరభద్రస్వామి గురించి జిల్లాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పదవితో నిమిత్తం లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తారన్న పేరుంది. అటు రాజకీయాలు, ఇటు సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో గుర్తింపు పొందారు. 1983లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోలగట్ల వీరభద్రస్వామి 1985లో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డెరైక్టర్‌గా, 1987లో మున్సిపల్ కౌన్సిలర్‌గా, 1988లో అర్బన్ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశారు. 1989లో తొలిసారిగా విజయనగరం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు.
ఆ తర్వాత 1994,99లో పోటీ చేసినా విజయం సాధించని వీరభద్రస్వామి 2004ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, అశోక్ గజపతిరాజుపై గెలుపొంది రికార్డు సృష్టించారు. శాసనసభ సభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయనగరాన్ని ప్రగతి పథంలో నడిపించారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి పోటీ చేశారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికకానున్నారు. ఇక పార్టీ పదవులకొచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్‌సీపీలో చేరాక పార్టీకి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వైఎస్ జగన్ మాట తప్పని, మడమ తిప్పని నేత : కోలగట్ల
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని నేత అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాటిస్తే కట్టుబడతారని, తనకు ఎమ్మెల్సీ ఖరారు చేసి మరోసారి నిరూపించుకున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న నమ్మకం, రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో తాను ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. నైతిక విలువలకు కట్టుబడి తనకు ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. తనపై ఉన్న నమ్మకంతో వైఎస్ జగన్ తనకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారన్నారు. పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని మరింత ముందుకు నడిపించానన్నారు. పనితీరు, నిజాయితీని గుర్తించి తన కు ఎమ్మెల్సీ ఖరారు చేశారని చెప్పారు.
ఎన్నికలకు ముందుకు కొందరు నేతలు బయటికొచ్చి వైఎస్ జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేశారని, కానీ అదంతా అసత్య ప్రచారమని, ఆయన మాటకు కట్టుబడే నేత అని చెప్పడానికి తాజాగా తనకు న్యాయం చేసిన విధానాన్నే తీసుకోవచ్చన్నారు. ఎన్ని ఒత్తిడులు ఉ న్నా అందర్నీ ఒప్పించి ఇచ్చిన మాట ప్రకారం తనకు ఎమ్మెల్సీ ఖరారు చేసిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అందరి సమన్వయంతో విజయవంతం చేయడమే కాకుండా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.