సాక్షి, విజయనగరం: జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు అళ్ల నాని, పుష్ప శ్రీ వాణి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనాపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా జిల్లాలో సమీక్ష చేయడం జరిగిందని మంత్రులు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ నుంచి నెగిటివ్ రాగానే ఆసుపత్రి నుంచి డిశార్జి చేసి ఇంటికి పంపిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి శనివారం నాలుగు పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నారు.వీటిలో మూడు పాజిటివ్ కేసులు వలసకార్మికులు కావడం గమనార్హమన్నారు. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం)
అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి స్థాయిలో గుర్తించి వారికి ముందుగానే పరీక్షలు చేసి హోం క్వారంటైన్ చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పూర్తి స్థాయిలో మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. జిల్లాలోని 72 క్వారంటైన్ కేంద్రాల్లో పరిశుభ్రత పాటిస్తూ వారికి ఆహారం అందిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనుమానితులని వెంటనే గుర్తించి వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేసి రిపోర్ట్ వచ్చేవరకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం వైజాగ్ విమ్స్ లో కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సిబ్బందికి , వైద్యులు కి అన్ని రకాల రక్షణ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వెంటిలేటర్స్ని కూడా అదనంగా సిద్ధం చేశామన్నారు. వీటితో పాటు జిల్లాలో ఐదు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కోవిడ్ ఆసుపత్రుల కింద సిద్ధం చేసినట్లు చెప్పారు. స్పెషాలిటీ సేవలుని కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లా మెరుగుగానే ఉందన్నారు. (వైద్యం అందించటంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్)
వైజాగ్‌లో కరోనా వైరస్‌తో శనివారం మృతిచెందిన బలిజిపేట , చిలకలపల్లి కి చెందిన 60 ఏళ్ల వృద్ధ మహిళకు సంబంధించిన 16 మంది కుటుంబ సబ్యులకు పరీక్షలు చేయగా అందరకీ కరోనా నెగటివ్ రావడం జరిగిందన్నారు. ఆ మహిళ కరోనాతో పాటు డయాలసిస్ పేషెంట్ అని కూడా తెలిపారు. చిలకలపల్లి గ్రామం తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో సర్వే చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు అందరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనవసర విషయాలకి బయటకి రావద్దు అని విజ్ఙప్తి చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. (తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్)
Comments
Please login to add a commentAdd a comment