
విజయనగరం (పూల్‌బాగ్): రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశాడని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కూడా కట్టలేకపోయాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్నానని చెప్పారు. తాను దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తనతో కలిసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖలు ఇచ్చినా.. తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదన్నారు.
చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి!
Comments
Please login to add a commentAdd a comment