
సాక్షి, విజయనగరం: భోగాపురం మండలంలోని లింగాలవలస జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్నస్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం ఎస్పీ రాజకుమారి మీడియాకు వివరాలు వెల్లడించారు.14 వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని..దీని విలువ సుమారు కోటి యాభై లక్షలు ఉంటుందని తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి ఢిల్లీకి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పెందుర్తిలో ఓ రెస్టారెంట్ యజమాని సుఖ్‌దేవి నుంచి స్మగ్లర్లు గంజాయిని తీసుకున్నారని చెప్పారు. సుఖ్‌దేవి పరారీలో ఉందన్నారు. కేసు నమోదు చేసి గంజాయి రవాణాపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment