Cannabis seized
-
560 కేజీల గంజాయి స్వాధీనం
రావికమతం : గిరిజన గ్రామం రొచ్చుపణుకు నుంచి తరలించేందుకు బొలేరో వాహనంలో సరకు వేస్తుండగా కొత్తకోట పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి రూ.17లక్షల విలువైన 560 కేజీల గంజాయిని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారయ్యారు. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి అందించిన వివరాలివి. రొచ్చుపణుకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలించేందుకు సిద్ధమైనట్టు తమకు సమాచారం అందడంతో ఎస్ఐ అప్పలనాయుడు, సిబ్బందితో ఆదివారం రాత్రి దాడి చేశామన్నారు. ఈ దాడిలో బొలేరో వాహనంలో నిల్వ చేసిన 24 బస్తాలు గల 560 కేజీల గంజాయి లభ్యమైందన్నారు. అక్కడ వ్యవహారం చేసిన ఇద్దరు వ్యక్తులు మాకవరపాలెం సీతన్న అగ్రహారానికి చెందిన చొప్పా రాజిబాబు,జి.కోడూరుకు చెందిన నమ్మి రాంబాబులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. మరొకరు పరారయ్యారన్నారు. అతని గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. (చదవండి: జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం) -
రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెల్లవారు జాము.. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్ వైపు నల్లరంగు స్కార్పియో వచ్చింది.. తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు.. స్కార్పియో డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని పెంచి రంపచోడవరం వైపు పోనిచ్చాడు.. కంగుతిన్న పోలీస్‌లు రెండు కార్లతో ఆ వాహనాన్ని వెంబడించారు.. వెనుక వైపు పోలీస్ వాహనం వస్తుంటే ముందుగా వెళుతున్న స్కార్పియో రోడ్డు మలుపులు దాటుకుంటూ వెళుతోంది.. అచ్చు సినిమాల్లోలా. అలా రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లాక అక్కడ మలుపులో సిమెంట్ గోడను స్కార్పియో ఢీకొట్టి జలాశయంలోకి దూసుకుపోయింది. కారులో ఉన్న గంజాయి మూటలు ఒక్కసారిగా చెల్లాచెదురుగా బయట పడిపోయాయి. ప్రాజెక్టులో పడిపోయిన వాహనం నుంచి ఓ వ్యక్తి ఒడ్డుకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 300 కేజీల వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టులో పడిపోయిన వాహనాన్ని బయటకు తీసి మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒడిశా ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఆదివారం రాత్రే మారేడుమిల్లి ప్రాంతానికి తెచ్చి, తరలిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో కారును వెంబడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా. వాహనంలో గంజాయి తరలిస్తున్న సమాచారం రావడంతో నిఘా వేసి పట్టుకున్నట్టు రంపచోడవరం అడిషనల్ ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ చెప్పారు. -
విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత
గొలుగొండ/మాడుగుల: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బొలెరో జీపులో అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని గొలుగొండ ఎస్ఈబీ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు మండలం ధర్మవరం వద్ద గంజాయి పట్టుకున్నట్లు ఎస్ఈబీ సీఐ రాజారావు, ఎస్ఐ గిరి తెలిపారు. దీని విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఎస్.సత్యనారాయణ, రామన్న, నారాయణరావు అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. వారి నుంచి బైక్, బొలెరో జీపు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 60 కిలోల పట్టివేత విశాఖ జిల్లా మాడుగుల మండలం తాటిపర్తి జంక్షన్ వద్ద బుధవారం మాడుగుల ఎస్ఐ పి.రామారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గంజాయి పట్టుకున్నారు. తాటిపర్తి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ మన్యం నుంచి వస్తున్న మారుతీ కారులో 60 కిలోల గంజాయి బయటపడింది. కారు సీజ్ చేసి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
2,000 కిలోల గంజాయి స్వాధీనం
చింతూరు: రాష్ట్రంలో గంజాయి రవాణాపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏఎస్పీ కృష్ణకాంత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుకుమామిడి అటవీ ప్రాంతం మీదుగా గంజాయి రవాణా జరుగుతుందంటూ వచ్చిన సమాచారంతో సీఐ యువకుమార్, ఎస్ఐ సత్తిబాబు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో కొబ్బరికాయల లోడ్‌తో వచ్చిన ఓ వ్యానును తనిఖీ చేయగా.. కొబ్బరికాయల కింద గంజాయి మూటలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణకు చెందిన కడియం గురుసాగర్, పొగిడాల పర్వతాలు, ఒడిశాకు చెందిన నైని రామారావును అరెస్టు చేసి.. 2 వేల కిలోల గంజాయి, వ్యాన్‌ను, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏజన్సీ వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఏజెన్సీలో ముమ్మరంగా గంజాయి తోటల ధ్వంసం సీలేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతోంది. బుధవారం గుమ్మరేవుల పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లో గంజాయి మొక్కలను స్థానికులు నరికేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా తమ గ్రామాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన చర్యలతో చింతగుప్ప, పొలుతురుకోట గ్రామాల ప్రజలు గంజాయి మొక్కలను నరికేసి.. ఇకపై గంజాయి సాగు చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. చింతగుప్ప గ్రామంలో గంజాయి మొక్కలు నరికివేస్తున్న గిరిజనులు -
రూ. 1.25 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
చుంచుపల్లి: ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి పుణేకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్‌చేశారు. వారి నుంచి రూ. 1.25కోట్ల 626 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చుంచుపల్లి సీఐ గురుస్వామి చెప్పారు. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన శ్యాం శివాజీ ఖలే, ప్రభాకర్ తంబే, అరవింద్ గులేతో పాటు కున్లు ఒడిశా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశారు. ఈ గంజాయిని 26 బస్తాల్లో పేర్చి లారీలో కొబ్బరి మొక్కల మధ్యలో పెట్టి భద్రాచలం, కొత్తగూడెం మీదుగా తరలిస్తుండగా చుంచుపల్లి విద్యానగర్ కాలనీ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై మహేష్ పట్టుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పట్టుబడగా, కున్లు పరారయ్యాడు. -
గంజాయి, డ్రగ్స్ పట్టివేత
కర్నూలు: కర్నూలులో భారీగా గంజాయి, నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. వివరాలను సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, కేవీ మహేష్‌తో కలసి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు మూడో పట్టణ సీఐ తబ్రేజ్, సెబ్ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని అరుంధతి నగర్‌కు వెళ్లే దారిలో పాడుబడిన ఇంటి దగ్గర దాడులు నిర్వహించారు. వారినుంచి రూ.4.25 లక్షలు విలువ చేసే 17 కేజీల గంజాయి, రూ. 27,500 విలువ చేసే 22 మిల్లీ గ్రాముల ఎల్ఎస్డీ స్టాంప్స్(నిషేధిత డ్రగ్)ను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన మహమ్మద్ వసీం, షేక్ షాహిద్ బాషా, జహీర్ అలీఖాన్, షేక్ షాహిద్ బాషా, షేక్ మహమ్మద్ సుహైల్, బి.తాండ్రపాడుకు చెందిన షేక్ ఫిరోజ్ బాషా, చాకలి దస్తగిరి, విష్ణుటౌన్‌షిప్‌కు చెందిన బునెద్రి అగ్నివిుత్ర, గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామానికి చెందిన బీమినేని భరత్‌చంద్ర, గుంటూరు ఫాతిమాపురానికి చెందిన కాటుమాల జోసెఫ్‌ను అరెస్టు చేశారు. కాగా, వీరు గంజాయిని గిద్దలూరు, తుని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ –1985 కింద కేసు నమోదు చేశారు. -
25 కేజీల గంజాయి పట్టివేత
అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి సర్కిల్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీలో భాగంగా మారుతి ఏర్టిగా వాహనంలో తరలిస్తున్న 25 కేజీల గంజాయి,ఒక లీటర్ గంజాయి ఆయల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి కారు, ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి. భారీగా కొకైన పట్టివేత, ఎల్సీడీ డ్రగ్స్, గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్టు చేశారు. డ్రగ్ మాఫియా మళ్లీ చాపకింద నీరులా విస్తరించడంతో నగరం మరోసారి ఉలిక్కి పడింది. ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఎగుమతి అయిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో గంజాయి పట్టివేత
సాక్షి, గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం వద్ద అక్రమంగా కారులో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని శనివారం రాత్రి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి తమిళనాడుకు కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందడంతో ఆత్కూరు జాతీయ రహదారి ఉన్న వంతెన వద్ద ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో గన్నవరం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది గంజాయిని తరలిస్తున్న కారుని అడ్డుకున్నారు. ఆదివారం విజయవాడ ఎక్సైజ్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 450 కేజీలు గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నామని.. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల వద్ద బలమైన ఇనుపరాడ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిందితులు పలు గంజాయి కేసుల్లో పాడేరు కోర్టుకు హాజరై వస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆధార్ కార్డుతో పాటు పలు ఆధారాలు లభించాయని ఏసీపీ వెల్లడించారు. -
14 వందల కేజీల గంజాయి స్వాధీనం
సాక్షి, విజయనగరం: భోగాపురం మండలంలోని లింగాలవలస జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్నస్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం ఎస్పీ రాజకుమారి మీడియాకు వివరాలు వెల్లడించారు.14 వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని..దీని విలువ సుమారు కోటి యాభై లక్షలు ఉంటుందని తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి ఢిల్లీకి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పెందుర్తిలో ఓ రెస్టారెంట్ యజమాని సుఖ్‌దేవి నుంచి స్మగ్లర్లు గంజాయిని తీసుకున్నారని చెప్పారు. సుఖ్‌దేవి పరారీలో ఉందన్నారు. కేసు నమోదు చేసి గంజాయి రవాణాపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. -
గంజాయి ముఠా అరెస్టు
సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని రవాణా చేస్తోన్న ముగ్గురు యువకులు గురువారం రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం నుంచి కష్ణాజిల్లాకు సుమారు 10 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు వారిని పట్టుకున్నారు. ఏలూరు రైల్వే ఎస్ఐ కె.శాంతారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు విశాఖ నుంచి గూడూరు ప్రాంతానికి గంజా యిని రవాణా చేస్తున్నారని తెలిపారు. మనోహర్, పీ.సతీష్, కుసుమకుమార్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేశారని, వారి నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇటీవల గంజాయి రవాణా ముఠాలు ఎక్కువ కావటంతో నిఘా పెంచామని, రైళ్లలో ప్రయాణికుల భద్రతతోపాటు, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై మరింతగా నిఘా ఉంచుతున్నామన్నారు. -
గంజాయితో తప్పించుకోబోయి..
సాక్షి, చింతపల్లి (విశాఖపట్నం) : మండలంలోని లోతుగెడ్డ జంక్షన్ వద్ద సోమవారం పర్యాటకుడిని గంజాయి తరలిస్తున్న ఆటో బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో పర్యాటకుడు తీవ్రంగా గాయపడగా ఆటో బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే.. లోతుగెడ్డ జంక్షన్లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. దీంతో ప్రధాన రహదారిలో పింఛనుదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కాస్తున్నారు. ఇదే సమయంలో సోమవరం ప్రాంతం నుంచి ఆటో వేగంగా వస్తోంది. ఇక్కడ ఉన్న పోలీసులను గమనించి ఆటో డ్రైవరు ఆందోళనకు గురై ఆటో వేగం పెంచాడు. ఇదే సమయంలో సమీపంలోని పంచవటి తోటల వద్ద విశాఖపట్నం పర్యాటకుడు శ్రీను భోజనం చేసి బయటకు వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో అతడిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడగా పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆటో బోల్తా పడ్డాక వారు అక్కడ నుంచి పరారు అయ్యారు. వారికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆటో అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పొలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, విజయవాడ : లారీలో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ అధికారులు విజయవాడలో పట్టుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఇసుక లారీని తనిఖీ చేయగా గంజాయి బస్తాలు బయటపడ్డాయి. గంజాయి విలువ రెండున్నర కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లారీని సీజ్ చేసి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగు క్వింటాళ్ల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీలో బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహించి ఓ ఇంటిలో నాలుగు క్వింటాల గంజాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మల్కన్‌గిరి ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్‌శెట్టి తన బృందంతో తనిఖీలు నిర్వహించారు. అయితే పతీత్ బిస్వష్, మహాదేవ్ బిస్వష్‌లు ఛత్తీస్‌గఢ్ తరలించేందుకు గంజాయి నిల్వలు ఇంటిలో ఉంచారు. ఎక్సైజ్ అధికారులు దాడి చేసిన సమయంలో తండ్రి పతీత్ బిస్వష్ పరారయ్యాడు. కొడుకు మహదేవ్ బిస్వస్‌ను అరెస్టు చేశారు. మల్కన్‌గిరి ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఈ గంజాయి విలువ 20లక్షలు ఉంటుంటుని తెలిపారు. మంగళవారం కూడా రెండు వలదల క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో ఇదే ముఖ్య పంటగా పండిస్తున్నారన్నారు. నెల రోజుల్లో 50 కోట్లు విలువ చేసే గంజాయి పంటను ధ్వంసం చేశామని ఇంకా ప్రతి గ్రామంపై దాడి చేసి ఈ గంజాయి సాగును ధ్వంసం చేస్తామని చెప్పారు. -
గంజాయి ప్యాకెట్ల పట్టివేత
దేవరకద్ర : మండల కేంద్రంలోని పశువుల సంత సమీపంలో శుక్రవారం రాత్రి గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. ఎస్ఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం.. దేవరకద్రకు చెందిన దొబ్బలి ఆంజనేయులు అనే వృద్ధుడు సంతబజార్ సమీపంలో చిన్న దేవాలయంతోపాటు అక్కడే ఇల్లు కట్టుకుని కుటుంబంతో ఉంటున్నాడు. చాలా ఏళ్ల నుంచి ఆలయానికి వచ్చే సాధువులతో కలిసి గంజాయి సేవించేవాడు. విషయం పోలీసులకు తెలియడంతో శుక్రవారం అదే ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తూ నిఘా వేశారు. సంచిలో గంజాయి ప్యాకెట్లను వేసుకుని దొబ్బలి ఆంజనేయులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. ఇందులో 350 గ్రాముల గంజాయి 42 చిన్న ప్యాకెట్లుగా ఉందని, గంజాయి ఆకు 130 గ్రాములుగా ఉందని, గంజాయి గింజలు 140 గ్రాములు ఉన్నాయి. ఈ మేరకు వీటిని స్వాధీనం చేసుకుని దొబ్బలి ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి పట్టుకున్న సంఘటనపై విచారణ చేయడానికి డీఎస్పీ భాస్కర్ శుక్రవారం రాత్రి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. నిందితున్ని విచారణ చేసి వివరాలు తెలుసుకున్నామని గంజాయి ఎక్కడి నుంచి ఇక్కడికి సరాఫరా అవుతుందో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి బస్సులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని గురువారం ఉదయం పాల్వంచలో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి.మాడుగుల మండలం ఉరుము జంక్షన్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 150 కేజీల గంజాయిని కారులో తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి తమిళనాడుకు చెందిన ఇళయరాజాగా పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
50 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం (అనంతగిరి) : ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సాలోని జైపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తుండగా అనంతగిరి వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.