గంజాయి ముఠా అరెస్టు | Police Seized Canja Transportation In West Godavari | Sakshi

గంజాయి ముఠా అరెస్టు

Jul 12 2019 9:36 AM | Updated on Jul 12 2019 9:36 AM

Police Seized Canja Transportation In West Godavari - Sakshi

రైల్వే పోలీసుల అదుపులో గంజాయి రవాణా చేస్తున్న యువకులు 

సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో  గంజాయిని రవాణా చేస్తోన్న ముగ్గురు యువకులు గురువారం రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం నుంచి కష్ణాజిల్లాకు సుమారు 10 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు వారిని పట్టుకున్నారు. ఏలూరు రైల్వే ఎస్‌ఐ కె.శాంతారామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు విశాఖ నుంచి గూడూరు ప్రాంతానికి గంజా యిని రవాణా చేస్తున్నారని తెలిపారు. మనోహర్, పీ.సతీష్, కుసుమకుమార్‌ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేశారని, వారి నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఇటీవల గంజాయి రవాణా ముఠాలు ఎక్కువ కావటంతో నిఘా పెంచామని, రైళ్లలో ప్రయాణికుల భద్రతతోపాటు, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై మరింతగా నిఘా ఉంచుతున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement