
సాక్షి, విజయవాడ : లారీలో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను డీఆర్‌ఐ అధికారులు విజయవాడలో పట్టుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఇసుక లారీని తనిఖీ చేయగా గంజాయి బస్తాలు బయటపడ్డాయి. గంజాయి విలువ రెండున్నర కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లారీని సీజ్ చేసి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment