ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం (అనంతగిరి) : ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సాలోని జైపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తుండగా అనంతగిరి వద్ద పోలీసులు పట్టుకున్నారు.
వారి నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.