
విఖ్యాత్ (ఫైల్)
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. అంబాడుతూ వెళ్లిన ఏడాది బాలుడు బకెట్లో పడి మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి.. అనంతగిరి పట్టణంలోని పాత శిశు మందిరం సమీపంలో నివాసముండే దశరథ్, భాగ్యలక్ష్మికి ఇద్దరు సంతానం. వీరిలో చిన్నవాడు విఖ్యాత్ (1). పండుగ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎవరి పనుల్లో వారుండగా.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి బాత్‌రూంలోని బకెట్‌లో ఇరుక్కున్నాడు.
తలకిందులుగా పడటంతో బకెట్‌లోనే ప్రాణాలు వదిలాడు. అరగంట తర్వాత బాబు కోసం చూడగా ఉలుకుపలుకు లేకుండా బకెట్లో పడి కనిపించాడు. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లోని ఓ షోరూంలో సెల్ ఫోన్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు.
రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్తూ వికారాబాద్ స్టేషన్‌లో రైలు ఎక్కాడు. ఇంటి నుంచి ఫోన్ రావడంతో తిరిగివచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా గత నెల 24న విఖ్యాత్ తొలి పుట్టిన రోజు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. ఆ తీపి జ్ఞాపకాలు మరువకముందే చిన్నారి మృతి చెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది.
చదవండి: Mukarram Jah: చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత..
Comments
Please login to add a commentAdd a comment