Bucket of water
-
పండగ పూట విషాదం.. ఆడుకుంటూ వెళ్లి బకెట్లో పడటంతో
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. అంబాడుతూ వెళ్లిన ఏడాది బాలుడు బకెట్లో పడి మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి.. అనంతగిరి పట్టణంలోని పాత శిశు మందిరం సమీపంలో నివాసముండే దశరథ్, భాగ్యలక్ష్మికి ఇద్దరు సంతానం. వీరిలో చిన్నవాడు విఖ్యాత్ (1). పండుగ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎవరి పనుల్లో వారుండగా.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి బాత్రూంలోని బకెట్లో ఇరుక్కున్నాడు. తలకిందులుగా పడటంతో బకెట్లోనే ప్రాణాలు వదిలాడు. అరగంట తర్వాత బాబు కోసం చూడగా ఉలుకుపలుకు లేకుండా బకెట్లో పడి కనిపించాడు. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లోని ఓ షోరూంలో సెల్ ఫోన్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్తూ వికారాబాద్ స్టేషన్లో రైలు ఎక్కాడు. ఇంటి నుంచి ఫోన్ రావడంతో తిరిగివచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా గత నెల 24న విఖ్యాత్ తొలి పుట్టిన రోజు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. ఆ తీపి జ్ఞాపకాలు మరువకముందే చిన్నారి మృతి చెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది. చదవండి: Mukarram Jah: చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత.. -
పసిబిడ్డను బకెట్లో వేసి చంపిన తండ్రి
-
పసికందును బకెట్లో వేసి చంపిన కసాయి
ఉండవెల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కసాయిగా మారాడు. ఐదు నెలల వయస్సు ఉన్న కన్న కూతురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు. పుల్లూరుకు చెందిన కుర్వ విజయ్‌కుమార్ నీళ్ల బకెట్లో తన కుమార్తెను పడవేశాడు. దీంతో నీటిలో ఊపిరాడక ఆ పసికందు మృతిచెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
బకెట్లో పడి బాలుడు మృతి
చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూరులో మంగళవారం బకెట్లో పడి బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన తడ్కపల్లి రుషి-సునీతల కుమారుడు వర్షిత్ (14 నెలలు). ఆటోడ్రైవర్ అయిన రుషి బయటకు వెళ్లగా, సునీత ఇంట్లో పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో వర్షిత్ ఆడుకుంటూ ఇంటి బయట నిండుగా ఉన్న బకెట్ నీళ్లలో పడిపోయాడు. చిన్నారి కనిపించకపోవడంతో సునీత వెతకగా బకెట్లో మృతి చెంది ఉన్నాడు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
భీమారంలో విషాదం భీమారం(మేడిపెల్లి) : బుడిబుడి అడుగులతో..బోసినవ్వులతో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్లో పడి మృతిచెందిన సంఘటన మేడిపల్లి మండలం భీమారంలో గురువారంచోటుచేసుకుంది. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన లెసైట్టి మహేశ్-రమ దంపతులకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.మహేశ్ భార్య రమ మధ్యాహ్నం ఇంటి ఆవరణలో బట్ట లు ఉతుకుతుండగా చిన్నకూతురు దివ్యంశీ అలియాస్ మిని (20నెలలు) అక్కడే ఆడుకుంటోంది. చిన్నారి ఆటను చూస్తూనే రమ ఉతికిన బట్టలను బం గ్లాపై ఆరేసేందుకు వెళ్లింది. కిందికి వచ్చి చూసేసరికి కూతురు నీటి బకెట్లో పడి ఉంది. ఆందోళనతో అరవగా కుటుంబ సభ్యులు వచ్చి పాపను బకెట్లో నుంచి బయటకు తీసి ప్రథమచికిత్స చేశారు. అనంతరం జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. సాయంత్రం జరిగిన చిన్నారి అంత్యక్రియలకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. చిన్నా తండ్రి మహేశ్ భీమారం సింగిల్ విండో వైస్‌చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
ఆ బోసి నవ్వులు ఇక లేవు..
ప్యాపిలి, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని పాలబుగ్గల ఆ చిన్నారికి ఏడాదికే నూరేళ్లు నిండాయి. తన బుడిబుడి నడకలతో బోసినవ్వులతో ఇంటిల్లిపాదినీ అలరించిన ఆ పాప విగతజీవిగా మారి తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. మండల కేంద్రం ప్యాపిలిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీళ్ల బకెట్లో పడి షెరితాజ్ (1) మృతి చెందింది. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన నివాసముంటున్న బషీర్, కౌసర్‌కు ముగ్గురు కుమార్తెలు. టైలర్ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న బషీర్ గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉండగా భార్య ఆరుబయట ఇరుగు పొరుగుతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంత వరకు తల్లి ఒల్లోనే ఉన్న చిన్నారి షెరితాజ్ బుడి బుడి నడకలతో బాత్రూంలోకి వెళ్లింది. రోజులాగే బాత్ రూంలోకి వెళ్లి ఆడుకుంటుందిలే.. అనుకున్న తల్లి మాటల్లో పడి చిన్నారిని మరిచిపోయింది. నీళ్ల బకెట్లో బాటిల్‌ను తీసుకునే ప్రయత్నంలో ఆ చిన్నారి బకెట్లోకి పడి పోయింది. బకెట్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ బాలిక తల నీళ్లలో మునగటంతో ఊపిరాడక మృతి చెందింది. చిట్టి చెల్లిని తమతో పాటు ఆడించుకునేందుకు ఇళ్లంతా వెతికిన అక్కలు రేష్మా, రుక్సానాలు బాత్రూంలో తలకిందులుగా బకెట్లో పడిన చిన్నారిని చూసి కేకలు వేశారు. ఒక్క ఉదుటున అక్కడికి చేరిన తల్లిదండ్రులు బాలికను చూసి హతాశులయ్యారు. గుండెలు బాదుకుంటూ రోదిస్తూ తల్లి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు బాలిక తల్లిని హుటాహుటిన డోన్ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతదేహం వద్ద అమ్మమ్మ బీబీ రోదనలు మిన్నంటాయి.