
బకెట్‌లో పడి బాలుడు మృతి
చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూరులో మంగళవారం బకెట్‌లో పడి బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన తడ్కపల్లి రుషి-సునీతల కుమారుడు వర్షిత్ (14 నెలలు). ఆటోడ్రైవర్ అయిన రుషి బయటకు వెళ్లగా, సునీత ఇంట్లో పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో వర్షిత్ ఆడుకుంటూ ఇంటి బయట నిండుగా ఉన్న బకెట్ నీళ్లలో పడిపోయాడు. చిన్నారి కనిపించకపోవడంతో సునీత వెతకగా బకెట్‌లో మృతి చెంది ఉన్నాడు.