ఉండవెల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కసాయిగా మారాడు. ఐదు నెలల వయస్సు ఉన్న కన్న కూతురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు. పుల్లూరుకు చెందిన కుర్వ విజయ్‌కుమార్ నీళ్ల బకెట్‌లో తన కుమార్తెను పడవేశాడు. దీంతో నీటిలో ఊపిరాడక ఆ పసికందు మృతిచెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.