one year boy
-
పండగ పూట విషాదం.. ఆడుకుంటూ వెళ్లి బకెట్లో పడటంతో
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. అంబాడుతూ వెళ్లిన ఏడాది బాలుడు బకెట్లో పడి మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి.. అనంతగిరి పట్టణంలోని పాత శిశు మందిరం సమీపంలో నివాసముండే దశరథ్, భాగ్యలక్ష్మికి ఇద్దరు సంతానం. వీరిలో చిన్నవాడు విఖ్యాత్ (1). పండుగ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎవరి పనుల్లో వారుండగా.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి బాత్రూంలోని బకెట్లో ఇరుక్కున్నాడు. తలకిందులుగా పడటంతో బకెట్లోనే ప్రాణాలు వదిలాడు. అరగంట తర్వాత బాబు కోసం చూడగా ఉలుకుపలుకు లేకుండా బకెట్లో పడి కనిపించాడు. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లోని ఓ షోరూంలో సెల్ ఫోన్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్తూ వికారాబాద్ స్టేషన్లో రైలు ఎక్కాడు. ఇంటి నుంచి ఫోన్ రావడంతో తిరిగివచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా గత నెల 24న విఖ్యాత్ తొలి పుట్టిన రోజు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. ఆ తీపి జ్ఞాపకాలు మరువకముందే చిన్నారి మృతి చెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది. చదవండి: Mukarram Jah: చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత.. -
మంచినీళ్లు తెచ్చేలోపే..
సాక్షి, ఖమ్మం: తన చేతితో గోరు ముద్దలు తినిపించిన కొడుకు కనురెప్పపాటులో విగతజీవిగా మారాడు. అప్పటి వరకు తనతో ఆటలాడిన ఆ చిన్నారి ఇకలేడని తెలిసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. గత నెలలోనే ఆ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. నెలతిరిగేలోపులోనే గారాబంగా పెంచుకుంటున్న ముద్దులొలికే చిన్నారి కానరాని లోకాలకు వెళ్తాడని ఊహించని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఏనుగుతల నరేష్ వ్యాపారం చేస్తూ భార్య లాస్య, ఇద్దరు కుమారులతో జీవిస్తున్నారు. గురువారం ఉదయం లాస్య తన చిన్న కుమారుడైన శ్రీహాన్ (13నెలలు)కు రెండో అంతస్తులోని పోర్టికోలో అటు ఇటు తిప్పుతూ ఇడ్లీ తినిపిస్తోంది. మధ్యలో మంచినీరు తెచ్చేందుకు శ్రీహాన్‌ను పోర్టికోలో కూర్చోబెట్టి లోపలికి వెళ్లింది. ఆమె మంచినీళ్లు తెచ్చేలోపే శ్రీహాన్ ఆడుకుంటూ వెళ్లి గ్రిల్స్ ఎక్కి కింద పడిపోయాడు. గమనించిన లాస్య ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టుకుంటూ కిందకు వచ్చింది. భవనం పై నుంచి పడడంతో తలకు బలమైన గాయమై శ్రీహాన్ అప్పటికే స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆమె కుటంబ సభ్యులకు తెలపగా.. విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు ఎప్పుడూ తమ ఒడిలో ఆడుకుంటూ వచ్చీరాని మాటలతో అమ్మనాన్న అంటూ పలుకుతూ ఉన్న తమ బిడ్డ విగతజీవిగా ఆసుపత్రి నుంచి తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని చూసి తండోపతండాలుగా చేరుకున్న స్థానికులు కంటతడి పెట్టారు. గత నెలలోనే పుట్టినరోజుకు వచ్చి ఆ చిన్నారికి తమ ఆశీస్సులు అందజేసిన వారు మృతదేహాన్ని చూసి పుట్టినరోజు వేడుకలను గుర్తు తెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
తిరుమలలో చంటిబిడ్డ అపహరణ
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఏడు నెలల వయసున్న చంటిబిడ్డ అపహరణకు గురికావడం కలకలం రేపింది. తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్న చిన్నారి బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ, పురుషుడు కలసి ఎత్తుకెళ్లారు. నిద్రలేచిన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించగా.. చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, రత్నమ్మలు తమ పిల్లలు ప్రమీల(8), శ్రీనివాసులు(6), సువర్ణ(2), చిన్నకుమారుడు చెన్నకేశవులు(7నెలలు)తో కలసి శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం తిరుమల వచ్చారు. దర్శనం పూర్తిచేసుకున్న వారు రాత్రికి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం ప్రాంతంలో నిద్రించారు. బుధవారం వేకువన నాలుగు .. 5.30 గంటల సమయాల్లో బాలుడికి తల్లి రత్నమ్మ పాలుపట్టి.. నిద్రలోకి జారుకుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన తల్లిదండ్రులు బిడ్డ కనిపించకపోవటంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.