anantagiri
-
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
జాతరకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మహాశివరాత్రి జాతరకు వెళ్లి వస్తూ ముగ్గురు యువకులు లోయలోపడి మృతిచెందారు. ఈ ఘటన అనంతగిరి మండలంలోని డముకు–నిమ్మలపాడు రోడ్డులోని రాయిపాడు సమీపాన ఆదివారం ఉదయం జరిగింది. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ దిగసల్తాంగి గ్రామానికి చెందిన రాపా బుట్టన్న (35), సీదరి రాంబాబు(21), బొండం గణేష్(18) కలిసి ద్విచక్రవాహనంపై బొర్రాలో మహాశివరాత్రి జాతరకు శనివారం బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి లంగుపర్తి గ్రామంలోని జాతరకు కూడా వెళ్లారు. రెండు ప్రాంతాల్లోనూ సరదాగా గడిపిన వారు ఆదివారం ఉదయం ఐదు గంటలకు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాయిపాడు సమీపంలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ఎగిరి లోయలో పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన బుట్టన్న, రాంబాబు, గణేష్ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ కరక రాము ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పండగ పూట విషాదం.. ఆడుకుంటూ వెళ్లి బకెట్లో పడటంతో
సాక్షి, వికారాబాద్: వికారాబాద్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. అంబాడుతూ వెళ్లిన ఏడాది బాలుడు బకెట్లో పడి మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి.. అనంతగిరి పట్టణంలోని పాత శిశు మందిరం సమీపంలో నివాసముండే దశరథ్, భాగ్యలక్ష్మికి ఇద్దరు సంతానం. వీరిలో చిన్నవాడు విఖ్యాత్ (1). పండుగ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎవరి పనుల్లో వారుండగా.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి బాత్రూంలోని బకెట్లో ఇరుక్కున్నాడు. తలకిందులుగా పడటంతో బకెట్లోనే ప్రాణాలు వదిలాడు. అరగంట తర్వాత బాబు కోసం చూడగా ఉలుకుపలుకు లేకుండా బకెట్లో పడి కనిపించాడు. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లోని ఓ షోరూంలో సెల్ ఫోన్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్తూ వికారాబాద్ స్టేషన్లో రైలు ఎక్కాడు. ఇంటి నుంచి ఫోన్ రావడంతో తిరిగివచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా గత నెల 24న విఖ్యాత్ తొలి పుట్టిన రోజు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. ఆ తీపి జ్ఞాపకాలు మరువకముందే చిన్నారి మృతి చెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది. చదవండి: Mukarram Jah: చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత.. -
వికారాబాద్: ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న
సాక్షి, అనంతగిరి: వారసత్వంగా వస్తున్న ఆస్తికోసం తన సొంత తమ్ముడిని హత్య చేసిన ఘటన శనివారం తెల్లవారుజామున వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణం ఆలంపల్లికి చెందిన బండ అడివిరెడ్డికి ముగ్గురు కుమారులు అంజిరెడ్డి, రఘుపతిరెడ్డి, గోవర్ధన్ రెడ్డిలు ఉన్నారు. వీరిలో అంజిరెడ్డికి వివాహమై భార్యతో కలిసి విడిగా ఉంటున్నారు. రఘుపతిరెడ్డికి సైతం వివాహమైంది. చిన్నవాడైన గోవర్ధన్‌రెడ్డి(34)కి ఇంకా వివాహం కాలేదు. వీరంతా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసత్వంగా వస్తున్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆస్తి పంపకాల విషయంలో పలుమార్లు గొడవ జరిగింది. శనివారం తెల్లవారుజామున అంజిరెడ్డి తన పక్క గదిలోనే నిద్రిస్తున్న చిన్న తమ్ముడు గోవర్ధన్‌రెడ్డి(34) నిద్రిస్తున్న రూంలోకి వెళ్లాడు. తమ్మునితో గొడవ పడి దారుణంగా హత్య చేశాడు. పెద్ద అరుపులు విన్న రఘుపతిరెడ్డి రూంలోకి వెళ్లి చూడగా అతనిపై సైతం దాడికి యత్నించాడు. దీంతో పెద్దగా అరవడంతో చుట్టు పక్కల వాళ్లు రావడంతో అక్కడి నుంచి అంజిరెడ్డి పారిపోయాడు. ఈ మేరకు రఘుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
భయపెట్టి అనంతగిరి భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భాగమైన అనంతగిరి జలాశయం నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించేందుకు ప్రభుత్వాధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయకుండానే భూముల్ని సేకరిస్తున్నారంటూ దాఖలైన మూడు వేరువేరు వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణలతో కూడిన ధర్మాసనం 52 పేజీల తీర్పును శుక్రవారం వెలువరించింది. హైకోర్టు 2016లో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయని... సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో, భూసేకరణ అధికారి అనంతరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, చిన్నకొండూరు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, పూర్వపు తహసీల్దార్ పరమేశ్వర్ల సర్వీస్ రికార్డుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లఘించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘ఉద్ధేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేదు. భూసేకరణ చట్టాలను అమలు చేయకుండా రైతులను భయపెట్టి వారితో భూ విక్రయ ఒప్పందపత్రాలపై సంతకాలు చేయించారు. రాజ్యాంగంలోని 14వ అధికరణ స్ఫూర్తిని దెబ్బతీశారు. రాత్రి వేళ ఖాళీ చేయించిన వారిలో 11 మంది ఎస్సీలు ఉన్నారు. ఇలా చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. భూములకు ధరల్ని నిర్ణయించడంలోనూ పద్ధతి లేకుండా వ్యవహరించారు. 2019 జనవరి 15న రైతుల నుంచి తీసుకున్న భూములకు వాటి ధర ప్రకారం పరిహారాన్ని ఖరారు చేసే ముందు రైతుల వాదనలు తెలుసుకోవాలి. ఇప్పటికే ఇచ్చిన పరిహారాన్ని రైతుల నుంచి తీసుకోకుండా... మూడు నెలల్లోగా చెల్లించబోయే పరిహారంలో సర్దుబాటు చేయాలి. హైకోర్టును ఆశ్రయించిన 61 మంది రైతులకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేల చొప్పున చెల్లించాలి. 2016లో వ్యవసాయ భూములకు, ఈ ఏడాది పిటిషనర్ల ఇళ్లను సేకరించేందుకు నోటిఫికేషన్లు వేరువేరుగా ఇచ్చారు కాబట్టి వాటికి వేరువేరుగానే పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్ఆర్ ప్యాకేజీ) ఇవ్వాలి. ఆర్ఆర్ చట్టంలోని నిబంధన ప్రకారం 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాని వారిని మరో కుటుంబంగా పరిగణించి వారికి కూడా పరిహారం చెల్లించాలి’అని హైకోర్టు తీర్పు చెప్పింది. -
అనంతగిరిలో కారు బీభత్సం
-
కారు బీభత్సం, ఎస్ఐకి తీవ్ర గాయాలు
సాక్షి, వికారాబాద్ : అనంతగిరిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎస్ఐపైకి కారు దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎస్ఐ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నూతన సంవత్సర వేడుక బందోబస్త్ లో యాక్సిడెంట్ కు గురి అయిన వికారాబాద్ S.I. శ్రీకృష్ణ త్వరగా కోలుకోవాలని వేడుకొంటున్నాను. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా మొక్కవోని ధైర్యం విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను pic.twitter.com/qTTjk58R1V — DGP TELANGANA POLICE (@TelanganaDGP) January 2, 2020 -
అనంతగిరిలో ఇక పారాగ్లైడింగ్..!
సాక్షి, అనంతగిరి: అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్కు అనుకూలంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌కు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం టూరిజం ఎండీకి అందజేస్తామని చెప్పారు. వివరాలు ఇలాఉన్నాయి.. వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్టను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలు అందుకున్న రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి గత నెల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న సిక్కిం రాష్ట్రానికి చెందిన అడ్వెంచర్ జోన్ ప్రతినిధులు పారాగ్లైడింగ్ ఏర్పాటుపై ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతగిరిలో పారాగ్లైడింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. వీరు ప్రతిరోజు అనంతగిరి చుట్టూ ఉన్న కొండప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి నుంచి విహారం ఎలా ఉంటుందో చూస్తున్నారు. గాలి ఎలా సహకరిస్తుంది..? గ్లైడింగ్‌లో పారాషూట్లు దిగడానికి అనుకూలమైన స్థలాలను అన్వేషిస్తున్నారు. సిక్కిం నుంచి వచ్చిన వీరు ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వీరికి అన్ని వసతులు కల్పించారు. వీరి వెంట వెళ్లి కొండల్లో గ్లైడింగ్ కోసం ప్రయత్నాలు చేశారు. కెరెళ్లి– జైదుపల్లి మధ్యలోని పాముల గుట్ట నుంచి నిర్వహించిన ట్రయల్‌రన్‌ను గురువారం ఆయన గుట్ట ఎక్కి స్వయంగా వీక్షించారు. అనంతరం పారాగ్లైడింగ్ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతగిరి కొండలు పారాగ్లైడింగ్ అనుకూలంగా ఉన్నాయని వారు ఎమ్మెల్యేకు చెప్పారు. ఈ ప్రాంతం శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కూడా అనుకూలంగా ఉందన్నారు. పారాగ్లైడింగ్తో పాటు జీప్లైన్, మౌంటేన్ బైకింగ్ తదితర వాటిని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం రాష్ట్ర టూరిజం ఎండీకి అందజేస్తామని స్పష్టంచేశారు. టూరిజం సీనియర్ సిబ్బంది మనోహర్, వికారాబాద్‌కు చెందిన ప్రదీప్ వీరికి సహాయంగా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రభాకర్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, రాజమల్లయ్య, నవీన్, అనంత్‌రెడ్డి, రాంరెడ్డి, రంగరాజు, గోపి, షఫీ తదితరులు ఉన్నారు. -
తెలంగాణ ఊటీగా అనంతగిరి..
వికారాబాద్ అర్బన్: అనంతగిరిని తెలంగాణ ఊటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి అనంతగిరి కొండల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి సబితారెడ్డి అనంతగిరి గుట్టను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. స్పందించిన సీఎం.. ఈ ప్రాంతాన్ని వెంటనే అభివృద్ధి చేయాలని ఆదేశించారని, మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కోసం ప్రణాళికలు, నివేదికలు సమర్పించాలని ఆదేశించారని పేర్కొన్నారు. అనంతగిరిని హాస్పిటల్ టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజంలా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వివరించారు. అధికారులంతా టీం వర్క్ చేసి 10 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. తాము మరోసారి సమావేశమై చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణలోనే అనంతగిరిని ఉత్తమ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని వివరాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేస్తున్నామని తెలిపారు. 10–15 రోజుల్లో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకే అందరం ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. -
ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి: మంత్రి
సాక్షి, రంగారెడ్డి: ‘ప్రాజెక్టులు పూర్తికావాలి.. బీడు భూముల్లో నీళ్లు పారి జిల్లా సస్యశ్యామలం కావాలి. పుష్కలంగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలి. ఇదే మా లక్ష్యం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి జిల్లా వాసుల కలను నెరవేరుస్తాం’ అని విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌పై తనకు కొండంత విశ్వాసం ఉందని, కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు–రంగారెడ్డిని కూడా పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని మూడేళ్ల వ్యవధిలోనే పూర్తిచేశారని.. ఇదే తరహాలో ఇక్కడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తారని అన్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సబిత మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషిచేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తామన్నారు. బడుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కష్టంగా మారిందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రముఖ కంపెనీలు, సంస్థలను సంప్రదించి వాటి సహకారం తీసుకుంటామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను పాఠశాలల కోసం ఖర్చుచేసేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లు కూడా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. అంతేగాక రియల్టర్లు, బిల్డర్లు కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఎంతో కొంత చేయాలన్న దృక్పథం ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. త్వరలో సమీక్ష.. జిల్లాలో ప్రభుత్వ విభాగాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్న మంత్రి.. వాటిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమీక్షకు హాజరయ్యేలా చూస్తానని అన్నారు. వీటిపైనా దృష్టి.. మ్యుచువల్లీ ఎయిడెడ్ ట్రిప్‌టైన్డ్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంఏటీసీఎస్) బ్యాంకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో పరిష్కారం చేస్తానని చెప్పారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్నాయని, ఇక్కడికి ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి కంపెనీలో స్థానికులకు 20 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందేనన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ స్పష్టం చేస్తున్నా.. కొన్ని కంపెనీలు పాటించడం లేదన్నారు. జీఓ ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూస్తానని పేర్కొన్నారు. అనంతగిరిని తీర్చిదిద్దుతాం ఎత్తయిన గుట్టలు, పచ్చని చెట్లతో అలరారే అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ విషయమై సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడి కార్యరూపం దాల్చేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువులో ఇంతటి సుందరమైన ప్రాంతం మరోటి లేదన్నారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు కృషిచేస్తామని సబిత అన్నారు. విస్తరణపై తాజాగా ఓ వ్యక్తి కేసు వేశారని, ఆయనతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తాండూరు ప్రాంతంలో కంది బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, దానిని సాధిచేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సహకారం తీసుకుంటామని ఆమె చెప్పారు. -
ఆపరేషన్ అనంతగిరి..!
సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–10లో భాగంగా రూ.2700 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు నుంచి మరో దశకు నీటి మళ్లింపునకు రంగం సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టులోకి మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గోదావరి జలాలు లక్ష్మీపూర్ పంపుహౌస్ ద్వారా సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి 12 రోజులుగా చేరుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. అనంతగిరి జలాశయానికి గోదావరి జలాలను తరలించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం అనంతగిరి ఊరును ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్జిపూల్ సిద్ధం మధ్యమానేరు బ్యాక్ వాటర్‌ను గ్రావిటీ ద్వారా ఒబులాపూర్ నుంచి తిప్పాపూర్ మహాబావి (సర్జిపూల్)కి మళ్లించే పనులు సాగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద బావిని సిద్ధం చేశారు. 92 మీటర్లు లోతు, 56 మీటర్ల వెడల్పుతో సర్జిపూల్‌ను నిర్మించారు. మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు 3.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వచ్చి ఒబులాపూర్ సొరంగం ద్వారా తిప్పాపూర్‌లోని మహాబావికి చేరుతాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల నాలుగు మోటార్లతో నీటిని అనంతగిరి రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు. ఇందు కోసం తిప్పాపూర్‌లో 440 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అనంతగిరి రిజర్వాయర్‌లో 3.5 టీఎంసీ నీటిని నిల్వ చేస్తారు. ఇప్పటికే నీటిపారుదలశాఖ అధికారులు తిప్పాపూర్‌లోని మోటార్లను వెట్‌రన్‌కు సిద్ధం చేశారు. అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఇల్లంతకుంట మండలంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. పునరావాస ప్యాకేజీ సిద్ధం ఇల్లంతకుంట మండలం అనంతగిరి నిర్వాసితుల కోసం పునరావాస ప్యాకేజీని సిద్ధం చేశారు. ఆ ఊరిలో 837 కుటుంబాలు ఉండగా.. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను కుటుంబా లుగా గుర్తించడంతో నిర్వాసితుల జాబితా 1,135 చేరింది. తంగళ్లపల్లి మండల కేంద్రం శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో మరో 70 ఎకరాలను పునరావాసం కోసం ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీని చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ప్లాట్లను ఇచ్చేందుకు లే అవుట్‌తో కూడిన పునరావాసం సిద్ధమైంది. 922 పట్టాలను పంపిణీకి సిద్ధం చేశారు. మరో 213 కుటుంబాలతో రెవెన్యూ అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు. అనంతగిరి ఊరును ఖాళీ చేయిస్తేనే.. మధ్యమానేరు నీరు అన్నపూర్ణ ప్రాజెక్టులోకి మళ్లించే అవకాశం ఉంది. ఇందు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, డీఆర్వో ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాస్‌రావులు తొలి ప్రాధాన్యతగా అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో నిమగ్నమయ్యారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్‌కు.. అనంతగిరిలో నిల్వ చేసిన నీటిని సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌కు ఎత్తిపోస్తారు. ఇప్పటికే ఎత్తిపోతలకు సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. రంగనాయకసాగర్ నుంచి కొండ పోచమ్మ, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ముందుగా కరీంనగర్ వద్ద ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)కి నీటిని విడుదల చేశారు. కానీ అనంతగిరి ప్రాజెక్టును ముందుగా నీటితో నింపాలనే లక్ష్యంతో ఎల్ఎండీకి నీటి విడుదలను నిలిపి వేశారు. సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలను ముందుగా తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. నీటి విడుదలకు సీఎం కేసీఆర్ మధ్యమానేరు నీటిని అనంతగిరి రిజర్వాయర్‌కు విడుదల చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మధ్యమానేరు వద్ద హెలీప్యాడ్ సిద్ధం చేశారు. అనంతగిరి నిర్వాసితుల పునరావాసం పూర్తి అయితే.. మధ్యమానేరులోకి 16 టీఎంసీల నీరు చేరగానే అనంతగిరికి నీటి విడుదల ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కరణకు సిద్ధమైంది. పునరావాసానికి ఏర్పాట్లు అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశాం. నిర్వాసితుల అభీష్టం మేరకు ప్లాట్లు కేటాయిస్తాం. ముందుగా అనంతగిరి వాసులు ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. పునరావాస ప్యాకేజీకి మెజార్టీ నిర్వాసితులు అంగీకరించారు. సంతకాలు చేయని వారి విషయంలో చట్టం ప్రకారం ముందుకు వెళ్తాం. టి.శ్రీనివాస్‌రావు, ఆర్డీవో, సిరిసిల్ల -
అనంతగిరిలో ఆయూష్ కేంద్రం
సాక్షి, వికారాబాద్: తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండపై ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణిలు తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిలో ఉన్న టీబీ ఆస్పత్రిని, వార్డులను తదితర భవనాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతగిరిలో టీబీ ఆస్పత్రితో పాటు ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో టీబీ ఆస్పత్రి మరమ్మతులకు విడుదలైన నిధులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు. ఆయూష్ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన భవన నిర్మాణాలకు, మరమ్మతులకు విడుదలైన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. ఇపుడు ఆయూష్ హాస్పిటల్ ప్రారంభించేందుకు రూ.6కోట్ల ని«ధులు మంజూరయ్యాయని విడతల వారీగా ఆయూష్ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయూష్ రాష్ట్ర కమిషనర్ అలుగు వర్షిణి మాట్లాడుతూ... దశాబ్దాలకు ముందే ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని, ప్రస్తుతం టీబీ రోగులు బాగా తగ్గారని వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి కొనసాగుతుందని కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక్కడ అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక వసతులు అన్నింటిని త్వరలోనే సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ ఆస్పత్రి సూపరిటెండెంట్ సుధాకర్‌షించే, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి పరిసరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఆయూష్ కమిషనర్ అలుగు వర్షిణి -
చిరుత కలకలం!
అనంతగిరి: మండల కేంద్రమైన అనంతగిరి వాసులు బుధవారం భయంతో వణికిపోయారు. దీనికి కారణం ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిందనే ప్రచారం జరగడమే. ఉదయం నుంచి సాయింత్రం వరకూ అనంతగిరిలోని శ్రీరామ గుడి సమీపంలో ఉన్న తుప్పల్లో చిరుత ఉన్నట్టు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న పీహెచ్సీ కాలనీ సమీపంలో ఉన్న కొండ నుంచి ఉదయం దిగివచ్చిన చిరుతపులి శ్రీరాముని గుడి వద్దకు వచ్చి తుప్పల్లోకి వెళ్లడం తాము చూశామని కొంతమంది చెబుతున్నారు. ఉదయం పూట కావడంతో జనసంచారం తక్కువగా ఉండడంతో పులిని కొద్దిమంది మాత్రమే చూశామంటున్నారు. గత ఏడాది కూడా అనంతగిరి అటవీ ప్రాంత గ్రామాల్లో జన్మభూమి మా–ఊరు కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందికి ఎగువశోభ పంచాయతీకి వెళ్లే మార్గమధ్యలో చిరుతపులి కనిపించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో గాలించిన అటవీశాఖ అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో పులి లేదని.. అధికారులు కనిపించింది దుమ్మలగుండగా తేల్చిచెప్పారు. అయితే తాజాగా మరోసారి అనంతగిరి ప్రాంతంలో చిరుత కనిపించిందని గిరిజనులు చెబుతుండడంతో ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
ప్రకృతి ఒడిలో ‘దక్కన్ ట్రేల్స్’
సాక్షి, హైదరాబాద్ : కాలుష్య కాంక్రీట్ కీకారణ్యంలో బతుకుతున్న వారికి అప్పుడప్పుడు అహ్లాదం కోసం అడవుల్లోకో, కనీసం ఊరవతలుండే కొండా కోనల్లోకో పోయి రావాలనిపిస్తోంది. అహ్లాదం కోసం కాకపోయినా ఆక్సీజన్ కోసమైనా అప్పుడప్పుడు అడవుల అంచుల దాకైన వెళ్లి రావాలి. అలాంటి వారి కోసమే కాకుండా వారి పిల్లా పాపల కోసం కూడా అందుబాటులో ఉన్నదే ‘దక్కన్ ట్రేల్స్’ విహార కేంద్రం. అక్కడి ‘సాహస క్రీడల్లో’ పిల్లలు ఊగిపోతుంటే పెద్దలు పిల్లల నాటి ఊసులతో తేలిపోవాల్సిందే. పచ్చటి పచ్చికల మీదుగా వీచే పైరగాలి విసురుకు యవ్వనం నాటి మధురానుభూతుల్లోకి మరొక్కసారి వెళ్లి రావాల్సిందే. ఇక వయస్సులో ఉన్న జంటలు ఊసులాడుకునేందుకు అనువైన చోటు. కాలుష్యం జాడలు కనిపించని ప్రశాంతమైన వాతావరణం. పక్కనే ఉన్న కొండగట్టుకెళితే అక్కడో ‘ఫ్యూ’ పాయింట్. అక్కడి నుంచి చూస్తే కళ్లముందు దట్టమైన అడవుల కనువిందు. అక్కడ అడవుల్లోకి ‘ట్రెక్కింగ్’ చేయడం అదనపు ఆనందం. ఉదయం, సాయంత్రం మాత్రమే ఇది అందుబాటులో ఉండే సదుపాయం. మనం ట్రెక్కింగ్ చేస్తుంటే జింకలు, నెమళ్లు, అడవి పందులు మన ముందునుంచే పరగులు తీస్తాయి. ఇక సీజన్లో పక్షుల కిలకిలారావాలు మన వీనులకు విందు చేస్తుంటే, ఇతర అడవి ప్రాణుల సందడి మన మదిలో ఒక విధమైన అలజడి రేపుతాయి. ఇంతటి అనుభూతిని కలిగించే ప్రాంతం మరెక్కడో కాదు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ ప్రాంతం. వాటి పక్కనే వికారాబాద్ రూట్లో, చేవెళ్లకు చేరువలో మన్నెగూడ పక్కన ‘దక్కన్ ట్రేల్స్’ పర్యాటక కేంద్రం ఉంది. అనంతగిరి హిల్స్‌ను కూడా దక్కన్ హిల్స్ అంటారుగనుక, వాటి పక్కనే ఉన్నందున దీనికి కూడా ‘దక్కన్ ట్రేల్స్’ అని పేరు పెట్టి ఉంటారు. పేరు ఎలా పెట్టినా అది మన దక్కన్ పీఠభూమిలో భాగమేకదా! ఉద్దేశపూర్వకంగానే అనంతగిరి అడవుల అందాలను ఆస్వాదించడం కోసమే పర్యాటక కేంద్రాన్ని అక్కడ అభివద్ధి చేశారు. పిల్లలు, యువతీయువకుల కోసం అందులో రాక్ క్లైంబింగ్, బర్మా తాళ్ల వంతెన, టార్జాన్ స్వింగ్, స్పైడర్ వెబ్ సాహస క్రీడలు ఉన్నాయి. ఇంకా జంపింగ్ స్ప్రింగ్ నెట్, బాక్సింగ్ కిట్లు సరేసరి. సైక్లింగ్, వాలీబాల్ మామూలే! అడవివైపు అందమైన ‘వ్యూపాయింట్’ ఉండగా, ఇవతలి వైపు నలుగురు కూర్చునే చిట్టి గుడిశె మరో ఆకర్షణ. అక్కడ కూర్చుంటే కొండ వాలుగా వీచే పైర గాలులకు కొదవ లేదు. అక్కడి నుంచి సాయంత్రం సూర్యాస్తమి చంద్రోదయాన్ని ఏకకాలంలో చూడడం అద్భుతమైన అనుభూతి. ఎంత ప్రకతిలో ఐక్యమైనా సమయానికి అన్న పానీయాలు అందకపోతే అదో వెలితే. ఆ వెలితి ఉండకుండా ఎప్పటికప్పుడు మనకు అన్న పానీయాలు అంద చేయడానికి పర్యాటక కేంద్రం సిబ్బంది సిద్ధంగా ఉంటారు. సైనికుల్లాగ దుస్తులు ధరించే వారు సైనికుల వల్లే యుద్ధ ప్రాతిపదికపై పరుగులు తీస్తూ పనిచేయడం మనల్ని ఆకట్టుకుంటుంది. ఎలాంటి పర్యాటక ప్రాంతమైనా, ముఖ్యంగా ఇలాంటి పర్యాటక ప్రాంతం వసంత, హేమంత, శీతాకాలాల్లో ఎక్కువ బాగుంటుంది. మిగతా సీజన్లో అంతటి పచ్చతనం తప్ప ఆహ్లాదకరంగానే ఉంటుంది. చలికాచుకునేందుకు ‘నెగళ్ల’ ఏర్పాటు కూడా ఉంది. అక్కడికి మామాలు రోజుల్లో 50 మంది వరకు వస్తుంటే, వీకెండ్లో, సెలవు రోజుల్లో 120కి పైగా పర్యాటకులు వస్తున్నారట. అంతమందికే అక్కడ శాశ్వత ప్రాతిపదికపై వసతులు ఉన్నాయి. వారి కోసం మంచి గుడారాలు (టెంట్లు) అందుబాటులో ఉన్నాయి. గుడారాల భద్రతను దృష్టిలో పెట్టుకొని కామన్ డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడం కోసం వసతి సదుపాయాలను పెంచుకుంటూపోతే ప్రశాంత వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే నూతన సంవత్సరం లాంటి వేడుకల్లో భాగంగా ఎక్కువ మందికి ఆతిథ్యం ఇవ్వడం కోసం తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేస్తారట. ఇంతగా చెబుతుంటే ఏ ఊటి, కొడైకెనాల్, కూర్గ్నో ఊహించుకోవద్దు! అవి మనకు చాలా దూరంలో ఉన్న ఖరీదైన పర్యాటకు కేంద్రాలు. ఒక్క హైదరాబాద్‌కే కాకుండా తెలాంగణ ప్రాంతం మొత్తానికి అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతం ఇది. పైపెచ్చు దేని అందం దానిదే. పర్యాటక కేంద్రం నుంచి మరికొన్ని కిలోమీటర్లు వాహనంలో ప్రయాణిస్తే నాగసముద్రం కాలువ, నాలుగు వందల ఏళ్ల నాటి అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ పర్యాటక కేంద్రంలో ఓ టెంట్‌ను బుక్ చేసుకోవాలంటే హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్డు నెంబర్ వన్‌లోని ఏబీకే ఓల్బీ ప్లాజాకు వెళ్లాలి. లేదంటే 9440638450 ఫోన్ ద్వారా సురేందర్ అనే కేర్ టేకర్‌ను సంప్రతించవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ‘డెక్కన్ ట్రేల్స్ డాట్ కామ్’ను సందర్శించాలి. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, అనంతగిరి: ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన జిల్లాకేంద్రం వికారాబాద్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి రాయిచూర్‌కు బొగ్గు లోడ్‌తో గూడ్స్ రైలు వికారాబాద్ మీదుగా వెళ్తోంది. బుధవారం తెల్లవారుజామున వికారాబాద్ సమీపానికి రాగానే కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 7 బోగీలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. బోగీలు కిందపడడంతో పట్టాలు పూర్తిగా దెబ్బతినఆనయి. అయితే రైలుముందు భాగం, వెనుకభాగానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం 7 బోగీలు ప్రమాదానికి గురవ్వగా 4 బోగీలు కిందికిదిగాయి. ఈ సంఘటనతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులు అక్కడికు చేరుకున్నారు. ప్రమాదం తీరును పరిశీలించారు. హుటాహుటిన సిబ్బందిని పిలిపించి జేసీబీతో బొగ్గును, కిందపడిన బోగిలను పక్కకు జరిపారు. బోగీలను పక్కకు తొలగించిన అనంతరం పట్టాలకు మరమ్మతు పనులు చేస్తున్నారు. బోగీలను రైల్వే ట్రాక్ మీద నుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణం బోగీల తప్పిదమా లేక రైలు పట్టాల తప్పిదమా తెలియాల్సి ఉంది.. కాగా ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఘటన స్థలాన్ని సికింద్రాబాద్ రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ రమేష్ చందర్, జీయం గజానంద్ మల్యా, డీఆర్‌యం ఆనంద్ భటియా, సీనియర్ డీవిజనల్ సెక్యూరిటి కమీషనర్ రామకృష్ణ, ఏఎస్స్ ఉజ్జల్ దాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్పాల్ లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది వచ్చారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా ఈ ప్రమాదంతో హైదాబాద్ నుంచి వికారాబాద్ వైపు వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పట్టాలు ఊడిపోవడంతో సిబ్బంది సరి చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లను చిట్టిగడ్డ రైల్వేస్టేషన్‌కు రాగానే నిలిపివేస్తున్నారు. వికారాబాద్ నుంచి హైదరా బాద్ వైపు వెళ్లే రైళ్లు లేని సమయంలో లేదా అటు నుంచి వచ్చే రైళ్లను ఆపి ఒకే ట్రాక్ మీద రైళ్ల రాకపోకలను కొనసాగించారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు రద్దు.. కాగా ప్రమాదంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హైదరాబాద్–గుల్బర్గా (57156), గుల్బర్గా–హైదరాబాద్(57155), సికింద్రాబాద్–తాండూరు (67250), తాండూరు–సికింద్రాబాద్ (67249) రైళ్లను రద్దు చేశారు. గుంటూరు నుంచి వికారాబాద్ వరకు వచ్చే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకే నడిపారు. సికింద్రాబాద్–వికారాబాద్ ప్యాసింజర్‌ను శంకర్పల్లి వరకే నడిపించారు. ఈ ప్రమాదంతో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లన్నీ సుమారు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్, తాండూరుకు వెళ్లే ఎన్నికల సిబ్బంది కూడా ఈ ప్రమాదంతో ఆలస్యంగా విధులకు చేరుకున్నారు. పలువురు ఉద్యోగులు బస్సుల్లో ప్రయాణించి ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. -
పీలారంలో స్వచ్ఛభారత్ రాష్ట్ర బృందం పర్యటన
అనంతగిరి: వికారాబాద్ మండలంలోని పీలారం గ్రామాన్ని రాష్ట్ర స్వచ్ఛభారత్ మిషన్ పరిశీలన బృంద ప్రతినిధులు శ్రావ్య, శ్రీనివాస్, ప్రదీప్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని బృందం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి స్వచ్ఛ్ భారత్ లక్ష్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతూ వేలాది గ్రామాలు ఓడీఎఫ్‌గా ప్రకటిస్తున్నాయని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో సైతం అన్ని గ్రామాలను త్వరలోనే ఓడీఎఫ్‌గా ప్రకటించే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రెండు గుంతలు తప్పకుండా తవ్వాలని సూచించారు. రెండు గుంతల మధ్య మీటర్ దూరం తప్పకుండా ఉండాలని ఆ దూరం వల్లనే ఎరోబిక్ చర్య జరిగి మలం ఎరువుగా మారుతుందని తెలిపారు. ప్రతీగుంతలో నాలుగు రింగులు వేయాలని సూచించారు. రింగుల మధ్య ఒక ఇంచు గ్యాప్ ఉండాలని, రెండు గుంతలకు జంక్షన్ బాక్స్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఒకదాన్ని మూసేసి రెండో దాన్ని ఓపెన్ ఉంచాలని సూచించారు. కుండీ ద్వారా మెయిన్ కనెక్షన్ జంక్షన్ బాక్స్‌కి ఇవ్వాలి. ఈ నిబంధనల మేరకే మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఖచ్చితంగా చెప్పారు. ఈ క్రమంలో వారు నిర్మించుకున్న, నిర్మింపబడుతున్నా ఇంకా నిర్మాణం ప్రారంభంకాని లబ్ధిదారులతో మాట్లాడి అన్ని విషయాలను వారితో చర్చించారు. నెలరోజుల్లోనే 60 మరుగుదొడ్లను నిర్మించుకునుటకు కాకుండా ఇంకా దాదాపు వంద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నందుకు గ్రామస్తులను, సర్పంచ్ మండల బృందాన్ని ఎఫ్ఏ నర్సింలును అభినందించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు సర్పంచ్ ప్రభావతి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మి, ప్రతినిధి కిరణ్, ఏపీఓ శీను, ఏపీఎం లక్ష్మయ్య, టీఏ రవి, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, వీఓ అధ్యక్షురాలు బేగం, ఈసీ నవీన్ పాల్గొన్నారు. -
సరియ జలపాతంలో వ్యక్తి గల్లంతు
అనంతగిరి (విశాఖపట్నం జిల్లా): విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం జాన్పాడు సమీపంలోని సరియ జలపాతంలో మోహినీ తంగల్(50) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు జలపాతం చూసేందుకు వెళ్లారు.వారిలో తంగల్ నీళ్లలో జారిపడిపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
100 కేజీల గంజాయి పట్టివేత
అనంతగిరి (విశాఖపట్నం జిల్లా) : అనంతగిరి మండలం తోకూరు పంచాయతీ ముల్లెగూడ పెట్రోలు బంకు సమీపంలో 100 కేజీల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్కోడా కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
20 కిలోల గంజాయి పట్టివేత
అనంతగిరి (విశాఖపట్నం) : అనంతగిరి మండలం బొర్రా రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓ బోలెరో వాహనంతో పాటు మరో బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
20 కిలోల గంజాయి పట్టివేత
అనంతగిరి (విశాఖపట్నం) : ఒడిశా నుంచి జార్ఖండ్‌కు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయిని అనంతగిరి పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డమకు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్-లారీ ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు
విశాఖపట్నం (అనంతగిరి) : ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతగిరి మండలం బీస్పురం గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పూజారి శివనాయుడు అనే వ్యక్తికి కుడికాలు విరగగా, కోనేటి సద్దు అనే వ్యక్తికి ఎడమకాలు విరిగింది. క్షతగాత్రులను హుటాహుటిన విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
50 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం (అనంతగిరి) : ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సాలోని జైపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తుండగా అనంతగిరి వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
స్ట్రాంగ్‌రూంల భద్రతపై నిర్లక్ష్యం వద్దు
అనంతగిరి, న్యూస్‌లైన్: ఈవీఎంలు భ ద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రత ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించకూడదని, వాటిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా చేపట్టాలని, లాగ్‌బుక్‌లు, సీసీ టీవీలపై రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్ మహావీర్ వైద్య కళాశాలలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌కు సంబంధించిన స్ట్రాంగ్‌రూంలను ఆయన పరిశీలించారు. మొత్తం ఎంతమంది పోలీసులతో భద్రత ఏర్పాట్లను చూస్తున్నారని ఆయన పోలీస్ అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద కళాశాల నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎందుకు ఉందని.. దాన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం సమీపంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం భద్రత విషయంలో ఇన్చార్జి అధికారి ఎవరని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ ఎస్ఐ ఉన్నాడని.. ప్రస్తుతం ఆయన బయటికి వెళ్లాడని వికారాబాద్ సీఐ లచ్చిరాం నాయక్ బదులిచ్చారు. ఇన్చార్జిగా ఎవరినైతే నియమించామో ఆ అధికారి ఇక్కడే ఉండాలి కదా అని కలెక్టర్ పేర్కొన్నారు. లాగ్‌బుక్ ఎక్కడ ఉందని ఆరా తీయగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులపై శ్రీధర్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద గట్టి భద్రత ఉండాలని అడిషనల్ఎస్పీ వెంకటస్వామిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూం భద్రతపై రిటర్నింగ్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక పోలీస్ శాఖ నుంచి ముఖ్య ద్వారం వద్ద భద్రత పటిష్టం చేయాలని, స్థానిక సివిల్ పోలీస్ అధికారిని ఇక్కడ ఇన్చార్జిగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సీసీ టీవీలు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు. కౌంటింగ్ రోజు మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. లోపలికి ఎవరూ రాకుండా గట్టి భద్రత చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, పరిగి రిటర్నింగ్ అధికారి సంధ్యారాణి, చేవేళ్ల ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ నర్సింలు, ఆయా నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. -
మర్రి చెన్నారెడ్డికి ఘన నివాళి
అనంతగిరి, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్దంతిని పురస్కరించుకుని సోమవారం పలువురు నాయకులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. వికారాబాద్ బస్‌డిపో ఎదుట ఉన్న చెన్నారెడ్డి విగ్రహానికి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాహిద్‌మియా, మార్కెట్ కమిటీ చైర్మన్లు శశాంక్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సంగమేశ్వర్, సేవాదళ్ అద్యక్షుడు చంద్రశేఖర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింలు, టీటీడీ మాజీ సభ్యుడు కాలె యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ కిషన్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘవన్‌నాయక్, రాష్ట్ర కో ఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, జిల్లా అధికార ప్రతినిధి రత్నారెడ్డి పాల్గొన్నారు. నివాళులు అర్పించిన చెన్నారెడ్డి మనుమడు మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి పురూరవరెడ్డి చెన్నారెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్ఏపీ కళాశాలలోని విగ్రహానికి కళాశాల తరపున పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... వికారాబాద్ వాకర్స్ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి తస్వర్ అలీ, జాయింట్ సెక్రటరీ మో ముల రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
పరిష్కరించలేని సమస్యలేవీ ఉండవు
అనంతగిరి, న్యూస్‌లైన్: చట్టం పరిధిలో పరిష్కరించలేని సమస్యలంటూ ఏవీ ఉండవని, వాటి పరిష్కారానికి అవసరమైన చట్టాలపై న్యాయవాదులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట పర్యాటక కేంద్రంలో రాష్ట్ర బార్ కౌన్సిల్, వికారాబాద్ బార్ కౌన్సిల్ల సంయుక్త ఆధ్వర్యంలో సివిల్, రెవెన్యూ, క్రిమినల్ చట్టాలు, ప్రాథమిక న్యాయసూత్రాలు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ తన జీవితంలో వివిధ చట్టాల అవసరం ఉంటుందన్నారు. వారికేమైనా సమస్యలు ఏర్పడినపుడు చట్టాలను తగినవిధంగా వినియోగించి న్యాయం చేయాలని న్యాయవాదులకు సూచించారు. అలాగే ఆయా చట్టాలపై సంపూర్ణ విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పారు. గ్రామాల్లో పేదలకు తమ హక్కులపై అవగాహన ఉండదని, అన్యాయం జరిగినా ప్రశ్నించలేరని అన్నారు. ఇటువంటి కేసుల్లో వారికి అన్ని విధాలా సహాయపడాలని చెప్పారు. అలాగే భూసంస్కరణలకు సంబంధించిన చట్టాల పూర్తి అవగాహన కలిగిఉంటేనే, ఆయా కేసుల్లో పేదలకు న్యాయం చేసేం దుకు వీలుంటుందని చీఫ్ జస్టిస్ గుప్తా వివరించారు. మనదేశంలో 26 శాతం మంది న్యాయపరమైన వివాదాల్లో ఉన్నా 0.6 శాతం మంది మాత్రమే కోర్టులకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాల వేదిక, లోక్ అదాలత్ వంటివి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రెవెన్యూ చట్టాలపై హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి, క్రిమినల్ చట్టాలపై కె.సి.భాను న్యాయవాదులకు అవగాహన కల్పించారు. జాతీ య బార్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, కార్యదర్శి రేణుక, ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, జిల్లా జడ్జి ఎంఎస్కే జైస్వాల్ పాల్గొన్నారు.